Vemana Tattvam (తత్త్వము చెపుతా వినురా జీవా) | Video Song- 159 | Singer: Renu Kumar | Vemana Jayanti
Вставка
- Опубліковано 30 січ 2025
- జ్ఞానవాహిని శ్రోతలకు, వీక్షకులకు అందరికీ "శ్రీ భగవాన్ వేమన యోగీశ్వరుల" వారి "జయంతి" సందర్భముగా శుభాకాంక్షలు.
thraithashakam...
thraithashakam...
TEAM:
---------
Lyricist - Siva Krishna Kogili
Singer - Renu Kumar
Music - NR Chaithanya Kumar
Lyrical Video Composition - Subbu
Production & Presented By - Gnanavaahini Channel
సాకీ:
----
తత్వములలోన బరమాత్మ తత్త్వమెఱిగి
నిత్యనిర్ముక్త పరిపూర్ణ నిలయమంది
సరి పరబ్రహ్మమయ మందు సంచరించు
నతడె విజ్ఞాని పరశివుడతడే వేమా ! ... అతడె విజ్ఞాని ..పరశివుడతడే వేమా !!!
పల్లవి:
-----
తత్త్వము చెపుతా వినురా జీవా వేమన పద్యములోది
గుప్తము చూపుత చూడర జీవా వేమన భావములోది
తత్త్వము చెపుతా వినురా జీవా వేమన పద్యములోది
నీకు గుప్తము చూపుత చూడరా జీవా వేమన భావములోది... వేమన భావములోది
రక్తినికట్టే రతిలోదాగిన రుచినేబోలిన తత్త్వం
షుప్తముచుట్టే షుషుప్తిలోని శుచినే ఏలిన తత్త్వం
భక్తిని బట్టే బుద్దిన బుట్టే భావామృతమీ తత్త్వం
గుప్తుని గుట్టౌ గద్దెను గట్టే గురు ఆత్మికమే వేమన తత్త్వం..
అది తిరుగులేని తత్త్వం ... నువ్వు తిరిగిరాని తత్త్వం.. మ్ మ్ మ్ మ్
తత్త్వము చెపుతా వినురా జీవా వేమన పద్యములోది
గుప్తము చూపుత చూడర జీవా వేమన భావములోది.. ఈఈఈ.. వేమన భావములోది !
చరణం 1:
---------
పరమాత్మే అద్వైతం ... మధ్యాత్మను కూడగ ద్వైతం
ఇక జీవాత్మను జోడిస్తే ... అదియేరా ఆత్మల త్రైతం
ఆత్మలు ఎపుడూ ఏకం ... మాయాత్మకమే ఈ లోకం
ఆధ్యాత్మికమై గమనిస్తే ... మిగిలేదే మూలపు తత్త్వం
భిన్నముగున్నా సృష్టిలో ఏదో ఏకముగన్నదిరా
కన్నులు మూసే ఏక దృష్టిలో కనబడుతుంటదిరా
వన్నెలు మార్చే ప్రకృతి వెనుకే వెన్నొకటున్నదిరా
సున్నగ మనసే చేయు వీనులకు వినబడుతుంటదిరా
ప్రతిపదార్ధములో దాగిన అర్థం ... పరికించుటయే యతి తత్త్వం
ప్రతిజీవునిలో దాగిన త్రైతం... శృతిచేయుటయే శివ తత్త్వం
అహమను "నేను"ను కూల్చుటయే ఆదియైన తత్త్వం
ఇహమున పరమును దాల్చుటయే అంత్యమైన తత్త్వం .. అది వేమనయ్య తత్త్వం !
తత్త్వము చెపుతా వినురా జీవా వేమన పద్యములోది
గుప్తము చూపుత చూడర జీవా వేమన భావములోది... ఈఈఈ.. వేమన భావములోది !
చరణం 2:
---------
కార్యకర్మ కడు యంత్రం ... మధ్యాత్మ మర్మమొక మంత్రం
సరి ఊర్ధ్వజన్మ నీదైతే ... మరి ఊరకుండుటే తంత్రం
శరము కూడితే శస్త్రం ... అది శిరము చేరితే అస్త్రం
మరి పరముచేరువేదంటే... అది అస్త్రశస్త్ర సన్యాసం
పంచతత్వముల దేహకార్యములె .. కడగురు బోధలురా
మనస్తత్త్వమును బోధజేయుటే ..మధ్యమ మంత్రమురా
పంచఅక్షరిని ఎంచిచూపుటే.. కడవరి సాధనరా
ఆ సూన్యకక్షలో ఊరకుండుటే ... ఉత్తమ బోధనరా
ఇంద్రియాలలో ఇమిడిన జ్ఞానం ... అందుకొనుటయే ఇందుత్వం
ఏడుకేంద్రముల కూడే యోగం ... వేడుకొనుటయే వేదాంతం
అష్టమ స్థానము చేరుటయే ఆదియైన తత్త్వం ..
అటుపై సృష్టిని దాటుటయే అంత్యమైన తత్త్వం .. అది వేమనయ్య తత్త్వం !
తత్త్వము చెపుతా వినురా జీవా వేమన పద్యములోది
గుప్తము చూపుత చూడర జీవా వేమన భావములోది... ఈఈఈ.. వేమన భావములోది !
చరణం 3:
---------
జడము జూడ స్త్రీతత్వం ... తా పరము గూఢ పుంతత్వం
దరి దేవులాడి దరిశిస్తే ... ద్వంద్వాలులేని దైవత్వం
బయలులోన భిన్నత్వం ... కాయాన కూడ ఏకత్వం
మరి మాయవీడి మరణిస్తే ... మిగిలేటి సూణ్యమే తత్త్వం
స్థిరములేక స్త్రీమత్తులోబడే ... జీవుడు చిత్తుడురా
పురమునందు శయనించు పురుషుడే ... పురుషోత్తముడగురా
నిరతమాత్మనే స్మరణజేయగా... సత్త్వము వినబడురా
నిత్యనిర్ముక్త పూర్ణ నిలయమే ... నీలో కనబడురా
జ్ఞానదృష్టితో సృష్టిగాంచుతూ ... జ్ఞేయమొందుటే పురుషత్వం
జీవమణచి దైవాన్ని పెంచుతూ ... ప్రాణమందుటే పూర్ణత్వం
వెలుపలి బయలును వీడుటయే ఆదియైన తత్త్వం ..
నీలోపలి బయలును కూడుటయే అంత్యమైన తత్త్వం .. అది వేమనయ్య తత్త్వం !
తత్త్వము చెపుతా వినురా జీవా వేమన పద్యములోది
గుప్తము చూపుత చూడర జీవా వేమన భావములోది
రక్తినికట్టే రతిలోదాగిన రుచినేబోలిన తత్త్వం
షుప్తముచుట్టే షుషుప్తిలోని శుచినే ఏలిన తత్త్వం
భక్తిని బట్టే బుద్దిన బుట్టే భావామృతమీ తత్త్వం
గుప్తుని గుట్టౌ గద్దెను గట్టే గురు ఆత్మికమే వేమన తత్త్వం..
అది తిరుగులేని తత్త్వం ... నువ్వు తిరిగిరాని తత్త్వం.. మ్ మ్ మ్ మ్
తత్త్వము చెపుతా వినురా జీవా వేమన పద్యములోది
నీకు గుప్తము చూపుత చూడర జీవా వేమన భావములోది.. ఈఈఈ..
వేమన భావములోది .. వేమన భావములోది ... వేమన భావములోది!