Mana Uru Village Motivational Song By Charan Arjun ||Telugu Best inspirational song || Bvm Creations

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Mana Uru Village Motivational Song By Charan Arjun ||Telugu Best inspirational song || Bvm Creations
    Lyrics- Singer-Music: Charan Arjun,
    Editing-Suresh Surya
    Charan Arjun More Songs;follow This link
    / @charanarjungmc
    Click here to watch: Inspirational and Motivational Speeches
    For latest Updates : / bvmcreations
    Like Us on Facebook- / bvmcreation
    Follow Us on Twitter - / creationsbvm
    Follow Us on Google+ -plus.google.co...

КОМЕНТАРІ • 2,6 тис.

  • @chandhrashekarbandi8358
    @chandhrashekarbandi8358 5 років тому +61

    అన్న ఇలాంటి పాటపడిన నీకు ధన్యవాదాలు... మన ఊరు మన అమ్మ, ఆ జీవితం వేరు భయా... ఇప్పుడు వెస్ట్ లైఫ్.....

  • @ramuballa2479
    @ramuballa2479 4 роки тому +24

    అనుకోకుండా మీ‌ పాటలు విన్నాను సోదరా... అద్భుతం.... మట్టి లో మాణిక్యం సర్ మీరు..మానవ సంబంధాలను.. విలువలను చాలా బాగా చెప్పారు..

  • @VenkatReddy-xh9or
    @VenkatReddy-xh9or 5 років тому +397

    మాటలు లేవు అన్న ఈ పాట కీ......👌👌👌💟💓💛

  • @nchangalreddy8836
    @nchangalreddy8836 3 роки тому +18

    అమ్మ తరువాత అమ్మే కదా ఊరంటే.... ఊర్లో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మర్చిపోకూడదు..I LOVE MY VILLAGE.. దేవసముద్రం 🙏

  • @vanganaveenyadav95
    @vanganaveenyadav95 5 років тому +13

    ఎంత బాగా పాడారు సార్.. పాతరోజులు గడుస్తున్నా నేటికీ

  • @pavankalva7133
    @pavankalva7133 3 роки тому +1

    Charan arjun anna ki padhabevadhanallu ma village ❤️❤️

  • @dasagarideepthi1928
    @dasagarideepthi1928 4 роки тому

    Super.....👏👏👏👏song.....🙏🙏🙏

  • @RajeshKumar-kw4os
    @RajeshKumar-kw4os 4 роки тому

    Anna nice song super

  • @rahulkonidala9118
    @rahulkonidala9118 5 років тому

    Nice song thenk u

  • @vjayaramvjayaram7144
    @vjayaramvjayaram7144 4 місяці тому

    Mana ooru super annna

  • @thirupathirebal1421
    @thirupathirebal1421 4 роки тому

    Super song 😘🤗🤗😪😪😪😥

  • @Badboy24934
    @Badboy24934 5 років тому

    Awesome

  • @padmagaddam1020
    @padmagaddam1020 2 роки тому

    Nice

  • @sathyamrss798
    @sathyamrss798 5 років тому

    ఊర్లో ఉపాధి లేక బయటికి వస్తే డబ్బులు ఎన్నోచిన సరిపోవు చదువుకున్న చదువు పనికి రాదు కానీ ఊరు ఎం లేకున్న అన్నం తిని బతకొచ్చు వ్యవసాయ ఎవడికింద పని చేయవలసి ఉండదు రాజరికం వ్యవసాయ రంగం

  • @pradeepnani5860
    @pradeepnani5860 2 роки тому +2

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gavvalasivayya1639
    @gavvalasivayya1639 2 роки тому

    💐💐💐💐💐💐💐💐

  • @myownaccount23
    @myownaccount23 5 років тому

    No Caption bro

  • @Kks_Foods
    @Kks_Foods 5 років тому +55

    పల్లెటూర్లు మారి, తిరిగి పూర్వవైభవంతో కల కల లాడలని ఆ భగవంతుడిని,మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ప్రతి ఒక్కరు ఒక like కొట్టడండి అన్నా, అక్క🙏

    • @Thevoiceofprem
      @Thevoiceofprem 3 роки тому

      కలగానే మిగిలి పోతుంది అన్న నీ ఆశ

    • @Giridhar_Reddy143
      @Giridhar_Reddy143 Рік тому

      ​@@Thevoiceofprem no saraina leader kavali anthe..

