ఆరు ప్రముఖ సుబ్రమణ్య క్షేత్రములు

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024
  • పార్వతీపరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి మురుగన్, స్కంధ, కుమార, సదానన, షణ్ముఖ, శరవణ మరియు గుహపేర్లతో కొలువబడుచున్నాడు. వీటిలో తమిళనాడు రాష్ట్రంలో పళని మురుగన్ ఆలయం, కుంభకోణం స్వామిమాలై మురుగన్ ఆలయం, తిరుచెందూర్ మురుగన్ ఆలయం, త్రిపురకూర్ణం మురుగన్ ఆలయం, తిరుత్తణి మురుగన్ ఆలయం, మధురై పజముదిర్ చొలై మురుగన్ ఆలయం, మలేషియా దేశమునందు కల్లుమాలై, అర్మిగు బాల దండయుధపాణి ఆలయాలు, శ్రీలంకలో సెల్వసన్నిధి మురుగన్ ఆలయం మరియు ఆష్త్రెలియాదేశంలో సిడ్నీనందున్నమురుగన్ ఆలయం అను పదిమురుగన్ ఆలయాలు ప్రముఖమైనవి. మధురైనందు బసచేసి ఆరు సుబ్రహ్మణ్యక్షేత్రములలో 1. తిరుపరన్ కూండ్రం , 2. తిరుచెందూర్, 3. పళని, 4.స్వామీమాలై, 5. ఆరుల్మిగు సోలైమలాల్ అను అయిదు ఆలయాలు దర్శించవచ్చు. విజయవాడనుండి తిరుత్తణిచేరుకొని ఆరవదైన తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించి మధురైచేరి అయిదు ఆలయాలు దర్శించవచ్చు. ఈ క్షేత్రములలో స్వామి విభిన్నమైన నామధేయములతో పిలువబడుచున్నారు. ప్రతిక్షేత్ర ఆవిర్భావానికి పురాణగాధలు ఉన్నాయి.
    తారకాసుర సంహారముకొరము జన్మించిన సుబ్రహ్మణ్యస్వామి కారణజన్ముడు. ఆత్మలింగ వరప్రభావితుడైన తారకాసుని సంహరించుట పార్వతీపరమేశ్వరుల పుత్రునివల్లనే సాధ్యమని అందుకు పరమేశ్వరుని తపోదీక్ష మన్మధునిద్వారా భంగపరచుటవలన శివుని దివ్యతేజస్సు అగ్ని భరించలేక గంగానదిలో విడవగా శివ, సంభూతి, ప్రీతి,సన్నతి, అనసూయ మరియు క్శమ అను ఆరుగురు కృత్తికలయందు ప్రవేశించగా వారురెల్లుపొదలో విసర్జించారు. ఆతేజస్సునుండి ఆరు ముఖాలతో షణ్ముఖుడు ఉద్భవించగా రుద్రాంశ సంభూతుడైన షణ్ముఖుని తీసుకుని పార్వతీపరమేశ్వరులు కైలాసం చేరుకున్నారు. కుమారస్వామికి షణ్ముఖుడు, గాంగేయుడు, సుబ్రహ్మణ్యస్వామి, కార్తికేయుడని వివిద నామములు కలవు. కుమారస్వామిని దేవతల సైన్యాధ్యక్షునిగా నియమించి శివుడు "శూలం" తదితర ఆయుధాలు, పార్వతీదేవి "శక్తి" ఆయుధంతోపాటు బ్రహ్మాది దేవతలు వివిధ ఆయుధాలు ఈయగా కుమారస్వామి తారకాసురునిపై యుద్ధం ప్రకటించాడు. కుమారస్వామికి తారకాసురుని వధించుటకు నారాయణుడు తారకాసురుని మెడలో ఆత్మలింగం ఉన్నంతవరకు ఆతనిని నిర్జించలేరని, ముందుగా శివలింగాన్ని ముక్కలు (శకలాలు) చేయవలెనని, మరలా అవిఒకటిగా చేరకుండా అవిపడినచోట స్తాపించి పూజించవలెనని పిమ్మటమాత్రమే తారకాసురుని వధించుట సాధ్యమని తెలిపాడు. మహావిష్ణువు సలహా అనుసరించి కుమారస్వామి ఆగ్నేయాస్త్రం ప్రయోగించి ఆత్మలింగాన్ని అయిదు శకలాలు చేయగా, ఇంద్రుడు, చంద్రుడు, విష్ణువు, సూర్యుడు మరియు కార్తికేయుడు ఒకేసారి ఆశకలాలు పడినచోటనే వాటినిప్రతిస్టించి పూజించారు. ఆ అయిదుక్షేత్రాలు అమరారామ, భీమారామ, క్షీరారామ, ద్రాక్షారామ మరియు కుమారరామ పేర్లతో పంచారామక్షేత్రాలుగా ప్రసిద్ధిచెందాయి. అయిదు క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండుట విశేషం. పిమ్మట కుమారస్వామి భీకర యుద్దంలో తారకాసురుని సంహరించి విజయుడై త్రిలోకాల్ని రక్షించాడు..తమిళనాడు రాష్ట్రంలో ఆరుపదైవీడుగా పిలువబడు ఆరు సుబ్రహ్మణ్యక్షేత్రాలు 1. తిరుపరన్ కుండ్రం 2. తిరుచెందూర్ 3. పళని 4.స్వామిమాలై 5.తిరుత్తణి మరియు 6. ఆరుల్మిగు సోలైమలాల్ కధనాలు సంభంధిత క్షేత్రకధనాల్లో తెలుసుకొవచ్చు.
