నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయండి ...బత్తుల బలరామకృష్ణ

Поділитися
Вставка
  • Опубліковано 4 тра 2024
  • ఉమ్మడి పార్టీల అధినేతలు ప్రధాని నరేంద్ర మోడీ రేపు మధ్యహ్నం ఒంటి గంటకు రాజమహేంద్రవరం రూరల్ వేమగిరిలో జరుగు బహిరంగ సభకు హాజరుకానున్నారని ఈ సభను విజయవంతం చేయాలని రాజానగరం నియోజక వర్గం జనసేన పార్టీ మరియు ఉమ్మడి అభ్యర్థి బత్తుల బల రామకృష్ణ పిలుపునిచ్చారు.ఈ ప్రజా గళ సభకు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా రాష్ట్ర బిజెపి అధినేత మరియు రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిని దగ్గుపాటి పురందరేశ్వరి, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్న ఈ సభకు వేలాదిగా యువకులు మహిళలు విద్యా వేత్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
    ఈ సభ లో బీజేపీ అధినేత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో వేదిక మీద కూర్చునే అవకాశం నాకు రావడం రెండో సారి అని గుంటూరులో మొదటిగా ఒకే వేదిక మీద కూర్చున్నాను అని ప్రధాన మంత్రి తో కూర్చునే అవకాశం మా జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ కల్పించారని అలాగే రాజానగరం లోని జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గెలుపు ఖాయమని అదే విధంగా రాజమండ్రి పార్లమెంట్ కూడా బీజేపీఅభ్యర్థి దగ్గుబాటి పురందరేశ్వరి గెలవడం జరుగుతుందని దీనికి రేపు జరగనున్న ప్రజా గళం సభే విజయ సంకేతంగా నరేంద్ర మోడీ సభ జరుగుతుందని రాజానగరం నియోజకవర్గ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ అన్నారు.

КОМЕНТАРІ •