    • @namburinarasimharao3391
      @namburinarasimharao3391 4 місяці тому

      Plastic vadileyandi,
      Antha baguntadadi 😢

  • @boyagirish5656
    @boyagirish5656 5 років тому +1659

    చిన్నప్పుడు చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా ఎంతో హాయిగా ఉండిది ఇప్పుడు నెలకి 30 వేలు వున్న సంతోషం లేదు

  • @u.s.vswamy347
    @u.s.vswamy347 5 років тому +274

    ఇలాంటి పాటకు కూడా dislike చేసేవారు వున్నారా.
    వాళ్లకు మెంటల్ అనుకుంటున్నాను.
    లేదా తెలుగు రాదు అనుకుంట వాళ్లకి.👿👿👿

  • @Tallahenaraju
    @Tallahenaraju 4 місяці тому +16

    2024 lo kuda ee patanu Vina valu vunnara

  • @AnilKumar-wg3wr
    @AnilKumar-wg3wr 5 років тому +169

    మాటలు లేవు అన్నా సాంగ్ సూపర్.., ఇక లిరిక్స్ అయితే అదుర్స్ 😘😘😘👌👌👌😎

  • @RajeshVarma-ul6pp
    @RajeshVarma-ul6pp 5 років тому +223

    నిజాంగా నాకూ మా ఊరు గుర్తోంచింది కళ్ళ లో నీళ్లు తిరిగిగాయి అన్న ఇలాంటి పాట ఇంకోటి చెయండి

  • @chandua3713
    @chandua3713 5 років тому +156

    అన్న కళ్లలో నీల్లు వచ్చాయి , బాగుంది అన్నది చిన్న పదం 👌👌👌👌👌

  • @rakeshindian6215
    @rakeshindian6215 5 років тому +162

    ఇంత మంచి పాటకి కూడా డిస్ లైక్స్ వచ్చాయి , చాలా బాధాకరం... ఆ డిస్ లైక్ కొట్టిన వాడూ మాత్రం పల్లెటూరు వాడూ కాదు.

  • @NareshKumar-uz4fr
    @NareshKumar-uz4fr 5 років тому +205

    అన్న ఈ పాటను మాకు అందిచినందుకు నిన్ను మనసారా గుండెకు హత్తుకుని అభినందించాలని ఉంది. చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెప్పించారు Thankyou 👌👌👌👌👌

  • @spcreations1565
    @spcreations1565 5 років тому +283

    అన్న కళ్ళలో నీళ్లు తిరిగాయ్..
    🙏🙏🙏పెల్లెటూరు గురించి సూపర్ గా పాడారు 👌👌👌👌

    • @saianu7504
      @saianu7504 5 років тому +1

      Srikanth Darling g

    • @pendemsatyam4143
      @pendemsatyam4143 5 років тому +2

      palle kallamundu kaninchinantha andamga vunnadi eepata

  • @avnaik4285
    @avnaik4285 5 років тому +160

    మంచి మనుసుపెట్టి తీశారు మన పల్లెటూళ్లకు జూహార్లు

  • @harikrishnamudiraj1895
    @harikrishnamudiraj1895 3 роки тому +79

    నిజం గా ఈ పాట వింటున్న అంత సేపు ఎవరికి వారికే వాళ్ల ఊరు గుర్తుకు వస్తుంది .. నిజం గా నాకు అయితే మా ఊరు గుర్తుకు వచ్చింది...🙏👍👌

  • @tarakchokkara3626
    @tarakchokkara3626 5 років тому +88

    Wow super మనసును తో వినండి ....నాకు చిన్ననాటి రోజులు గుర్తుకువచ్చాయి... మళ్ళీ అలాంటి రోజులు రావాలని కోరుకుంటున్న...

  • @ravitejachigurla4337
    @ravitejachigurla4337 5 років тому +761

    నిజంగా చెప్పాలంటే.... ఈ పాట విన్నప్పుడులా ఏదో తెలియని బాధ
    ...ఎప్పటికి ఒక్క 100 సర్లు విన్నాను ...మంచి లిరిక్స్ అన్న గారు ...ఎసోట్టి పాటలు ఎంక రావాలని మనస్పూర్థి కోరుకుంటున్న

  • @శివజనసేనపార్టీనాగీళ్ళ

    ఒక్క ఊరి గురించి యువత అర్థం చేసుకునేలా చాలా బలమైన పదాలతో ఈ యొక్క పాట నా మనసు కు చాలా ఆకట్టుకుంటుంది.
    పాట....చాలా చాలా బాగుంది...!
    పాట రాసిన వారికి పాడిన వారికి ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి....
    నా మనసు స్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను...
    *"మీ:-శివ~JSP"*
    *"జై హింద్..!"*

