DrOSK_BhagavadGita_Parayanam_TeluguBlurbs+EnglishBlurbs_Pravachanam_Chapter15

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 7

  • @sivakesavamodde4314
    @sivakesavamodde4314  3 роки тому

    హరిః ఓమ్, Dr. Odde Sivakesavam. Scientist (Retd.,), DRDO. Ph. No : (C) 6300226286 & 9441189616.
    ప్రియాత్మ బంధువులారా!
    వృత్తి రీత్యా సైన్టిస్ట్, ప్రవృత్తి రీత్యా ఆధ్యాత్మిక రంగంలో భగవద్గీత ను అధ్యయనం చేసి, ఋషి సాంప్రదాయం లో చేరి, వ్యాసాశ్రమ సాంప్రదాయం లో శ్రీ సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారి అడుగు జాడల్లో నడిచి, శ్రీ సద్గురు రామేశ్వరా నంద స్వాముల వారి వద్ద మంత్రదీక్ష తీసుకుని సాధన చేసి, మా దంపతులం ఇరువురం గృహస్థ అశ్రమం లో వుంటూ పరమాత్మ కరుణతో జీవన్ముక్తిని సాధించాము.
    భగవద్గీత కు అంకితమై శేష జీవితాన్ని గడుపుతున్నాను. గమనించగలరు.
    నేను గత 32 సంవత్సరాలలో, భగవద్గీతా సాధనలో *సాధించిన దాన్నంతటినీ*, కాచి వడపోసి మీకు ఈ *పురుషోత్తమతత్వ్తాన్ని* పొందే మార్గాన్ని *వివరంగా విపు లీకరిo చి* చెప్పాను ఈ వీడియో లో.
    దీన్ని మీరు *పదే,పదే, పదే, పదే* విని అర్ధం చేసుకుని *తరించండి*.ఇంతకన్నా వేరే మార్గం లేదు.భగవానుడను గ్రహించు గాక!
    మీకేమన్నా సందేహాలు వుంటే దయచేసి సంప్రదించండి.
    హరిః ఓమ్. హరిః ఓమ్.

  • @sivakesavamodde4314
    @sivakesavamodde4314  3 роки тому

    హరిః ఓమ్, Dr. Odde Sivakesavam, Scientist (Retd.,), DRDO, DMRL, Hyderabad Ph : (C)6300226286.
    నేను, నా ధర్మపత్ని గృహస్తఆశ్రమంలో వుంటూ, వ్యాసాశ్రమ సాంప్రదాయం లో సాధన చేసి తరించాము. మా వివరాలు ఈ క్రింది comments లో యిచ్చాము. చదవండి.
    శ్రీ మలయాళ స్వామి జీవిత చరిత్ర -3వ భాగం.👇:
    ua-cam.com/video/Kcy44BYnLOY/v-deo.html
    హరిః ఓమ్. హరిః ఓమ్.

  • @sivakesavamodde4314
    @sivakesavamodde4314  3 роки тому

    హరిః ఓమ్,Odde Sivakesavam, హరిః ఓమ్.
    🕉️గీతా మహాత్మ్యం. (గీత యొక్క గొప్పతనం).🕉️
    
