కక్ష సాధింపులతో విధుల్లో నుంచి తొలగిస్తారా... ?

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • బాలాయపల్లి మండలం సుబ్రహ్మణ్యం గ్రామంలో రాజకీయ కక్ష సాధింపుగా దళిత ఆశా వర్కర్ ను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ.. ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో బాలాయపల్లి మెడికల్ ఆఫీసర్ ప్రమీలకి ఎంపీడీవో , తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వడ్డిపల్లి చెంగయ్య, ఏ మంజుల ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కవిత లు మాట్లాడుతూ గత 19 సంవత్సరముల నుండి ఎటువంటి రిమార్కు లేకుండా విధులు నిర్వర్తిస్తున్నటువంటి దళిత ఆశ వర్కర్ కస్తూరి కృష్ణవేణి తొలగించి రాజకీయంగా వేరే వారిని పెట్టాలని ప్రయత్నాలు చేయడం చాలా దుర్మార్గమని ఆరోపించారు. గ్రామ అగ్రకుల పెత్తందారులు ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సుబ్రహ్మణ్యం గ్రామ డీలర్ ని మరియు మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలు ని తొలగించినట్లు తెలుస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడు గత 19 సంవత్సరాల నుండి పని చేస్తున్నటువంటి వారిని తొలగించి వారి కడుపు కొట్టి వేరే వారిని అనుకూలస్తుల్ని పెట్టుకోవాలని అనుకోవడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఒక దళితురాలు సేవలు మాకొద్దు ఈమెని మార్చాలి అని అగ్రకుల పెత్తందారులు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని వారు ఆరోపించారు. ఇప్పుడు కులం గుర్తుకొచ్చిన ఈ అగ్రకుల పెత్తందారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గత 19 సంవత్సరాల నుండి ఆశ వర్కర్ గా ఉంటూ జీవనం సాగిస్తున్నటువంటి ఆశా వర్కర్ కి న్యాయం చేయాలని పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యం గ్రామంలో ఆశా వర్కర్ కి గాని మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలు ని గా ని ,అంగన్వాడీ ఆయాకు గాని, రేషన్ షాపు డీలర్కు గాని అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని . వీరందరి తరఫున సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల్ని ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ బాలాయపల్లి మండలం నాయకులు గోపమ్మ సుహాసిని ,అమరావతి ,కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

КОМЕНТАРІ •