PALLE YADIKOCHENA FULL SONG 2020 || GIDDE RAMNARSAIAH || GIDDE GALAM

Поділитися
Вставка
  • Опубліковано 23 вер 2020
  • PALLE YADIKOCHENA SONG 2020
    Lyrics & Singer: Gidde Ramnarsaiah
    Music: GL Namdev
    Dop & Editing: Harish Patel
    Acting & Direction: Gidde Ramnarsaiah
    Sound : Umesh Chilukamari, Md Rafi

КОМЕНТАРІ • 8 тис.

  • @gangajasmin3698
    @gangajasmin3698 Місяць тому +140

    నాది ఆంధ్ర ప్రదేశ్ (కర్నూలు)కాని నేను తెలంగాణ లో ఎందుకు పుట్టలేదు అని బాధపడుతుంటాను..

    • @kranthirajuambati2286
      @kranthirajuambati2286 16 днів тому +20

      ఏమి బాధపడకు అన్న తెలుగు వాడి గా పుట్టినం మనం గర్వించు ఎన్నో మధురమైన గణాలు మన సొంతం

    • @AravindKumar-lg3sl
      @AravindKumar-lg3sl 14 днів тому +3

      Yes

    • @rkbachu386
      @rkbachu386 12 днів тому +1

      మేము పుట్టి ఏం చేస్తున్నాం ఎక్కడి పరిస్థితులు అక్కడనే

    • @venukumarvenu1343
      @venukumarvenu1343 11 днів тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​@@rkbachu386

    • @malleshyadav3633
      @malleshyadav3633 8 днів тому

      Ekkada undu bro .evaru vaddu anaru nennu

  • @sagarvivek6028
    @sagarvivek6028 Рік тому +41

    శ్రీదేవి డ్రామా కంపెనీ ఈటీవీ ప్రోగ్రామ్ లో చూసిన తర్వాత నుండి నీ గొంతు మత్తులో తుగుతూనే ఉన్నా అన్న. రోజు ఆ మత్తు రుచి చూడాల్సిందే. మేం సచ్చేదాకా వినలేకుండ ఉండము. ఇలాంటి మరెన్నో పాటలు మీ స్వరం నుండి రావాలన్న.🙏🙏🙏👌👌👌

    • @chandushekhar3958
      @chandushekhar3958 4 дні тому

      Sri devi drama company lo... Annani highlight cheyaledu.......

  • @mahenderdasu7117
    @mahenderdasu7117 Рік тому +86

    ఒక్క పాటతో తెలంగాణ కళాకారులందరిని గుర్తు చేసారు.... మీకు కోటి కోటి ధన్యవాదములు......
    ఇది తెలంగాణ కళాకారుల గొప్పతనం 🙏🙏

  • @maheshvemula9292
    @maheshvemula9292 Місяць тому +17

    ఇంత మందిని యాదికి తెచ్చిన నీ కలానికి, గళానికి వందనం అన్న..

  • @stephenagape3944
    @stephenagape3944 2 роки тому +122

    కళాకారుల్ని కళాకారులే గుర్తించగలరన్న..కళను ప్రోత్సహించడం కళాకారుడు కే సొంతం మీ గళం అనేకమంది కలల్ని నిజం చేసేటట్టుగా ఉంది కళ్ళ వెంట నీళ్లు వచ్చే నరసన్న నువ్వు కనిపిస్తే గట్టిగా హత్తుకో వాలని ఉంది

  • @potharajulaprashanth8337
    @potharajulaprashanth8337 3 місяці тому +55

    తెలంగాణ లో కళాకారులకు కొదువ లేదు.. ఆ కళాకారులను అందరిని గుర్తు చేస్తూ రాసిన రచయితకు వందనాలు ...

  • @ravijanagama2873
    @ravijanagama2873 Місяць тому +2

    చాలా అద్భుతమైన పాట

  • @PAKASH-br1sm
    @PAKASH-br1sm 5 місяців тому +333

    2024 సంవత్సరం లో ఈ పాట విన్నవారు ఒక్క Like చేయండి..చాలాకాలం తర్వాత ఉద్యమ పాట వింటే ఎనలేని సంతోషం కలిగింది

  • @kanurunageswararao8671
    @kanurunageswararao8671 2 роки тому +231

    అంత మంది తోటి కళాకారులను విలువ యిచ్చి.... మాటలు లేవు.... అద్భుతం,,, అమోఘమ్...