    ▪️ఈ గీతా మహిమ వరాహ పురాణంలో చెప్పబడింది
    భూదేవి (మహా లక్ష్మి) శ్రీమహావిష్ణువును సంప్రదించి ఇలా ప్రశ్నించింది: ▪️ "తన ప్రారబ్ధంతో బంధించబడిన వ్యక్తి నీపై నిరంతరం భక్తిని ఎలా కొనసాగించాలి?"....
    *▪️*"గీతా ధ్యానం చేసేవాడు ఆ స్థితిని పొందుతాడని భగవంతుడు సమాధానమిచ్చాడు."
    *▪️**""గీతా గ్రంథం ఎక్కడ ఉంచబడిందో, ఎక్కడ గీతా అధ్యయనం చేయబడుతుందో, ఆ ప్రదేశం ప్రయాగ & కాశీ వలె పవిత్రమైనదిగా పరిగణించబడుతుందని భగవంతుడు నొక్కి చెప్పాడు."
    ***▪️*"ఎక్కడ గీతను అభ్యసించినా, జపించినా, విన్నా భగవంతుడు ప్రత్యక్షంగా ఉంటాడు.గీత అనేది నా సర్వోన్నతమైనది, అత్యున్నతమైన జ్ఞానం మరియు నా అనిర్వచనీయ స్థితి యొక్క సారాంశం."
    ****▪️*"అన్ని వేదాలు మరియు ఉపనిషత్తుల సారాంశం గీత.
    గీతలోని మొత్తం 18 అధ్యాయాలను దృఢమైన భక్తితో పఠించే వ్యక్తి స్వేచ్ఛ (మోక్షం) పొందేందుకు అవసరమైన జ్ఞానాన్ని పొందుతాడు".
    *****▪️*"ఎవరైనా గీతలోని 9 అధ్యాయాలను పఠిస్తే, అతడు/ఆమె ఆవును బహుమతిగా ఇచ్చిన "గో ధన" పుణ్యాన్ని పొందుతాడు.గీతలో మూడవ వంతు పఠించినవాడు గంగాస్నానానికి సమానమైన పుణ్యాన్ని పొందుతాడు.ఆరవ వంతు పారాయణ చేసిన వారికి సోమ యాగ ఫలం లభిస్తుంది.భక్తితో రోజుకొక అధ్యాయం పఠిస్తే కైలాసానికి వెళ్తాడు.ప్రతిరోజూ ఒక అధ్యాయంలో నాలుగవ వంతు లేదా ఒక శ్లోకాన్ని పఠిస్తే 308 మిలియన్ సంవత్సరాల మన్వంతర (71 మహా యుగాలు) వరకు మానవ జన్మ లభిస్తుంది".
    ******▪️*"10,7,5,4,3,2,1 లేదా ఒక శ్లోకంలో సగం పఠించినవాడు పదివేల సంవత్సరాలకు చంద్రలోకాన్ని పొందుతాడు."
    *******▪️*"గీతను పఠిస్తూ ఈ శరీరాన్ని విడిచిపెట్టినవాడు మోక్షాన్ని పొందుతాడు.ఒకరు రోజువారీ జీవితంలో విధులను నిర్వర్తిస్తూ, గీత యొక్క అర్థాన్ని ధ్యానిస్తే, ఈ జీవితంలో 'జీవన్ ముక్తిని' మరియు శరీరం పడిపోయినప్పుడు 'విదేహ ముక్తిని' పొందుతుంది."
    ********▪️*"గీత యొక్క అర్థాన్ని వినడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఇష్టపడితే, ఘోరమైన నేరస్థుడు కూడా విష్ణువు యొక్క ఆనందాన్ని అనుభవిస్తాడు".***▪️గీతాభ్యాసన సమయంలో ఈ గీతామహత్యం పఠించని వారికి ఈ పుణ్యం దక్కదు.***▪️
    హరిః ఓమ్. హరిః ఓమ్.

