5 సం.ల ఆయిల్ పామ్ తోట, ఎకరాకు 10 టన్నుల దిగుబడి || Ideal Farmer in Oilpalm Farming ||Karshaka Mitra

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • 5 సం.ల ఆయిల్ పామ్ తోట, ఎకరాకు 10 టన్నుల దిగుబడి || Success Story of Oil Palm Farming by Koneru Satish Babu, Vijayarai Village, West Godavari District
    ఆయిల్ పామ్ సాగులోను, ఉత్పత్తిలోను ఆంధ్రప్రదేశ్ దేశెంలోనే నెం. 1 స్థానంలో వుంది. నాటిన 3వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు ఈ తోటల నుండి రైతు ఆదాయం పొందే వీలుండటం, మధ్య దళారుల బెడద లేకపోవటంతో స్ధిరమైన ఆదాయాన్ని అందించే పంటగా ఆయిల్ పామ్ గుర్తింపు పొందింది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు, అటు రాయసీమలోని అనంతపురంలోను, తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోను ఈ తోట పంట విస్తరించి వుంది. అయితే పశ్పిమ గోదావరి జిల్లా సాగు విస్తీర్ణంలో మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ పంట విస్తరణకు ప్రభుత్వ రాయితీలు కూడా తోడవటంతో సాగులో రైతు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నాడు. ఈ తోట పంటకు మంచి యాజమాన్య పద్ధతులు కూడా తోడైతే ఎకరాకు 15టన్నుల దిగుబడిని పొందే అవకాశం వుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో దాదాపు 70 శాతం విస్తీర్ణాన్ని ఈ పంట ఆక్రమించింది. శ్రమ, ఖర్చు తక్కువ వుండటం, కూలీల అవసరం తక్కువ వుండటం వల్ల ఈ పంట సాగు రైతుకు అన్ని విధాలుగా అనుకూలంగా వుంది.కొంతమంది రైతులు నాటిన 5వ సం.లోనే మంచి ఆర్థిక ఫలితాలు సాధించటం విశేషం. అయితే సరాసరిన ఎకరాకు సరాసరిన 10టన్నుల దిగుబడి సాధిస్తున్నా, ఆయిల్ రికవరీ శాతాన్ని తక్కువ చూపించటం వల్ల ఆశించిన ధర దక్కటం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పక్కరాష్ట్రం తెలంగాణలో ఎక్కువ ధర లభిస్తోందని, కోస్తా రైతుకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు స్థితిగతులపై పెదవేగి మండలం, విజయరాయి గ్రామ రైతు కోనేరు సతీష్ బాబుతో కర్షక మిత్ర స్పెషల్ స్టోరీ.
    #Karshakamitra #Oilpalmfarming
    Facebook : mtouch.faceboo...

КОМЕНТАРІ • 42