  • @RkbujjiRkbujji
    @RkbujjiRkbujji 5 років тому +38

    మా ఊరు గుర్తొచ్చేసింది ....మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు

  • @maheshrasamalla752
    @maheshrasamalla752 5 років тому +71

    కరెక్టుగా చెప్పావు బ్రదర్ నీకు నా వందనాలు ఇంత మంచి పాట పాడి మనసుకు ఏదో తెలియని ఫీలింగ్🙏🙏🙏🙏

  • @therinikrishna810
    @therinikrishna810 5 років тому +117

    అన్న వింటుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి

  • @Visshamma
    @Visshamma 5 років тому +118

    గల్లీలో పిల్లలూ ఏమయేర .. వాళ్ళ అల్లర్లు ఊరిలో కరువయేరా.. ఎట్టుండేర ఊరు ఎట్లుండేరా ఎనకాట మన ఊరు ఎట్లుండేరా...

  • @vishu1066
    @vishu1066 Рік тому +19

    నా ఊరు m బాలేదు అని నూటికి నూరు శాతం చెప్పచ్చు...కానీ బాగు చేసుకునే బాధ్యత నా ప్రతి ఒక్క సోదరునికి బందువుకి ఉంది బాగుచేసుకోవలి 🤝💝....

  • @karthikavusali9199
    @karthikavusali9199 5 років тому +42

    చాలా చాక్కగా ఉంది పాట అంతరించి పోతున్న పల్లె జీవనాన్ని కళ్ళకు కట్టినట్టు పాట రూపంలో వ్యక్తపరిచారు సూపర్ 👍👌

  • @sanjuvarmaragamshetty2676
    @sanjuvarmaragamshetty2676 5 років тому +68

    సూపర్...... ఈ పాట ద్వారా చాలా మంది మారాలని కోరుకుంటున్నాను.....

  • @Visshamma
    @Visshamma 5 років тому +37

    చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేశావ్ అన్న .. lovely మూమెంట్స్ ...

  • @gopathimallesh8082
    @gopathimallesh8082 5 років тому +26

    పాట వింటుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అన్న నిజంగా నువ్వు అక్షర బ్రమ్మ వు 🙏🙏నీకు ఎన్ని దండాలు పెట్టిన తక్కువే

  • @Mahesh9633
    @Mahesh9633 5 років тому +280

    ఈపాట మనస్సు కు హత్తుకుంది. కళ్లలో నీరు తిరుగుతుంది. పల్లెలు చాలా మారిపోయాయి. ఇలాంటి సాహిత్యం మీ నుండి ఇంకారావాలి.👍👍👍👍👍

  • @jayanthgaming5815
    @jayanthgaming5815 5 років тому +37

    చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు
    నిజంగా ఈ పాట వింటున్నంతసేపు కడ్లలో నీళ్లు వచ్చేశాయి.మీకు నా పాదాభివందనం అన్న .

  • @vijaykumar-ki7pw
    @vijaykumar-ki7pw 5 років тому +23

    పల్లెటూరు అంటే పల్లెటూరు అక్కడ ఉన్న సంతోషాలు ఆప్యాయతలు ఇంకెక్కడ దొరకవు అప్పటికి అయిన ఇప్పటికీ అయిన పల్లెటూరి ప్రేమలు ఇంకెక్కడ దొరకవు చాలా చక్కటి పాట

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 Рік тому +3

    నాటి పల్లెల వాతరణము కళ్ళకు కట్టినట్లు వర్ణించారు కన్నీటిని కురిపించారు. ఇప్పుడు కళ్ళు తుడుచుకోవాలి అంటే మన చేయి తోనే...😢😊

  • @harishgoud1764
    @harishgoud1764 5 років тому +102

    E pata nachina varu like cheyande

  • @santhoshasari7978
    @santhoshasari7978 5 років тому +32

    పల్లే ల ఉండే అనుబంధాలను వేరే ఎక్కడా పొందలేము. ఎనుకట అనుబంధాలకు ఉండే విలువ నే వేరు అది ఒక గొప్ప వరం ఆ ఆనందాన్ని పొందిన...ఆనాటి ప్రజలకి.