  • @sivakesavamodde4314
    @sivakesavamodde4314  2 роки тому

    హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.
    శ్రీ రాంపల్లి నరసింహారావు గారు, [Sr. Manager, Andhra Bank (Retd.,)] భగవద్గీతా రచయిత Dr. Odde Sivakesavam గారి మీద వ్రాసిన *పద్య పరిమళాలు*👇:
    హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.
    *శ్రీ నరసింహారావు గారి పద్యపరిమళాలు* :
    "ఆధ్యాత్మికానంద మందార మకరంద
    మాధుర్యమును గ్రోలు మహిత మూర్తి!
    హరిఓం పిలుపుతోడ అందరి హృదయాల
    ఆకట్టుకొనియెడి ఆర్ష పుత్ర!
    దైవ సాక్షాత్కార దివ్యానుభూతిని
    దివ్యమ్ముగాగొన్న భవ్య యశుడ!
    శాస్త్రవేత్తగ సదా సముచిత రీతిలో
    సేవలనిడినట్టి శ్రీకరుండ!
    అహము కానరాని ఆచార్య శేఖరా!
    పసిడి పలుకు నీది పావనుండ!
    ఎత్తుకెదిగినావు ఎంతేని దీక్షతో
    ఒదుగుటెరిగినట్టి ఉజ్జ్వలుండ!"
    "దొడ్డ బుద్ధి కలిగి వడ్డె వంశ జలధి
    చంద్రువైతి వయ్య జగతిలోన
    సంఘ సేవలోన సర్వేశు జూచుచు
    యాత్ర జేయుచున్న యతివి నీవు"
    "కర్మ యోగివీవు కరుణాంతరంగుడా
    జ్ఞాన రాశివీవు ఘనయశుండ
    నీదు అనుభవాలు నిఖిలజనులకెన్న
    మార్గదర్శకములు మౌనివర్య!"
    "వెతల బాప గలుగు గీతను నేర్చి నీ
    వాచరించి నావు వాసి గాను
    సకలమబ్బె నీకు సర్వేశు కరుణతో
    లేమి యనెడి మాట లేదు నీకు."
    "శ్రీకరుండ వీవు శివకేశమా మిమ్ము
    అక్షరాల నిలుపు నంత శక్తి
    లేశమైన లేనె లేదు తండ్రీ నీదు
    దీవెనాళి మాకు దీప్తినొసగు".
    "బ్రతుకు కర్థ మరసి బ్రహ్మాండమౌరీతి
    దినము గడపు చున్న ధీయుతుండ
    పరమశివుని కరుణ పరిపూర్ణముగబొంది
    వంద వత్సరములు వరలుమయ్య!"
    🙏🙏🙏🙏🙏
    *రాంపల్లి నరసింహా రావు*.
    హరిః ఓమ్.

  • @sivakesavamodde4314
    @sivakesavamodde4314  3 роки тому

    హరిః ఓమ్, Odde Sivakesavam. *Phone Number: 6300226286*.
    హరిః ఓమ్.హరిః ఓమ్.హరిః ఓమ్.
    ఈ వీడియో లో ( ప్రశ్నలు/సందేహాలు - సమాధానాలు -అనే శీర్షిక క్రింద ) శ్రీ జయరామ శర్మ (వేద పండితులు, బిర్లా టెంపుల్, Kurnool ) గారు అడిగిన రెండు ప్రశ్నలకు Dr. Odde Sivakesavam గారు చెప్పిన/ఇచ్చిన సమాధానాలు వున్నాయి. *వినగలరు*. అలానే, మీ మీ సందేహాల్ని/ప్రశ్నల్ని( *దేవుడు/దైవం/భగవద్గీత మీద* ) నిస్సందేహంగా అడగవచ్చును. *Voice /phone/SMS/whats app.messages/ You -tube comments ద్వారా*.
    ua-cam.com/video/Hj7lh_Tmhrs/v-deo.html
    హరిః ఓమ్. హరిః ఓమ్. హరిః ఓమ్.