    మురుగన్ (సుబ్రహ్మణ్యస్వామి) సూరపద్ముడు అనురాక్షసుని సంహరించి దేవతలరాజైన ఇంద్రుని కుమార్తె దేవసేనను పళనియందు వివాహమాడి శివుని పరంగిరినాతర్ పేరుతో అర్చించాడు. సప్త సుబ్రహ్మణ్యక్షేత్రాలకు క్షేత్రాన్నిబట్టి స్థలపురాణాలు కలవు. స్కంధపురాణంలో తిరుపరన్ కుండ్రంనందు మురుగన్ నివసించుటపై ప్రస్తావన ఉంది. సూరపద్ముడు దేవతలరాజు ఇంద్రునిబంధించి ఇంద్రునిభార్య ఇంద్రాణిని కోరాడు. ఇంద్రుడు మురుగన్ సహాయం కోరాడు.. సురపద్ముని రెండుభాగాలుగా చీల్చి వాటికి నెమలి మరియు కోడిపుంజు రూపాలు అనుగ్రహించి అందు నెమలిని వాహనంగా చేసుకొన్నాడు. సురపద్ముని సంహరించినరోజును స్కంధషష్టి పర్వదినంగా మురుగన్ ఆలయములన్నిటిలో నిర్వహిస్తారు. ఇంద్రుడు తనకుమార్తే దేవసేనను తిరుపరన్ కూండ్రంనందు మురుగన్ కిచ్చి వివాహం చేశాడు. సుబ్రహ్మణ్యస్వామి మరోభార్య వల్లీదేవిని వివాహం చేసుకొనుటపై ఒక కధనం ఉంది. నారదమహర్షి సుబ్రహ్మణ్యస్వామితో వల్లీదేవి గురించిచెప్తూ వల్లీదేవి ఒకమహర్షి తేజస్సుతో అయోనిజగా ఆరణ్యంనందు జన్మించి ఒకభిల్లునికి దొరికి వల్లి అనుపేరుతో పెరిగినట్లు, సౌందర్యవంతురాలైన వల్లి స్వామిభార్య కావాలిఅని కోరుతున్నట్లు తెలుపగా సుబ్రహ్మణ్యస్వామి భిల్లుపురం వెల్లాడు. నారధుడు ముందుగా భిల్లుపురం చేరుకొని భిల్లరాజుతో శివుడు వల్లీదేవిని ఆతనికుమార్తెగా అనుగ్రహించాడని, వల్లీదేవిని వివాహమాడువాడు గౌరీశంకరులపుత్రుడు, గొప్పవీరుడు, మహాజ్ఞాని, దేవసేనాధిపతి అని తెలిపాడు. సుబ్రహ్మణ్యస్వామి ఒకవేటగాని రూపంలో వనంలోకి ప్రవేశించి వల్లీదేవి సౌందర్యంచూసి తనను వివాహమాడమని కోరాడు. భిల్లరాజు వేటగాని రూపంలోని యువకుడు సుబ్రహ్మణ్యస్వామిఅని తెలియక ఆగ్రహంతో పరివారంతో కలిసి స్వామిమీద బాణాలు ప్రయోగించగా వాటిని నిర్వీర్యంచేసి వారిపై సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. వారికి శూలంధరించి నెమలివాహనంపై వల్లీదేవితో సుబ్రహ్మణ్యస్వామి సాక్షాత్కరించాడు. భిల్లులందరూ సుబ్రహ్మణ్యస్వామికి ప్రణామం చేయగా.పార్వతీ పరమేశ్వరులు మరియు దేవసేనతో నారదుడు అక్కడకువచ్చాడు. పార్వతీ పరమేశ్వరులు వల్లీదేవికి సుబ్రహ్మణ్యస్వామితో వివాహంచేయగా వల్లీదేవసేన సమేతుడై సుబ్రహ్మణ్యస్వామి పళనిలో వెలిసాడు. సర్వశక్తి స్వరూపుడైన స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపిన మార్గశిర శుద్ధషష్ఠినాడు “శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి”గా పరిగణించి "శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంతవైభవంగా జరుపుతారు. స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని; పెళ్లికానివారికి వివాహంజరిగి సత్‌సంతానం, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని ప్రజలవిశ్వాసం.
    ఓం శరవణభవ ఓం శరవణభవ

КОМЕНТАРІ •