  • @Mohanbabuchalla
    @Mohanbabuchalla 5 років тому +15

    అవును నిజమే... కళ్ళు రాజకీయం గ్రామానికి వచ్చి పఛని బంధాలనూ పెనుగుండలా ముంచెత్తుంది...😌😭☹

  • @mprakash5764
    @mprakash5764 4 роки тому +23

    చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు భయ్యా ఇటువంటి సాంగ్స్ ఎన్నో బివిఎం క్రియేషన్స్ వారు చెయ్యాలని మనసుపుపూర్తిగా కోరుకుంటున్న.నాలాగే ఈ సంస్థను ఇష్టపడే వారు like కొట్టండి

  • @VIJAYKUMAR-kj9li
    @VIJAYKUMAR-kj9li 7 місяців тому +7

    ఈపాట వింటూంటే నా జీవితంలో జరిగినా వీ జ్ఞాపకం వస్తుంది చాలా భాధ వేస్తోంది

  • @rajucheguriyt9955
    @rajucheguriyt9955 5 років тому +229

    అమ్మ తర్వాత అమ్మేనురా ఊరంటే నీ తొలి చిరునామారా, నువ్వు ఏంతెత్తుకు ఎదిగిన నీ మూలం ఈడే ఉన్నదిరా... ఊరు కన్నీరుగా మారితే ఆ ఉసురు యాడున్న తగిలేనురా...
    ఇది మాత్రం అక్షర సత్యం, ఊర్లో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మర్చిపోవొద్దు.

  • @azeezmohammed6081
    @azeezmohammed6081 5 років тому +24

    Really Exlent song bro 👌👌👌...ఈ పాట విన్న ప్రతీసారి ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయీ ...చిన్న పండుగ ఒచిన ఊరు అంత ఎకమై గొప్పగా జరిపేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు ..ఊరిలో యువత అంత GULF బాట పయాణమై ఊరిని ఒంటరి చేసి వెళ్లిపోయారు ,😢😢😢 ఎంతైనా ఆ పాత రోజులు మళ్లీ తిరిగు వస్తే ఎంత బాగుంటుందో ...☺☺

  • @hanumantreddy1191
    @hanumantreddy1191 2 роки тому +1

    ఈ పాట విని నగరాలకు వలస పోయిన వాళ్ళు కనీసం ఒక్కడంటే ఒక్కడు మనసు మారి వాళ్ళ ఊరికి 20 పర్సెంట్ సంపాదించిన సొమ్మును ఖర్చు చేస్తే ఈ పాటకి అర్థం ఉంటుంది

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 4 роки тому +27

    చాలా మంచి పదాలు తో చాలా చక్కగా రాశారు ఉన్న వాస్తవాలను గ్రహించి పాట రూపంలో మాకు అందించినందుకు ధన్యవాదాలు మీకు ఇలాంటివి మరిన్ని పాటలు చేయాలని కోరుకుంటున్నాను

  • @limelightnlp1896
    @limelightnlp1896 5 років тому +32

    కళ్లలో నీళ్లు తెప్పించినారు అన్న, మీకు మనస్పూర్తిగా శత కోటి దండాలన్న.

  • @cherryranjith9489
    @cherryranjith9489 5 років тому +134

    పల్లెటూరు సాంగ్ అంటే ఇలా ఉండాలి👌👌👏👏

  • @murthymama9554
    @murthymama9554 4 роки тому +18

    నిజంగా అన్నా ఎనకటి రోజులే చాలా బాగుండేవి. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కాని ఉన్న ఊరు కన్నతల్లి వీడి పోని బంధం అన్నా...

  • @ramukg6664
    @ramukg6664 2 роки тому +23

    జానపదం ఇష్టమున్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @lakshmijaya5716
    @lakshmijaya5716 5 років тому +97

    Excellent song thanks to lyrics writer and singer very meaningful song its so nice brother

    • @venkataramanachevvakula6648
      @venkataramanachevvakula6648 5 років тому

      Lakshmi Jaya మన తెలుగు భాషలో వ్రాయండి లక్ష్మి గారు

    • @lakshmijaya5716
      @lakshmijaya5716 5 років тому

      In telugu i dont know how to type sorry

    • @santhu1144
      @santhu1144 5 років тому

      Super bayya

    • @maaniravi9501
      @maaniravi9501 5 років тому

      సూపర్ అన్న మీ వాయిస్ సూపర్ సాంగ్ చాలా బాగుంది..

