పోషకాల నిధి కాబూలీ శనగలతో ఒక కమ్మటి పులావ్ రెసిపీ Kabuli Chana Pulao @Homecookingtelugu

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • కాబూలీ శనగలలో ప్రోటీన్, ఫైబర్, ఎన్నో విటమిన్స్, మినరల్స్ లాంటి పోషకాలున్నాయి. అయితే, ఎప్పుడూ చోలే కర్రీ మాత్రమే కాకుండా, వీటితో ఒక రుచికరమైన పులావ్ రెసిపీ ఎలా చేయాలో మీరు ఈ వీడియోలో చూసి నేర్చుకోవచ్చు. తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.
    #chanapulao #pulaorecipes #ricerecipe
    Here's the link to this recipe in English: bit.ly/3IiWddq
    తయారుచేయడానికి: 10 నిమిషాలు
    వండటానికి: 40 నిమిషాలు
    సెర్వింగులు: 3
    కావలసిన పదార్థాలు:
    కాబూలీ శనగలు - 250 మిల్లీలీటర్లు
    పసుపు - 1 / 2 టీస్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    లవంగాలు - 3
    బిర్యానీ ఆకు - 1
    నీళ్ళు
    బాస్మతీ బియ్యం - 300 గ్రాములు
    నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
    నూనె - 2 టేబుల్స్పూన్లు
    మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జీలకర్ర, సోంపుగింజలు)
    ఉల్లిపాయలు - 2 (పొడవుగా తరిగినవి)
    పచ్చిమిరపకాయలు - 5 (పొడవుగా తరిగినవి)
    టొమాటోలు - 4 (చిన్నగా తరిగినవి)
    ఉప్పు - 1 టీస్పూన్
    కారం - 2 టీస్పూన్లు
    ధనియాల పొడి - 1 టీస్పూన్
    చనా మసాలా పొడి - 2 టీస్పూన్లు
    పుదీనా ఆకులు
    కొత్తిమీర
    వేడి నీళ్ళు - 2 కప్పులు
    తయారుచేసే విధానం:
    ముందుగా కాబూలీ శనగలను రాత్రంతా లేదంటే కనీసం ఎనిమిది గంటల పాటు నానపెట్టి ఉంచాలి
    నానిన శనగలను ఒక కుక్కర్లో వేసి, అందులో పసుపు, ఉప్పు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి, నీళ్లు పోసి, పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి, నాలుగు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించి, పక్కన పెట్టుకోవాలి
    అలాగే ఒక బౌల్లో శుభ్రంగా కడిగిన బియ్యాన్ని వేసి, సరిపడా నీళ్ళు పోసి కనీసం ముప్పై నిమిషాలు నానపెట్టాలి
    ఇప్పుడు ఒక లోతైన గిన్నెలో నెయ్యి, నూనె వేసి, అందులో మసాలా దినుసులు వేసి వేయించాలి
    తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించి, అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేయాలి
    ఉల్లిపాయలు వేగి, అల్లం వెల్లుల్లి పేస్టులో పచ్చివాసన పోయిన తరువాత తరిగిన టొమాటోలు వేసి కలపాలి
    టొమాటోలు కాస్త మగ్గిన తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, చనా మసాలా పొడి వేసి కలపాలి
    తరువాత ఉడికించిన శనగలు, వాటి నీళ్ళు కూడా పోసి రెండు మూడు నిమిషాలు మరిగించాలి
    ఇందులో పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి కలిపిన తరువాత నానపెట్టిన బాస్మతీ బియ్యం వేసి కలపాలి
    బియ్యంగింజ విరగకుండా మొత్తమంతా జాగ్రత్తగా కలిపి, గిన్నెకి ఒక మూత పెట్టి, పులావును కనీసం పావు గంటసేపు ఉడికించాలి
    అంతే, రుచికరమైన శనగల పులావ్ తయారైనట్టే, దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసి, వేడివేడిగా ఉల్లిపాయ రైతాతో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది
    Kabuli Chana is rich in a lot of good nutrients and it is also great for diabetics for its low glycemic index. Besides this, most of us rarely make only Chole curry or chaat with it and have it. But in this video, I have shown a way in which you can regularly, happily include it into your regular diet. This is a very simple and easy Chana Pulao for which the only work you have to do prior is to soak the Kabuli chana beforehand. Rest of the process is like any other normal pulao. It is very tasty, extremely healthy and also good for digestion. So try making pulao next time when you want to have something new and enjoy it with raitha. This is good for lunch boxes too.
    Our Other Recipes:
    Chana Salad: bit.ly/3xfEqO4
    Chana Chaat: bit.ly/3RVYbnx
    Chilli Chana: bit.ly/3HX9abs
    Chole Masala Curry: bit.ly/3K3tyuj
    Kabuli Chana Biryani: bit.ly/3K6sllV
    Pindi Chole: bit.ly/3xgg46G
    Chole Bhatura: bit.ly/3xhJZvn
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    HAPPY COOKING WITH HOMECOOKING!
    ENJOY OUR RECIPES
    WEBSITE: www.21frames.in...
    FACEBOOK - / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 12