ప్రగతి శీల మహిళా సంఘం ( POW )50 yrs

Поділитися
Вставка
  • Опубліковано 27 чер 2024
  • కదలిరా ఓ మహిళా కదలిరా. శ్రామిక మహిళల గొంతుకై, హక్కుల దివిటీయై గత అయిదు దశాబ్దాలుగా పోరాడుతోంది ప్రగతి శీల మహిళా సంఘం. ఎన్నో వీరోచిత పోరాటాలు, మరెందరో త్యాగమూర్తులు.. అలుపెరుగని ఉద్యమ బావుటా "ప్రగతిశీల మహిళా సంఘం." POW (Progressive Organisation of Women).
    1974 జూన్ 22 న ఉస్మానియా యూనివర్సిటీ లో మతతత్వ, పురుషాధిపత్య లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తిరగబడిన విద్యార్థినుల చైతన్య వేదిక. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంస్థ ఆవిర్భావం ఓ సంచలనం.
    ఆ తర్వాతి కాలంలో భిన్న సమూహాలలో అణగారిన మహిళల హక్కుల కోసం నిరంతరంగా పోరాడుతున్న ఉద్యమ తేజం.
    సారా ఉద్యమం, మద్యపాన నిషేధ ఉద్యమం, ధరల పెంపు, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం, మహిళలపై అత్యాచారాలు, హత్యలు దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తున్న మహిళా సంస్థ.
    ఒక చిన్న సమూహంగా మొదలై, ఒక ప్రభంజనం గా మారి, ఐదు దశాబ్దాలుగా ప్రజల్లో చైతన్యం కల్పిస్తుంది.
    ప్రజా సంఘాలు ఒక తాటి మీదకు రావడానికి ప్రయత్నం చేస్తూ తమ అర్థ శతాబ్దపు వార్షికోత్సవాన్ని 2024 జూన్ 22 న నిర్వహించారు.

КОМЕНТАРІ •