  • @l.venkateshmudhiraj238
    @l.venkateshmudhiraj238 5 років тому +30

    మన ఊరి గురించి అద్భుతంగా చెప్పి కన్నీళ్లు పెట్టించారు అన్నా నీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @sravankumarthunga1256
    @sravankumarthunga1256 5 років тому +36

    మీ పాటలోని పదాలు వింటే మనసు పులకరిస్తుంది..... పాట రచయిత గారికి మరియు గాయకులు గారికి అభినందనలు....కృతజ్ఞతలు

  • @mahammadhaneef4286
    @mahammadhaneef4286 5 років тому +13

    ￰మానవత్వపు విలువలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో గ్రామీణ సమాజం ను ఉద్దేశించి పాడిన ఈ పాట చాలామందిని ఆకర్షించింది అంటే అందరిలో మానవత్వపు విలువలు ఉంటాయి కానీ వాటిని గుర్తు చేయక గుర్తు చేసేవారు కరువైన ఇలాంటి సమయంలో ఇలాంట పాట రావటం చాల సంతోషం ఇలాంటి పాటలు ఇంకా రావాలని కోరుతూ ..హనీఫ్

  • @DhakshiStudio2019
    @DhakshiStudio2019 5 років тому +48

    పల్లే గురించి గొప్పగా చెప్పిన రచయిత కి పాట అద్భుతంగా పాడినందుకు మీకు శతకోటి వందనాలు

  • @telanganayevusam3178
    @telanganayevusam3178 5 років тому +171

    ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా..
    ఎనకట మన ఊరు ఎట్టుండేరా..
    అన్నదమ్ములోలె ఉన్నామురా..
    ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా.... | 2 |
    ఈ కులము ఆ కులము తేడాలు లేకుండ
    వరసవెట్టి పిలుసుకున్నామురా ......
    ఒక చెట్టునీడన వందమందిన్నట్టు
    ఊరంత ఒక్కటై ఉన్నాము రా....
    ఆ చెట్టుకొమ్మలు విరిగి నిలువనీడ లేక
    ఊరు ఆగం అవుతుంటే ఊరుకుంటావేందిరా.......
    ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా
    ఎనకట మన ఊరు ఎట్టుండేరా..
    అన్నదమ్ములోలె ఉన్నామురా..
    ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా....
    వీరబ్రహ్మంగారి జాతరోచ్చిందంటే
    ఊరు చాలనంత మందిరా ....
    అపుడు ఎంత సందడుండేదిరా.... ఎంత సందడుండేదిరా....
    ఆ సందడేమోగాని ఏటా జాతర జేసేవాడే లేడురా ......
    ఆ దేవుడికే దిక్కు లేదురా ..... ఆ దేవుడికే దిక్కు లేదురా .....
    బడికాడ బాగోతమాడుతున్నారంటే
    సపలెత్తుకుని వెళ్ళామురా....
    కలిసి కాలక్షేపం జేశామురా....
    పక్క ఇంట్లో నేడు ఫంక్షన్ అవుతుందంటే
    మనకు వాళ్లకు మాటలేలేవని
    తలుపు మూస్తున్నరు పొద్దువూకంతనా....
    ఆ వైభోగం ఏమాయెరా.....
    ఉరికి వైరాగ్య మెట్టొచ్చెరా....
    ఆ ఆనందమెటువాయెరా....
    మన ఉరికి ఏ దిష్టి తగిలిందిరా....
    ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా
    ఎనకట మన ఊరు ఎట్టుండేరా..
    అన్నదమ్ములోలె ఉన్నామురా..
    ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా....
    దసర పండుగనాడు జమ్మికెళ్తువుంటే
    కళ్ల సంబురామేనురా ....
    అపుడు ఉరు మొత్తం ఒక్కచోటరా .... అపుడు ఉరు మొత్తం ఒక్కచోటరా ....
    నేడు పార్టీలు పగలంటూ
    మనవాళ్ళు మందంటూ వీది వీదికో జట్టురా.....
    ప్రతి ఇంటికొక జమ్మి చెట్టు రా ..... ప్రతి ఇంటికొక జమ్మి చెట్టు రా .....
    మతమంటు కులమంటు మంటలే రాజేసి
    ఊరునాగంజేసే రాజకీయం
    ఇపుడు వంశాల గోత్రాల కొత్త కయ్యం
    ఎవడి స్వార్థం కొరకు వాడు విడగొడుతుంటే
    ఎడ్డిగా మనమంత చూస్తూ ఉన్నం
    అదే అభివృద్ధి ఆపే కొరివిదయ్యం
    ఆ బంధాలు ఏమాయెరా...
    మన ఊరి అందాలు ఎటువాయెరా....
    యాడేసిన ఆ గొంగడాడుందిరా....
    ఇన్నాళ్లు ఎంబావుకున్నామురా ....
    ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా
    ఎనకట మన ఊరు ఎట్టుండేరా..
    అన్నదమ్ములోలె ఉన్నామురా..
    ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా....
    సదువుకున్నోలంత జ్ఞానమున్నొలంత
    బతుకుదారి మెతుకులాడుతు
    ఊరు విడిచి దూరంగా ఉన్నరు.... ఊరు విడిచి దూరంగా ఉన్నరు....
    ఊరు మీద ప్రేమ ఎక్కువున్నోల్లంత
    ఇక్కడే మిగిలి ఉన్నరు ....
    వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నరు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నరు
    మద్యలో ఉండేటి పెద్దమనుషులేమో
    అర్ధం కాకుండ ఉన్నరు
    పార్టీల చేతుల్లో బొమ్మలవుతున్నరు
    అందుకే ఉళ్ళోన పుట్టిన ప్రతివాడు
    గ్రామాభివృద్దే ద్యేయమయ్యి
    తీర్చుకోవాలి తన ఋణమును...
    అమ్మ తరువాత అమ్మేనురా....
    ఊరంటే నీ తొలి చిరునామరా ....
    నువ్వు ఎంతెత్తుకు ఎదిగినా....
    నీ మూలం ఈడే ఉన్నాదిరా ....
    ఊరు కన్నీరుగా మారితే
    ఆ ఉసురు యాడున్న తగిలేనురా....
    మన ఊరు బాగే తోలి భాద్యతా ....
    నీ వంతు చేయూతనందించరా .........
    కత్తిరిచినాయన సురేష్ సూర్య అట,
    ఈ పాటకు సంగీతం, రాసినాయిన & పాడినాయిన చరణ్ అర్జున్..
    వేయి దండాలు Bvm Creations కి ఈ Video ని జనాలకు సూపిస్తున్నందుకు.
    www.telanganapaata.com/2019/01/mana-uri-paata.html