  • @stdraju9357
    @stdraju9357 2 роки тому +58

    ఈ సాంగ్ 60 సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అన్న అప్పటి తెలంగాణ గుర్తుకొస్తుంది ఎంతో మంది కవులను అమర వీరులు స్మరించుకుంటూ ఈ పాట మహా అద్భుతంగా నటించి

  • @NareshKumar-cu1ff
    @NareshKumar-cu1ff 6 місяців тому +20

    ఈ పాటలో ప్రతి గాయకుని పేరు గుర్తు చేయడం పై నా వందనాలు 🙏🙏🙏🙏

  • @777satyanarayana
    @777satyanarayana 10 місяців тому +13

    పాటకోసం ఆలుపిల్లల్నిడిచి మాకోసమొచ్చేటోళ్లు
    బంధువులుగాకున్నా బంధాలు కలుపుకొని మందుతాగిచేటోళ్లు
    పాట బాగుందని చప్పట్లు కొట్టిన ప్రజలు యాదుకొచ్చేనా
    పాట పాడుకుంటూ ప్రాణాలు వదిలిన అమరులు గురుతుకొచ్చేనా
    ఏమి సాహిత్యం ఏమి ట్యూన్ ఏమి వాయిస్ అండ్ ఏమి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
    సూపర్బ్ . ఎన్ని సార్లు విన్నానో తెలియదు

  • @kakkurlasrikanth558
    @kakkurlasrikanth558 3 роки тому +105

    దేహుడ నా తెలంగాణ లా ఇంత మంది రచయితలు ఉన్నారా నాకు ఈ పాట విన్న వరకు తెలియాధు అన్న నా తెలంగాణ కోటి రతనాల వీనా 🙏🙏🤝🤝
    అన్న ని గొంతు లా ఏదో మ్యాజిక్ ఉంది

    • @kranthialle3896
      @kranthialle3896 20 днів тому

      నా తెలంగాణ కోటి రతనాల వీణ

  • @karthikbairu4634
    @karthikbairu4634 2 роки тому +288

    అన్న ఇంత మంది మహానుభావులను కలిపి పాట పాడటానికి నీకు ఎంత సమయం పట్టిందొ కాని చాల మంచి ఆలోచన అన్న ఎన్ని సార్లు విన్న తనువు తీరడం లేదు

  • @user-rw8qm7sh9d
    @user-rw8qm7sh9d 11 місяців тому +47

    అద్బుతం ఇలాంటి పాట ఎప్పుడు వినలేదు వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి

  • @thotachanderrao5352
    @thotachanderrao5352 11 місяців тому +18

    అన్న నమస్తే
    ఒక జానపద కళాకారుడు మిగతా అందరిని గుర్తు చేసుకొని పాటగా
    పాడిన విధానం బాగుంది

  • @sambaiahdarangula5866
    @sambaiahdarangula5866 2 роки тому +56

    గిద్దె రాంనర్సన్న నీ పాటలకు నేను పిచ్చ అభిమానిని అన్న మీ కళాకారులకు వందనం అభివందనం పాదాభివందనం అన్న 🙏🙏🙏

  • @mohammadsharif9221
    @mohammadsharif9221 2 роки тому +87

    మొదలు గిద్దే గాలానికి రామ్ నర్సన్నకు నా అభినందనలు ఇంత మంది కళాకారులను ఈ పాటలో చుపినందుకు అలాగే సార సారమ్మ ఇప్పటికీ ఓ ఊపులో ఉంది .నార్సన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🌹🤝

  • @sailupulla5138
    @sailupulla5138 8 місяців тому +13

    అన్న నీకు వందనం ఇంత మంది నీ పాట తో ప్రాణం పోసి అందులో నీ మర్మాలను ను తెలిపిన నీ కలం నీ గొంతుతో ఒక్కొకరీ కీ బిరుదు ఇచ్చినావు 🙏🙏💐💐🎁🎁

  • @archanapinninti8307
    @archanapinninti8307 Рік тому +13

    అన్నా రామ నరసన్న అందరూ గాయకులను ఏది చేస్తూ పాట పాడినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు అన్న నువ్వు ఇలాంటి పాటలు ఎన్నో రాసి పాడాలని కోరుకుంటున్నా

  • @rschinna812
    @rschinna812 2 роки тому +66

    అన్న తెలంగాణలోని కళాకారులను, గాయకులను నీ పాటతో మేపించినవు. తోటి గాయకులను తలుచుకుంటూ వారీ పాటను ఆటను మరోసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి పాట రాసినందుకు మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @tummalapallisuresh6011
    @tummalapallisuresh6011 11 місяців тому +17

    చాలా బాగుందన్న ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్ అన్న

  • @baburaobomma8476
    @baburaobomma8476 5 місяців тому +29

    కాని ఎంత గ్రేట్ మీది తోటి కళాకారులూ అందరు గుర్తు చేసి పాడారు.. నిజంగానే నా తెలంగాణా ఎంత గొప్పదో. మళ్ళీ జన్మ ఉంటే తెలంగాణా లో పుట్టాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻

  • @gsaidulu6243
    @gsaidulu6243 3 роки тому +35

    తెలంగాణా వచ్చింది అన్నా సంతోషం తప్పా, పేదవాళ్ళ బ్రతుకు ఎం మాత్రం మారలేదు అన్న, ఉద్యమం పాటలు మళ్ళీ మొదలవ్వాలి,సూపర్ పాడినవ్ అన్న

  • @boinividyakar8086
    @boinividyakar8086 2 роки тому +22

    అన్నా మీ గిద్దె గళం తో చాలా మంది. అమరవీరుల ను గుర్తు చేశారు 🙏

  • @gnggoud9389
    @gnggoud9389 День тому +1

    తెలంగాణ కోసం అమరులయిన వీరులందరికీ ఈ పాట అంకితం🎉🎉🎉🙏🙏🙏🙏🙏

  • @saikumar6693
    @saikumar6693 11 місяців тому +25

    ఈ పాట వింటుంటే గొంతులో నొప్పి వస్తు కన్నీళ్లు జలమై పరుగెత్తుతుంది😭😭😭😭

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 2 роки тому +27

    అన్నా.. నీ గళం వింటుంటే గుండె చేరువైతుంది.. కళ్ళు చెమ్మగిల్లుతున్నాయు.. నీ ఒక్కోటి గళం వింటే వాళ్ళందరూ గుర్తొస్తారు అన్నా... నీ పాట వింటున్నందుకు నిజంగా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను... చాలా బాగుంది అన్నా.. మల్లోకసారి నా తెలంగాణ పల్లె గొప్పతనాన్ని గుర్తుచేశావు అన్నా.. నీకు శిరస్సు వంచి ధన్యావాదాలు తెలుపుకుంటున్నాను... జై తెలంగాణా...💪🚩

  • @james_4248
    @james_4248 3 роки тому +28

    ఆహా మళ్లీ న తెలంగాణ ను పూర్వం చూసినట్టే ఉంది అన్న మళ్లీ ఆ రోజులు రావాలని కోరుకుంటున్న...

  • @polasrinivas9792
    @polasrinivas9792 Місяць тому +2

    సినిమా పాటలు వినడం మానేసి, మన తెలంగాణ అణిముత్యాలైనా మన కళకారుల పాటలు వినడం బెస్ట్......
    ఏం అంటారు ఫ్రెండ్స్...... నా అభిప్రాయం.....

  • @pothemsreeramulu6607
    @pothemsreeramulu6607 3 місяці тому +17

    మీకు వందనాలు అన్న... కవుల గురించి.. వారి గొప్పతనాన్ని చాటుతూ... మీ గానం... పాట...ఎవర్ గ్రీన్ అన్న

    • @Pranni-gamer
      @Pranni-gamer Місяць тому +1

      అన్నా మీ పాట మళ్లీ మళ్లీ వినాలని ఉంది 🎉🎉

  • @narasimhatv1551
    @narasimhatv1551 2 роки тому +49

    ఎర్రజెండ పాటలు పాడిన నీకు పాదాభివందనాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ఎర్రజెండా వర్ధిల్లాలి జై హో ఎర్రజెండా ఎర్రజెండా గద్దెనెక్కి ఇద్దాం ఎర్రకోటపై ఎర్రజెండా ఎగిరి ఇస్తాం

  • @dollychinnu9310
    @dollychinnu9310 2 роки тому +242

    చాలా రోజుల తరువాత తెలంగాణ పాట కమ్మదనాన్ని రుచి చూపించారు అన్న గారు, కృతజ్ఞతలు.

  • @Ammu-hg3ge
    @Ammu-hg3ge 5 місяців тому +8

    అన్న అది పాట అది జీవితం అందరి జీవితాల్లో అణువు అణువు శ్రీకాకుళం జిల్లా,ది గ్రేట్ రాయల సీమ, తెలంగాణ బిడ్డలు అందరూ నీ పాట మరువరు 🎉

  • @prabhakarroyal357
    @prabhakarroyal357 Рік тому +19

    తెలంగాణ కళాకారుల ఆణిముత్యాల కు పాదాభివందనాలు

  • @lakkireddyrajeshwarreddy7329
    @lakkireddyrajeshwarreddy7329 2 роки тому +115

    సూపర్ గా రాశావు అన్న.... గొప్ప వ్యక్తులను మీ పాటలో గుర్తుచేసి ఉద్యమస్ఫూర్తిని యాదికి తెచ్చావు..🙏🙏

