బైబిల్ స్టడీ || రోమీయులకు వ్రాసిన పత్రిక|| 8 : 5 - 11

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024
  • 8అ : వ 5 - 11 ||
    5. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు;ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;
    6. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.
    7. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.
    8. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.
    9. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.
    10. క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.
    11. మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.
    సోదరుడు రవి

КОМЕНТАРІ •