  • @rajugoudpalcham4583
    @rajugoudpalcham4583 5 років тому +183

    ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా..
    ఎనకట మన ఊరు ఎట్టుండేరా..
    అన్నదమ్ములోలె ఉన్నామురా..
    ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా.... | 2 |
    ఈ కులము ఆ కులము తేడాలు లేకుండ
    వరసవెట్టి పిలుసుకున్నామురా ......
    ఒక చెట్టునీడన వందమందిన్నట్టు
    ఊరంత ఒక్కటై ఉన్నాము రా....
    ఆ చెట్టుకొమ్మలు విరిగి నిలువనీడ లేక
    ఊరు ఆగం అవుతుంటే ఊరుకుంటావేందిరా.......
    ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా
    ఎనకట మన ఊరు ఎట్టుండేరా..
    అన్నదమ్ములోలె ఉన్నామురా..
    ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా....
    వీరబ్రహ్మంగారి జాతరోచ్చిందంటే
    ఊరు చాలనంత మందిరా ....
    అపుడు ఎంత సందడుండేదిరా.... ఎంత సందడుండేదిరా....
    ఆ సందడేమోగాని ఏటా జాతర జేసేవాడే లేడురా ......
    ఆ దేవుడికే దిక్కు లేదురా ..... ఆ దేవుడికే దిక్కు లేదురా .....
    బడికాడ బాగోతమాడుతున్నారంటే
    సపలెత్తుకుని వెళ్ళామురా....
    కలిసి కాలక్షేపం జేశామురా....
    పక్క ఇంట్లో నేడు ఫంక్షన్ అవుతుందంటే
    మనకు వాళ్లకు మాటలేలేవని
    తలుపు మూస్తున్నరు పొద్దువూకంతనా....
    ఆ వైభోగం ఏమాయెరా.....
    ఉరికి వైరాగ్య మెట్టొచ్చెరా....
    ఆ ఆనందమెటువాయెరా....
    మన ఉరికి ఏ దిష్టి తగిలిందిరా....
    ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా
    ఎనకట మన ఊరు ఎట్టుండేరా..
    అన్నదమ్ములోలె ఉన్నామురా..
    ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా....
    దసర పండుగనాడు జమ్మికెళ్తువుంటే
    కళ్ల సంబురామేనురా ....
    అపుడు ఉరు మొత్తం ఒక్కచోటరా .... అపుడు ఉరు మొత్తం ఒక్కచోటరా ....
    నేడు పార్టీలు పగలంటూ
    మనవాళ్ళు మందంటూ వీది వీదికో జట్టురా.....
    ప్రతి ఇంటికొక జమ్మి చెట్టు రా ..... ప్రతి ఇంటికొక జమ్మి చెట్టు రా .....
    మతమంటు కులమంటు మంటలే రాజేసి
    ఊరునాగంజేసే రాజకీయం
    ఇపుడు వంశాల గోత్రాల కొత్త కయ్యం
    ఎవడి స్వార్థం కొరకు వాడు విడగొడుతుంటే
    ఎడ్డిగా మనమంత చూస్తూ ఉన్నం
    అదే అభివృద్ధి ఆపే కొరివిదయ్యం
    ఆ బంధాలు ఏమాయెరా...
    మన ఊరి అందాలు ఎటువాయెరా....
    యాడేసిన ఆ గొంగడాడుందిరా....
    ఇన్నాళ్లు ఎంబావుకున్నామురా ....
    ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా
    ఎనకట మన ఊరు ఎట్టుండేరా..
    అన్నదమ్ములోలె ఉన్నామురా..
    ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా....
    సదువుకున్నోలంత జ్ఞానమున్నొలంత
    బతుకుదారి మెతుకులాడుతు
    ఊరు విడిచి దూరంగా ఉన్నరు.... ఊరు విడిచి దూరంగా ఉన్నరు....
    ఊరు మీద ప్రేమ ఎక్కువున్నోల్లంత
    ఇక్కడే మిగిలి ఉన్నరు ....
    వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నరు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నరు
    మద్యలో ఉండేటి పెద్దమనుషులేమో
    అర్ధం కాకుండ ఉన్నరు
    పార్టీల చేతుల్లో బొమ్మలవుతున్నరు
    అందుకే ఉళ్ళోన పుట్టిన ప్రతివాడు
    గ్రామాభివృద్దే ద్యేయమయ్యి
    తీర్చుకోవాలి తన ఋణమును...
    అమ్మ తరువాత అమ్మేనురా....
    ఊరంటే నీ తొలి చిరునామరా ....
    నువ్వు ఎంతెత్తుకు ఎదిగినా....
    నీ మూలం ఈడే ఉన్నాదిరా ....
    ఊరు కన్నీరుగా మారితే
    ఆ ఉసురు యాడున్న తగిలేనురా....
    మన ఊరు బాగే తోలి భాద్యతా ....
    నీ వంతు చేయూతనందించరా ......