    • @boddapuappanna7094
      @boddapuappanna7094 Рік тому

      అన్న సూపర్ గా రాశావు... నువ్వు గొప్ప వ్యక్తులను మీ పాటలో గుర్తుచేసి ఉద్యమస్ఫూర్తిని గుర్తుకు తెచ్చావు అన్న.... 💐💐💐🌹🌹🌹🤝🤝🤝👏👏👏

    • @anjaiahkommula1809
      @anjaiahkommula1809 Рік тому

      కళ కారు లు.మోద వూలు.దో ర.క ళ్లు..మోక్కూత్ న్నర్

    • @schoolstudent1545
      @schoolstudent1545 9 місяців тому

      👍

    • @vatyalabhargav493
      @vatyalabhargav493 6 місяців тому

      ​మల్ ల్jల్ల్ 1:20 😊 యూ l0 ఓó😅😮😅oo😊😅

  • @bhagavatamnarasimhamurthy4245
    @bhagavatamnarasimhamurthy4245 2 роки тому +165

    ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. తెలంగాణా ఉద్యమవీరులని, అమరులని తలచుకున్నప్పుడు కంటిలో నీరు ఆగదు. రాసిన వారికి ,పాడిన వారికీ ఈ పాట తో సంబంధమున్న అందరికీ శతకోటి నమస్కారాలు

  • @chennamonisrikanthyadav4434
    @chennamonisrikanthyadav4434 Рік тому +8

    ఇంత మంచి పాట ను మాకు అందించినటువంటి గిద్దె గళం రాం నర్సయ్య అన్న గారికి మా యొక్క ధన్యవాదాలు ..........

  • @bayyalingannayadav9494
    @bayyalingannayadav9494 Рік тому +8

    అన్నగారికి ఆరోగ్యరీత్యా సమస్య వచ్చింది అందరూ ఆదుకో గలరు

  • @khc8011
    @khc8011 2 роки тому +273

    ప్రపంచం లో ఎక్కడ లేని కళాకారులు మా తెలంగాణ లో ఉండడం నాకు గర్వంగా ఉంది.
    సచ్చిన నరాలకు జీవం పోసినట్లు ఉన్నయ్ నా తెలంగాణ పాటలు.
    ఆస్కార్ అవార్డ్ కూడా నా కళాకారుల కాలు కింద ధూళి మాత్రమే.

  • @nareshrajana4433
    @nareshrajana4433 2 роки тому +237

    మన దేశంలోనే తెలంగాణ పాట, మాట, యాస, సంస్కృతి చాలా చాలా బాగుంటాయి...
    ఇట్లు ,
    మీ అభిమాని
    రాజాన నరేష్, గాజువాక, విశాఖ జిల్లా,
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

  • @manodevarapalli
    @manodevarapalli 8 місяців тому +8

    రాం నర్సయ్య గారు.... ఇంతటి ఘనమైన కవులను, గాయకుల ను ఈ తరం వారికి తెలియచేస్తూ.. అద్భుతమైన రచన, అత్యద్భుతమైన గానం, స్వరాలతో మమ్మల్ని అలరించి చైతన్య వంతులను చేసిన మీకు నా పాదాభివందనం...

  • @manjunath321
    @manjunath321 Рік тому +57

    I am from Karnataka ... like to Telangana culture....🇮🇳

  • @discoveringofhappyness8940
    @discoveringofhappyness8940 Рік тому +25

    భాధలలో ఉన్నపుడు మీ పాటలు వింటే అన్నీ మారిసిపోతం అన్న.......👌🙏👍🤝

  • @hymadpashamohammad2803
    @hymadpashamohammad2803 3 роки тому +97

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరడంలేదన్నా...
    రాంనర్సన్న నీకు పాదాభివందనం అన్నా

  • @asaramarao9996
    @asaramarao9996 Рік тому +57

    ప్రముఖులను గుర్తు చేస్తూ పాడి,ఆడిన రాం నర్సన్న గారికి హృదయపూర్వక అభినందనలు.

  • @satyanarayanakunigiri3485
    @satyanarayanakunigiri3485 10 місяців тому +9

    తెలంగాణా సాంసృతికీ, సాహిత్యానికి ఊపిరులు ఊదిన ఉద్యమ కెరటాల వెన్నెల, సాహిత్య సమ్మేళనం ఈ పాట. నిజమైన తెలంగాణాన్ని దర్షింపజేసిన దర్పణం ఈ పాట.

