గార్లిక్ బట్టర్ పొటాటో బాల్స్ | Garlic Butter Potato Balls | Potato Snacks Recipes | Finger Foods

Поділитися
Вставка
  • Опубліковано 22 чер 2024
  • గార్లిక్ బట్టర్ పొటాటో బాల్స్ | Garlic Butter Potato Balls | Potato Snacks Recipes | Finger Foods ‪@HomeCookingTelugu‬
    #potatoballs #crispypotatoballs #potatosnacksrecipes #potatorecipes #fingerfoodideasforparty #aloorecipes #aloosnacks #partysnacks #snacks #garlicbutterpotatoballs #kidssnacks
    పొటాటో బాల్స్ చేయడానికి కావలసిన పదార్థాలు:
    పొటాటోస్ - 5
    ఉప్పు - 1 టీస్పూన్
    చిల్లీ ఫ్లేక్స్ - 1 టీస్పూన్
    మిరియాల పొడి - 1 టీస్పూన్
    ఇటాలియన్ మసాలా - 1 టీస్పూన్
    వెల్లుల్లి - 2 టీస్పూన్లు
    కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
    నూనె
    వెల్లుల్లి సాస్ చేయడానికి కావలసిన పదార్థాలు:
    ఉప్పు లేని వెన్న - 3 టేబుల్ స్పూన్లు
    వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్
    ఇటాలియన్ మసాలా - 1 టీస్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    కొత్తిమీర
    పొటాటో బాల్స్ తయారీ విధానం :
    ముందుగా పొటాటోస్ ని బాగా ఉడికించుకోవాలి ,
    దీనికోసం ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని ఒక ఐదు
    పొటాటోస్ ని తొక్క తీసి నాలుగు ముక్కలుగా కట్
    చేసి స్లో గా నీళ్లలో వేసుకోవాలి .
    పొటాటోస్ బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి .
    ఇపుడు ఉడికించిన పొటాటోస్ ని బయటికి తీసి నీరు
    మొత్తం పోయే వరుకు పక్కన పెట్టుకోవాలి .
    పొటాటో మేషర్ తో పొటాటోస్ ని బాగా మెత్తగా మెష్
    చేసుకోవాలి , ఇంకా ముక్కలు ఉన్నట్టు అనిపిస్తే
    ఫోర్క్ సహాయం తో ఇంకోసారి మెత్తగా మెష్
    చేసుకోవాలి .
    ఇందులోకి ఇపుడు ఒక ( 1 tsp ) టీస్పూన్ ఉప్పు , ఒక
    ( 1 tsp ) టీస్పూన్ చిల్లి ఫ్లక్స్ , ఒక ( 1 tsp ) టీస్పూన్
    మిరియాల పొడి , ఒక ( 1 tsp ) ఇటాలియన్ సీసానింగ్ ,
    రెండు ( 2 tsp ) టీస్పూన్ల కట్ చేసుకున్న వెల్లులి ,
    రెండు ( 2 tbsp ) టేబుల్స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసి బాగా
    కలిసేటట్టు కలుపుకోవాలి .
    ఇవీ మిశ్రమాన్ని గట్టిగా అవడానికి ఉపయోగ
    పడతాయి . ఒకసారి మిశ్రమం రెడీ ఐన తరువాత ,
    కొంచం నూనె తీసుకొని అరచేతులకి బాగా రాసుకొని
    చిన్న చిన్న బాల్స్ గా చేసుకోవడం మొదలు
    పెట్టాలి .
    పొటాటో బాల్స్ అన్ని సమానంగా , చిన్నగా , రౌండుగా
    వచేటటు చేసుకోవాలి .
    ఇపుడు ఒక కడై తీసుకొని డీప్ ఫ్రై కి సరిపడే అంత
    నూనె వేసి బాగా కాగనివ్వాలి , తరువాత మంటని
    మీడియం ఫ్లేమ్ లో పేటి బాల్స్ ని ఒకదాని
    తరువాత ఒకటి ఐదు సెకండ్ల గ్యాప్ తో నెమ్మదిగా
    నూనె లోకి వేసుకోవాలి .
    పొటాటో బాల్స్ ని క్రమంగా కలుపుతూ ఉండాలి ,
    దీనివల్ల బాల్స్ అన్ని సమన రంగు లో బాగా ఫ్రై
    అవుతాయి . మిగతా బాల్స్ అన్నిటిని కూడా ఇదే
    క్రమం లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి .
    వెల్లులి సాస్ తయారీ విధానం :
    సాస్ కోసం ముందుగా ఒక ప్యాన్ లోకి మూడు
    టేబుల్స్పూన్లు ( 3 tbsp ) ఉప్పు లేని బట్టర్ ని
    వేసుకోవాలి . ఇందులోకి ఒక టేబుల్స్పూన్ ( 1 tbsp )
    చిన్నగా కట్ చేసుకున్న వెల్లులి , ఒక టీస్పూన్
    ( 1 tsp ) ఇటాలియన్ సీసానింగ్ , ఒక టీస్పూన్ ( 1 tsp )
    ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి .
    బట్టర్ కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర
    వేసుకోవాలి. మనం బట్టర్ ని ఎక్కువ సేపు హీట్
    చేయాల్సిన అవసరం లేదు . అంతే గార్లిక్ బట్టర్
    సాస్ కూడా రెడీ ఐపోయినట్లే.
    నెమ్మదిగా గార్లిక్ బట్టర్ సాస్ ని పొటాటో బాల్స్ పైన
    మొత్తం కోట్ అవేటటు వేసుకుంటే ఎంతో టేస్టీ
    అండ్ సింపుల్ గార్లిక్ బట్టర్ పొటాటో బాల్స్ రెడీ
    ఐనట్టే .
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / home.cooking.telugu
    A Ventuno Production : www.ventunotech.com
  • Навчання та стиль

КОМЕНТАРІ • 10