  • @sivakesavamodde4314
    @sivakesavamodde4314  3 роки тому

    డాక్టర్ ఒడ్డే శివకేశవం, శాస్త్రవేత్త (రిటైర్డ్,), DRDO, DMRL, హైదరాబాద్.
    డాక్టర్ ఒడ్డే శివకేశవం, శాస్త్రవేత్త (రిటైర్డ్.), DRDO.
    గ్రంథ సమీక్ష, సప్తగిరి మాసపత్రిక ,TTD, తిరుపతి, జూలై 2012. by డా ll కంపల్లె రవి చంద్రన్.
    భగవద్గీత భారతీయుల తాత్విక ఔన్నత్యాన్ని తెలిపే మహోన్నత గ్రంధం. మహాభారతం లోని భీష్మపర్వం లో వున్న ఈ 18 అధ్యాయాల విషయం త్రిమతా చార్యులకు కూడా ప్రామాణిక మనడం లో విప్రతి పత్తి లేదు. శంకరుని మొదలు వ్యక్తిత్వ వికాస శిక్షణ నిచ్చే ఆధునికుల వరకు ఎందరో భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాశారు. ఆ అభిప్రాయం సంప్రదాయ పరిధిని అతిక్రమించకుండా వెలువడిన మరొక వ్యాఖ్యాన గ్రంధమే శ్రీమద్భగవద్గీతా ముక్తిసోపానము. వ్యాఖ్యాత :డా ll ఒడ్డె శివకేశవం.
    ఆంధ్రదేశంలో భగవద్గీతకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించి, స్త్రీల చేత గీతాపారాయణ చేయించిన వైతాళికులు శ్రీ శ్రీ శ్రీ మలయాళ యతీంద్రులవారు. వారి అడుగుజాడల్లో, తురీయ పురుషార్థమైన మోక్షమే పరమ ఫలంగా వ్యాఖ్యానాన్ని సంతరించుకుని డా ll ఒడ్డె శివకేశవం తాము ముక్తులైనట్లు ప్రకటించుకున్నారు. భగవద్గీత లోని కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల భిన్నత్వంలో అంతస్సూత్రమైన కర్మఫలత్యాగాన్ని వీరు పరిశీలించిన తీరు ఆకర్షణీయంగా, వినయంగా ఉంది. పద విభాగం, ప్రతి పదార్ధం లేకుండా పాఠకులు నేరుగా తాత్పర్యం, తర్వాత వ్యాఖ్యానం లోనికి వెళ్లే అవకాశం కలుగజేసారు.
    9వ అధ్యాయం 4,5 శ్లోకాలు భౌతికంగా విరుద్ధ భావాలు కలిగి ఉంటాయి, పరమాత్మ తత్వాన్ని విశద పరిచే విధంగా ఉంటాయి.6వ శ్లోకం పై రెంటినీ అర్థం ఒక ఉపమాన శ్లోకం. ఈ మూడింటి వ్యాఖ్యానం లో వీరు చూపిన పాండిత్యం వీరి అద్వైత తాత్విక నేపత్యాన్ని విశదపరుస్తుంది. "అద్వైతమే విశ్వసూత్రం" అనే సూత్రం ఆధారంగా నిర్మాణమైన ఈ వ్యాఖ్యానం శంకర భాష్యానికి తోబుట్టువు కాగలదు. వీరి భాష మధురంగా ​​వున్నది. విషయంలో వున్న భారం భాషలో లేని కారణంగా గీతాతత్వాన్ని తేలికగా అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఆస్తికుని మెదడుకు ఆహారమైన గీతను, డా ll ఒడ్డె శివకేశవం కొత్త రుచులతో వడ్డించిన వైనం అభినందనీయం. ఈ గ్రంథం పఠనీయం.
    డా ll కంపల్లె రవి చంద్రన్.
    హరిః ఓమ్.
    11

  • @sivakesavamodde4314
    @sivakesavamodde4314  3 роки тому

    హరిః ఓమ్, Dr. Odde Sivakesavam. Scientist (Retd.,, DRDO. Ministry of Defence.), Ph. No : 6300226286 & 9441189616.
    ప్రియాత్మ బంధువులారా!
    నేను గత 32 సంవత్సరాలలో, భగవద్గీతా సాధనలో *సాధించిన దాన్నంతటినీ*, కాచి వడపోసి మీకు ఈ *పురుషోత్తమతత్వ్తాన్ని* పొందే మార్గాన్ని *వివరంగా విపు లీకరిo చి* చెప్పాను ఈ వీడియో లో.
    దీన్ని మీరు *పదే,పదే, పదే, పదే* విని అర్ధం చేసుకుని *తరించండి*.ఇంతకన్నా వేరే మార్గం లేదు.భగవానుడను గ్రహించు గాక! హరిః ఓమ్. హరిః ఓమ్.