  • @GiddeGalam
    @GiddeGalam  3 роки тому +2141

    అందరికీ ఉద్యమాభివందనలు అందరి కళాకారుల పేర్లు పెట్టలేక పోయాను పార్ట్2లో మిగతా కవులు కళాకారుల పేర్లతో మళ్ళీ మీ ముందుకు వస్తా అన్యాదా భవించొద్దు🙏🙏🙏🙏🙏

    • @gopathimallesh8082
      @gopathimallesh8082 3 роки тому +94

      అన్న నీకు పాదాభి వందనాలు.. తెలంగాణ లో ఉన్న గొప్ప... రచయితలను ఒక్క పాటలో చెప్పావ్ అంటే.... నువ్వు నిజంగా గ్రేట్ అన్న 🙏🙏

    • @shankarvshankar3959
      @shankarvshankar3959 3 роки тому +30

      Bro manukota Prasad bro ekkada mentioned ladu this is not correct bro

    • @thogarinarsaiah1181
      @thogarinarsaiah1181 3 роки тому +21

      దేశపతి శీనన్న గారిని పెట్టలేవు అన్న

    • @vipsgroupofcompeny9468
      @vipsgroupofcompeny9468 3 роки тому +38

      @@thogarinarsaiah1181 రేంజేర్ల రాజేష్ అన్న పేరుకుడా రాయలేదు అన్న

    • @rajeshranapanga1025
      @rajeshranapanga1025 3 роки тому +21

      నాకు ఉన్నవి రెండు చేతులు పాట రికార్డింగ్ చెయ్యండి అన్నా....

  • @kanugulasrikanth7489
    @kanugulasrikanth7489 3 роки тому +264

    తెలంగాణా ఉద్యమం చాలా గొప్పది అన్న
    మా నాన్న లెక్చరర్ ఉద్యోగం విడిచిపెట్టి
    ఉద్యమంలో పనిచేశాడు తెలంగాణ వచ్చింది ప్రజల పోరాట ఫలితంగా కానీ
    ఉద్యమం చేసినొల్లు బ్రతుకులు మారలేదు
    ఉద్యమాన్ని చూసి నవ్వినోళ్ళు
    నాయకులు అయ్యారు....
    ధన్యవాదాలు అన్న
    తెలంగాణ వచ్చాక. మొదటి గొప్ప పాట నీదే
    ప్రశ్నించు అన్న
    ప్రజల గుండెల్లో ఉంటావు ఎప్పటికీ

  • @singaraboinaashok
    @singaraboinaashok 4 дні тому

    సమస్త తెలంగాణ రాష్ట్ర కళాకారులను గుర్తు చేసుకుంటు మీరు పాడిన ఈ పాట మహా అద్భుతం ...........

  • @waghmaresailu776
    @waghmaresailu776 3 місяці тому +3

    Chala chala bagundhi song...enni sarlu vinna inka vinalanipisthundi....Jammu to Mumbai journey lo.so many times vinna....

  • @kishorevanguri8622
    @kishorevanguri8622 3 роки тому +39

    కంచు మొగినట్లు వాయస్ చాలాబాగుంది అన్నగారు. జై భీమ్.

  • @sarpesuresh2622
    @sarpesuresh2622 Рік тому +205

    గద్దె గళం అద్భుతం.
    మీ తోటి కళాకారులను అందరిని కలుపుకొని పాట రాయడం,పాడడం మీ గొప్ప మనస్సుకు శతకోటి వందనాలు. పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలపించే మీ రచన,గానం మహాద్భుతం.

  • @ammulukutty
    @ammulukutty Місяць тому +1

    అన్నా నీ పాటలో ఉన్న ప్రతి అక్షరం తెలంగాణ కవుల యొక్క కలల గురించి చెప్పే విధంగా ఉంది ఇంత ఆలోచింప చేసే విధంగా రాసిన నీ కలాం కి సలామ్ అన్న❤❤❤

  • @sudarshananjapally7433
    @sudarshananjapally7433 3 роки тому +65

    కళా నేడు వలలో చిక్కిన చేపయింది,
    పాటలబడి నేడు గడీల భజన చేస్తున్నది..
    అని రాచకొండ రమేష్ అన్న ఎప్పుడో చెప్పాడు...
    వాటన్నింటినుంది మా కళాకారులు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..
    రామనర్సన్న.. నిపాట మళ్ళీ ఒక ప్రజాగొంతుక కావాలి..🙏🙏🙏

    • @koteshbommakanti3147
      @koteshbommakanti3147 3 роки тому

      Avunu anna ...lalasalm

    • @lingannabelli8215
      @lingannabelli8215 3 роки тому

      Ppt

    • @raviraviwi5631
      @raviraviwi5631 3 роки тому

      @@koteshbommakanti3147gbjjujuuùuuùuumkkkko09igfxxfzwqqe Zz ujgyy79poo99t43evgai tuu9

