భరతమాత సేవలో......
Вставка
- Опубліковано 10 лют 2025
- 🌹భరతమాత సేవలో...🌹
-------------------------------------
భరతమాత సేవలకై ఉద్భవించె ఈ దేహం
కణం కణం సమర్పితం దేశమాత కంకితం!!
//భరతమాత....//
మహనీయులు కన్న కలలు మదినిండా నింపుకొని
అణువణువున దేశభక్తి అంతరంగ మందు దాల్చి
ప్రపంచాన మన దేశపు ప్రతిభను నిలబెట్టుకుంటు
జనంలోని జ్యోతులమై జాతి కొరకు కదలుదాం!!
//భరతమాత....//
అక్షరాన్ని వెలిగిస్తూ అజ్ఞానం తొలగిస్తూ
బద్దకాన్ని వదిలిస్తూ చైతన్యం రగిలిస్తూ
మంచితనం పెంచుకుంటు మర్యాదగ నడుచుకుంటు
భరతజాతి కీర్తిని దశదిశలా చాటుదాం!!
//భరతమాత....//
అంతరంగ శత్రువులను ఆదిలోనే తుంచి వేస్తు
విదేశీయ కుట్రలను విజ్ఞతతో ఎదిరిస్తూ
ఐక్యతయే అయుధంగ అవనిలోన వెలిగిపోతు
దేశమాత గొప్పదనం దివ్యంగా చూపుదాం!!
//భరతమాత....//
శ్రామికులను గౌరవిస్తు, శ్రమశక్తిని గుర్తిస్తూ
శాస్తీయత పెంచుకుంటు, విజ్ఞానం పంచుకుంటు
కిసానులు, సైనికులె ఘనశక్తిగ భావిస్తూ
వసుధలోన సాగుదాం, విజయాలే సాదిద్దాం!!
//భరతమాత....//
✍️ డాక్టర్ వెలుదండ వేంకటేశ్వరరావు.
Cell : 8790421061.