  • @lovelynature8138
    @lovelynature8138 5 років тому +16

    మన ఊర్ల గురించి చాలా చక్కటి పాట ..
    ఈ పాట వింటున్నంతసేపు , ప్రతి ఒక్కరికి మనసులో ఎదోమూల తెలియని బాధ తప్పక ఉంటుంది.
    💐 💐 👌 👌 👍

  • @sreenivasaraogaddam8214
    @sreenivasaraogaddam8214 5 років тому +49

    ఈ పాట విని నా హృదయం చలించింది

  • @mahroofmd924
    @mahroofmd924 5 років тому +53

    Excellent brother
    పాత రోజులు గుర్తుకు తెచ్చావ్
    ధన్యవాదాలు

  • @sschary7842
    @sschary7842 5 років тому +65

    పల్లె వాసన ను వినిపించారు, చిన్ననాటి గ్రామ జ్ఞాపకాలను పాటరూపంలో అద్భుతంగా వివరించారు.
    పల్లె పట్నం వైపు చూసింది ఇన్నాళ్లు, ఇక యువత రాజకీయ చైతన్యంతో పట్నమే పల్లె వైపు తిరిగి చుఇస్తారు.
    గ్రామ సీమలే దేశానికి పట్టుగొమ్మలు
    జై హింద్

  • @shirishiva728
    @shirishiva728 4 роки тому +23

    ఎన్ని సార్లు విన వినాలని పించే పాట
    అన్న నీకు 🙏🙏🙏🙏

  • @anusrimusicanushakanuganti
    @anusrimusicanushakanuganti 3 роки тому +9

    ప్రతి ఒక్కరు తన ఊరి బాగోగులు చూస్తే...దేశం బాగువుతుంది..ప్రజలే రాజులు..మన సేవకులైన పాలకులతో సరైన పని చేయించుకోవాలి..మన పన్నుల పైసలను మన ఊరికి వినియోగించాలి.మనమంతా కలిసి అన్నదమ్ములోలే ఉంటేనే సాధ్యం అయితది..