    • @kotlaparanitha
      @kotlaparanitha 2 місяці тому

      Epudu asallu ayina gadila cm epudu nu revanth ni adugu nenu thisukelli lopala vestharu TDP randa borakar ga

  • @ungguralarajeshwer7935
    @ungguralarajeshwer7935 6 місяців тому +11

    ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది అన్న
    ✊జై నా తెలంగాణ కోటి రాతణాలవీణ✊ జై భీమ్
    అన్న
    మీకు పాదాభివందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MadhukumarA7675
    @MadhukumarA7675 Рік тому +7

    ఈ పాట లో ప్రతి కవి గాయకుడు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా ఉన్నవారే వారి పాటలతో తెలంగాణా ఉద్యమాన్ని ప్రజలని ఉతేజ పరిచేవారు మీకు లాల్ సలాం అన్న అందరికి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @supriyastudio6146
    @supriyastudio6146 Рік тому +49

    ఈ పాట రాసిన ఇంత మంది కళాకారులను గుర్తు చేసిన ఆ కలానికి పాదాభివందనం

  • @srinivasreddy228
    @srinivasreddy228 3 роки тому +118

    గిద్దే గళానికి దొడ్డ దండాలు. పల్లె పాటకు ప్రాణం పోసిన జానపద గేయ కోవిదునికి జేజేల నీరాజనం...✍️

  • @chandrashekar-jd9xm
    @chandrashekar-jd9xm Рік тому +4

    పల్లె యదికొచింది...
    పాట యదికొచింది
    కళ కారులు యదికొచిండ్రు...🙏🙏🙏

  • @sravananupala1358
    @sravananupala1358 11 місяців тому +7

    తెలంగాణ కళాకారులను పాటలో చూపించిన మీకు పాదాభివందనం

  • @sairamgujjeti7735
    @sairamgujjeti7735 3 роки тому +150

    అప్పుడు కొమ్మలల్లో పాటతో ఇప్పుడు ఈ పాటతో గిద్దే రాంనర్సన్న నువ్వు పాటకు పెట్టిన ప్రాణం సూపర్ అన్న 🙏🎉

  • @jallabrahmaraju6815
    @jallabrahmaraju6815 Місяць тому +2

    Super song baley vundi

  • @srikanthreddy3174
    @srikanthreddy3174 Рік тому +10

    ఈ పాట రాసిన రచయితకు, పాడిన రామ్ నర్సన్న కు శతకోటి పాదాభి వందనాలు 🌹🌹💐💐🙏🙏

  • @sriniwaasrenukuntla5118
    @sriniwaasrenukuntla5118 3 роки тому +76

    చాలా బాగుంది గిద్దె రాంనర్సన్న
    మీ రేణుకుంట్ల శ్రీనివాస్
    సీనియర్ జర్నలిస్ట్
    మంచిర్యాల

    • @laxmanpotta6155
      @laxmanpotta6155 3 роки тому +3

      పాట చాలా బాగుంది పల్లెటూరు ఊళ్ళో మర్చిపోయారు.. మళ్లీ పల్లెటూర్లు వాతావరణాన్ని గుర్తు చేసిన పాట రాసిన వారికి మరియు పాట పాడిన వారికి నమస్కారాలు...

  • @olivaprayertemplefullgospe3149
    @olivaprayertemplefullgospe3149 3 роки тому +336

    ఇంత మంది గాయకులను తలుచుకుంటూ పాట రాసి పాడటం నిజంగా నీది చాలా గొప్ప మనసే అన్నా ...

  • @shaikabdullah6330
    @shaikabdullah6330 Рік тому +4

    Telangana folk songs likers oka like kottandi
    We love TELANGANA FOLK SONGS

  • @saicharanreddy2921
    @saicharanreddy2921 4 місяці тому +3

    Pataku pranam icheyalani anipistundi. Telangana udyamam endukanta goppaga ugrrupanga upandukundo e okka patanu chuste next generation ki artam aytadannna.

