సామాన్యత song

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • పల్లవి :
    సామాన్యతలో దాగివున్న ప్రభువుకు ఆరాధన,
    పశువులతోట్టేలో పరుండిన యెహోవాకు ఆరాధన-2
    సామాన్యత ఇది సామాన్యత
    సృష్టికర్త దాగివున్న సామాన్యత-
    సామాన్యత ఇది సామాన్యత
    యేసుక్రీస్తు దాగివున్న సామాన్యత-2
    చరణం 1
    సామాన్యతే గొప్ప తనము
    ఓడను కట్టుటే దేవుని వాక్యము
    సామాన్యతే గొప్ప తనము
    నోవాహువాక్యమే,రక్షణమార్గము -2
    ఈలోక జ్ఞానులు. విజ్ఞాన వంతులు
    సామాన్యతకు తోట్రిల్లిరి
    ఆకాశంలో నిరేలేదనిరి
    దేవుని కృపను త్రోసేసిరి --2
    సామాన్య గొర్రెల కాపరి
    వర్షంకురియును అని నమ్మెను
    సామాన్య గొర్రెల కాపరి
    ఉగ్రను తప్పించుకొనెను -2
    సామాన్యత ఇది సామాన్యత
    ఓడను కట్టుటే దేవుని సామాన్యత
    సామాన్యత ఇది సామాన్యత
    సృష్టికర్త దాగివున్న సామాన్యత-2
    చరణం --2
    సామాన్యతే జీవమార్గము
    ప్రత్యక్షతే నిత్యజీవము
    సామాన్యతే జీవమార్గము
    యేసుక్రీస్తే నిత్యజీవము-2
    పరిసయ్యలు,శాత్రులు యేసుక్రీస్తును
    బయేల్జేబూబు అని పిలిచిరి
    ధర్మశాస్త్రఉపదేశకులు. సద్దుకయ్యలు
    ప్రత్యక్షతను త్రోసేసిరి--2
    విద్యలేని పామరులు ప్రత్యక్షతను
    పొందుకొనిరి
    అపొస్తలుగా మారిరీ,సామాన్యముగ
    జీవించిరి -2
    సామాన్యత ఇది సామాన్యత
    యేసుక్రీస్తు దాగియున్న ప్రత్యక్షత
    సామాన్యత ఇది సామాన్యత
    సృష్టికర్త దాగివున్న సామాన్యత-2
    చరణం :3
    సామాన్యతే వర్తమానము
    వర్తమానమే సర్వసత్యము
    సామాన్యతే వర్తమానము
    వర్తమానమే మన మేఘము-2
    మతశాఖ జనులు, సంఘశాఖ ప్రజలు
    ఏడు ముద్రలను త్రోసేసిరి
    ఈ వర్తమానంలో దాతాను,కోరహులు
    మన మేఘమును త్రోసేసిరి-2
    సామాన్య బ్రాన్హామ్ ఆ మేఘము
    లోకి వెళ్లెను
    ఏడు ముద్రలతో నడిచి పరమునకు
    ఆహ్వానం పొందెను.
    బ్రెన్ హామును పోలి
    మనమంతా వాక్యంతో నడిచేదం
    సామాన్యతలో నడచి
    మనమంతా అద్దరికీ చేరేదం/
    సామాన్యత ఇది సామాన్యత
    మేఘంలో దాగివున్న సామాన్యత
    సామాన్యత ఇది సామాన్యత
    దేవుని వధువులో వున్న సామాన్యత

КОМЕНТАРІ • 12