చిల్లి గార్లిక్ నూడుల్స్ | Chili Garlic Noodles in Telugu | Noodles in Telugu | Home Cooking Telugu

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • నూడుల్స్ అంటే మనందరికీ చాలా ఇష్టం. ముఖ్యంగా పిల్లలందరికీ మరీ ఇష్టం. అందుకనే ఇవాళ మీకోసం చిల్లి గార్లిక్ నూడుల్స్ రెసిపితో మీముందుకు వస్తున్నాం. చూసి ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.
    #chilligarlicnoodles #homecookingtelugu #noodlesintelugu #homecooking #hemasubramanian #chilligarlicnoodlesintelugu
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    Here's the link to this recipe in English: bit.ly/2n0yJ6a
    తయారు చేయడానికి : 20 నిమిషాలు
    వండటానికి : 15 నిమిషాలు
    సెర్వింగులు : 2
    కావలసిన పదార్థాలు
    హక్కా నూడుల్స్ - 300 గ్రాములు
    నువ్వుల నూనె - 2 టేబుల్స్పూన్లు (Buy: amzn.to/37oEDA0)
    వెల్లుల్లి రెబ్బలు - 1 టేబుల్స్పూన్ (చిన్నగా తరిగినవి)
    ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
    పచ్చి మిరపకాయ - 1
    క్యారెట్ - 1
    క్యాబేజి - 1 కప్పు
    యెల్లో కాప్సికం - 1/2
    రెడ్ కాప్సికం - 1/2
    ఆకుపచ్చ కాప్సికం - 1/2
    ఉల్లి కాడలలోని తెల్ల గడ్డలు
    వెనిగర్ - 2 టీస్పూన్లు (Buy: amzn.to/38YccsQ)
    సొయా సాస్ - 2 టేబుల్స్పూన్లు (Buy: amzn.to/2Oq9bKi)
    రెడ్ చిల్లి సాస్ - 1 టేబుల్స్పూన్ (Buy: amzn.to/2tdMscS)
    గ్రీన్ చిల్లి సాస్ - 1 టేబుల్స్పూన్ (Buy: amzn.to/2UjQdZt)
    మిరియాల పొడి - 1 టీస్పూన్ (Buy: amzn.to/2RElrrg)
    ఉల్లి కాడలు
    నీళ్లు
    ఉప్పు (Buy: amzn.to/2vg124l)
    తయారుచేయు విధానము
    నూడుల్స్ ఉడికించడానికి - ఒక బాండీ తీస్కుని, తగినన్ని నీళ్లు పోసి, తగినంత ఉప్పు
    వేసి, 300 గ్రాములు హక్కా నూడుల్స్ను వేసుకోవాలి
    నూడుల్స్ 90 శాతం ఉడికిన తరువాత పొయ్యిమీద నుంచి తీసేసి వెంటనే వడకట్టుకోవాలి
    ఇప్పుడు దానిపైన కొద్దిగా నూనె చల్లుకోవాలి. ఇలా చేయడం వలన నూడుల్స్ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి
    ఇప్పుడు ఒక బాండీ తీస్కుని రెండు టేబుల్స్పూన్లు నువ్వుల నూనెలో, కాస్త సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ మరియు సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి వేసి వేయించాలి
    పైవన్నీ కొద్దిగా వేగిన తరువాత సన్నగా,పొడుగ్గా తరిగిన క్యారెట్, ఒక గిన్నెడు సన్నగా తురిమిన క్యాబేజి, చిన్నగా తరిగిన ఒక సగం రెడ్ క్యాప్సికమ్, చిన్నగా తరిగిన ఒక సగం యెల్లో కాప్సికం, చిన్నగా తరిగిన ఒక సగం ఆకుపచ్చ కాప్సికం మరియు చిన్నగా తరిగిన ఉల్లికాడలలోని తెల్ల గడ్డలను కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి
    ఇప్పుడు దీనిలో రెండు టేబుల్స్పూన్లు వెనిగర్, రెండు టేబుల్స్పూన్లు సొయా సాస్, ఒక టేబుల్స్పూన్ రెడ్ చిల్లి సాస్, ఒక టేబుల్స్పూన్ గ్రీన్ చిల్లి సాస్మ రియు ఒక టీస్పూన్ మిరియాల పొడి కూడా వెయ్యాలి
    చివరగా ఉడికించిన నూడుల్స్ వేసుకుని అన్నిటినీ బాగా కలుపుకోవాలి
    ఉల్లి కాడలతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా వడ్డించుకుంటే చాలా బాగుంటుంది
    You can buy our book and classes on www.21frames.in...
    HAPPY COOKING WITH HOMECOOKING!
    ENJOY OUR RECIPES
    WEBSITE: www.21frames.in...
    FACEBOOK - / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 28