  • @bondugulasrikanth4970
    @bondugulasrikanth4970 Рік тому +75

    అన్న 👏👏👏🙏 నీ పాటతో మళ్ళీ నా హృదయం కదిలించినవే, తెలంగాణ ఉద్యమంలో మీ పాటలు మరిచిపోలేరు ఎవరు, ఒక్క పాటలోనే అందరి కళాకారులను వారి పాటలను చూపించినందుకు మీకు హృదయపూర్వక కళాబి వందనాలు🙏 అన్న💐💐💐💐💐💐💐💐💐💐💐 ,🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @praveenkumaryannamalla6346
    @praveenkumaryannamalla6346 3 роки тому +26

    🙏అన్న ఈ పాటలో నాకు ఇస్టమైన సింగెర్స్ ను గుర్తు చేసినందుకు ఫస్ట్ ధన్యవాదములు. 🙏అన్న పాట చాలా బాగుంది అన్న మళ్ళీ ఇలాంటి పాటలను మరెన్నో తీయాలి అన్న 💐💐💐💐💐💐💐💐

  • @ravikumarseekuru3856
    @ravikumarseekuru3856 11 місяців тому +8

    అందరు కళాకారులను
    అభినందించడం అద్భుతం.... 🙏

  • @sudhakargoud2448
    @sudhakargoud2448 8 днів тому

    సూపర్ నాకు ఈ దేశంలో అన్ని ప్రాంతాలు నా ప్రాణమే

  • @rscreations4815
    @rscreations4815 3 роки тому +39

    మీకు పాదాభివందనం అన్నగారు
    పాట అద్బుతం మహా అద్భుతం

  • @sririthishk4390
    @sririthishk4390 2 роки тому +37

    అన్న మీరు పాటలు పాడుతూ ఉంటే పల్లే పులకరిస్తుంది ఇలాంటి పాటలు మీరు పాడాలని ఆ దేవుని కోరుకుంటున్న జై GIDDE GALAM

  • @user-tg7ww1tn3l
    @user-tg7ww1tn3l 11 місяців тому +6

    మన తెలంగాణ పాటలు వింటే మనసు హాయిగా ఉంటది

  • @ponagantithirupathi3797
    @ponagantithirupathi3797 Рік тому +4

    అప్పటి గుర్తులు మల్లి గుర్తుకు తెచ్చి పల్లె సువాసనను మల్లి మా హృదయాలకు ఆనందాని ఇచ్చారు అన్న .జై లాల్ సలాం

  • @kumart6395
    @kumart6395 3 роки тому +17

    మీ జానపద పాటల వల్లనే మనకి తెలంగాణ వచ్చిందన్న మీకు మీ పాటలకి మాకు రోమాల్ లేస్తున్నాయి అన్న మీకు పాదాభివందనాలు

  • @nareshkumar-vo7qw
    @nareshkumar-vo7qw 3 роки тому +48

    ఇప్పటికి అయినా మరి ప్రజల పక్షం వచ్చినందుకు దండాలు అన్న... మా అభిమానం నీకు ఎల్లప్పుడూ ఉంటది.. జై గిద్దె రామనర్సన్న

  • @BHUKYAKALYANNAIK
    @BHUKYAKALYANNAIK Рік тому +6

    ఈ పాట వింటుంటే నా సంస్కృతి అంతా గొప్పగా ఉంది అని మనసు పొంగి పోయింది.
    JAI TELANGAANA✊

  • @shekarmanne7152
    @shekarmanne7152 Рік тому +5

    గిద్దె రమణర్సయ్యకు వందనలు కళ్ళలో నీళ్లు తెప్పించాలు 🙏🙏🙏🙏🙏

  • @narsimhachary9043
    @narsimhachary9043 2 роки тому +10

    మళ్ళీ ఒకసారి ఆ ఊద్యమంలోకి తీసుకెళ్ళావు ఆ రోజులను గుర్తుకు తెచ్చి మా ఆశ్రువులు ఎల్లపుడూ మా తోటే ఉంటాయ్ అని మళ్ళీ నిరూపించిన నీకు పధాబి వందనం అన్న😭😭

  • @shekardandu978
    @shekardandu978 2 роки тому +28

    ఈ పాట విని కంటతడి పెట్టినవాళ్లు ఎంతమంది
    (Like)

  • @rajudeepilli
    @rajudeepilli 18 днів тому

    మీ తోటి గాయకులను కీర్తిస్తూ పాడడం ఎంత అద్భుతం..మీ గానం , గాత్రం అంతే అద్భుతం

  • @dudigamashivashanku3000
    @dudigamashivashanku3000 6 місяців тому +4

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు అన్న 🙏🙏🙏

  • @avinashrishi2574
    @avinashrishi2574 3 роки тому +22

    రామనర్సన్న జ్తె భీమ్ లు. రెండు తెలుగు రాష్టాలలో నీలాంటి గాయకుడు లేడు .ఇది నిజాం ఎందుకంటే తీయాటి గొంతు సన్నగా ఉండే రాగం వింటుంటే హాయిగా ఉంటుంది.పదాలు స్పష్టంగా అర్దం అవుతాయి అన్న సూపర్ గా పాడినవు అన్న

  • @siddusiddu1272
    @siddusiddu1272 Рік тому +46

    తెలంగాణ లో పుట్టిన నదుకు చాలా గర్వాంగా ఉంది అన్న మీ పాట వాళ్ళ 🙏🙏

  • @mothilalnaik7785
    @mothilalnaik7785 Рік тому +13

    ఒక పాటతో మన తెలంగాణ కళాకారులు అందర్నీ గుర్తు చేసినావ్ అన్న నీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏

  • @koppulasayanna7369
    @koppulasayanna7369 10 днів тому

    అన్నగారికి పాదాభివందనం ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను అన్నగారికి జై

  • @user-ob4cz1lz5q
    @user-ob4cz1lz5q Рік тому +17

    తెలంగాణ ఉద్యమం ఒక కల అయితే ఆ కల సాకారం చేసేందుకు పాటే ఒక ఊపు తీసుకువచ్చి ప్రతీ పల్లెకు ఇంటికి చేరి విజయంలో కీలకమైన తెలంగాణ సాహిత్యం వాటిని రాసిన కవులకి మధురంగా పాడిన వారందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు...

  • @nagaraniabboju157
    @nagaraniabboju157 3 роки тому +40

    అన్న గారు చాలా చాలా చక్కగా పాడారు, మీ నాట్యం సాధారణముగా చక్కగా ఉన్నది 👍🌹, ప్రజా కవులను గొప్పగా గుర్తుకు తెచ్చారు, సంగీతం వినసొంపుగా ఉన్నది 🌹🙏

  • @prasadkondaparthi8853
    @prasadkondaparthi8853 10 місяців тому +2

    అన్నా మళ్ళీ జన్మ వుంటే తెలంగాణ లోపుట్టలని వున్నది

  • @nareshlavanyachanel7534
    @nareshlavanyachanel7534 Рік тому +16

    అన్న ఈ పాట వింటుంటే వినాలని ఉంది సూపర్ అన్న 🙏🙏🙏👌తెలంగాణ ఉద్యమం నీ యది చేస్తూ తెలంగాణ అమరవీరల గానన్ని మరోసారి యాది చేశారన్న మీకు తెలంగాణ అభివందనం అన్న

  • @srinivasborrabrs2035
    @srinivasborrabrs2035 2 роки тому +169

    అన్న ఈ పాట విన్నాక ...ఏమని పోగడలో మాటలు రావడం లేదు...నాకు మా బాబాయ్ కార్లో వెళ్ళేటపుడు విను అని పెట్టిండు. ఇక ఆ రోజు మొదలు ఇప్పటికీ రోజుకు ఒక్కసారి వినకపోతే ఏదో మరిచి పోయినా ఫీలింగ్. నాకు నచ్చిన పాటల్లో వెళ్ళ మీద లెక్క పెట్టే పాటల్లో ఇదే మొదటి పాటగా చెప్పుకునే స్థాయి.

  • @bommanapallyanjaneyulu2978
    @bommanapallyanjaneyulu2978 Рік тому +4

    అన్న, ఈ పాట వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది.
    నీకు సలాం, నువ్వు రాసిన పాటకు సలాం,
    అన్న.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @konkalaraviteja1013
    @konkalaraviteja1013 15 днів тому

    అన్నా ఈ పాటలాగే తెలంగాణ పోరాటం లో ప్రాణాలు అర్పించిన వారి అందరి త్యా గలను అందరికీ గుర్తు చెయ్ అన్న తెలంగాణ అమరవీరుల త్యాగాలను మరిచిపోతున్నారు. నీకు శతకోటి వందనాలు చేస్తా అన్నా

  • @kondramallesh2246
    @kondramallesh2246 2 роки тому +23

    Super song
    మీకు పాదాభివందనం

  • @nadigotisrinivas9562
    @nadigotisrinivas9562 3 роки тому +218

    ఒకే పాటతో అందరిని గుర్తుకు వచ్చేలా కడుపు నిండా కల్మషం లేని మనసుతో పల్లె తల్లి పాట పాడిన అన్న కు పాధాబి వందనాలు....

  • @bvijay1603
    @bvijay1603 17 днів тому

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీమళ్ళీ వినాలని వుంది అన్న మాటకు విలువ ఇవ్వడం ఒక మంచి మార్గం పాట చాలా మంచిది తెలంగాణ ఉద్యమంలో అమరులైన మన అన్నలకి అక్కలకి ధన్యవాదాలు

  • @ArunKumar-cr6bq
    @ArunKumar-cr6bq 3 роки тому +363

    రోజుకు 10 సార్లు వింటేనే మనుసు తృప్తి

  • @bhaskarb6440
    @bhaskarb6440 2 роки тому +19

    I am from vishaka patnam….Telengana having itself “gana”…source of palle-voices