  • @gaddamnagendrareddy451
    @gaddamnagendrareddy451 5 років тому +30

    ఏమి రాశావు అన్నా సూపర్ ,,,,,,

  • @babumasapaka1886
    @babumasapaka1886 5 років тому +26

    ఊరు గొప్పతనాన్ని చాటి చెప్పి న పాట చాలా బాగుంది అన్నా

  • @kramusankarolla5951
    @kramusankarolla5951 3 роки тому +9

    అన్నా నీ పాటను కోటి సార్లు విన్న తకువే ..న చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చావు..ధన్యవాదములు

  • @devanani
    @devanani 10 місяців тому +3

    ఈ పాట వింటుంటే చిన్నప్పటి నా బాల్యం గుర్తొస్తుంది ఆ రోజులే బాగుండేవి మనసుకు హత్తుకునే పాట
    2023
    విన్నవారు ఒక లైక్ వేసుకోండి

  • @madhujeripothula7035
    @madhujeripothula7035 5 років тому +47

    Excelent 👌👌👌👌👌👍👍👍👍👍👍💐💐💐💐anna garu
    😢😢😢😢
    Malli oka sari chinnappati gurthulu vuru vishayalu chala baga gurthu chesaru

  • @VBachi936
    @VBachi936 5 років тому +31

    I am from seetharampuram village janagam district. amazing song I love this very much.....txs entire team.

  • @chitraranjanreddy8746
    @chitraranjanreddy8746 5 років тому +45

    ANNA nenu me song dwara inspiration ayya. Nenu bengalore lo chaduvutunna. Nenu decide ayyanu ma uri kosam oka library peydatamu

    • @hareshyadav5542
      @hareshyadav5542 5 років тому

      👌👌👌👍👍👍

    • @jorumedia
      @jorumedia 5 років тому

      Gud think

    • @SrinumyakaSrinumyaka
      @SrinumyakaSrinumyaka 5 років тому +1

      Bro my bro bengllor university lo chadhuvuthandu

    • @villageboyshiva3546
      @villageboyshiva3546 5 років тому +1

      Good thought

    • @chitraranjanreddy8746
      @chitraranjanreddy8746 5 років тому +3

      Cheythulu dulupukola bro prathi varam uriki vastu librarini maintain cheyataniki oka person ni appoint cheystunnamu atanu responsible ga untadu

  • @sushanthsanjyapaga4161
    @sushanthsanjyapaga4161 5 років тому +9

    చాలా రోజుల తర్వాత ఒక మంచి సాంగ్ విన్నాను. మా ఊర్లో నా బాల్యం గుర్తొచ్చింది. Superb song అన్నా...

  • @saiharsha2197
    @saiharsha2197 2 роки тому +3

    అన్న ప్లీస్ ఒక్కసారి మిమ్మల్ని కలిసే ఛాన్స్ ఇవ్వండి అన్న....

  • @rajuaku5136
    @rajuaku5136 5 років тому +11

    పాత జ్ఞాపకాలు నెమరు వేస్తూ, ప్రస్తుత పరిస్థితులను వెలికితిస్తూ అందమైన అక్షరాలతో పాటకు జీవం పోసి,అందరూ ఆలోచించేలా చేసిన మీకు,మీ పాటకు ధన్యవాదాలు.అన్నా గారు.

  • @vinaykumar-lo8fy
    @vinaykumar-lo8fy 5 років тому +22

    Diniki kuda dislikes unaya?? Waste vallu inka mari.

  • @ramavathkumar2834
    @ramavathkumar2834 5 років тому +25

    How many membrs like & love this song

  • @saiuyyala7395
    @saiuyyala7395 2 роки тому +6

    చిన్నప్పుడు చల్లని నీరు కోసం ఎండలో చలివెంద్రానికి వెళ్ళిన ఆరోజు లే బాగునవి
    వేసవి సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఆ రోజులే బాగున్నాయి
    చెప్పు కుంటు పోతే చాలా వున్నవి ఈ బిజీ లైఫ్ లో చిన్న చిన్న ఆనందాలు కూడా మిస్ అవ్తున్నం .....😥😥😥😥😥

  • @vasundhara7494
    @vasundhara7494 5 років тому +15

    చాలా బాగుంది..
    పల్లెలో విషయాన్ని కళ్ళకు కట్టినట్టు పాడారు..

  • @RaviRavi-qr5ke
    @RaviRavi-qr5ke 5 років тому +26

    నైస్ సాంగ్ బ్రో ఇలాంటి పల్లె పాటలు ఇంకా పాడాలి

  • @rameshadulapuram1755
    @rameshadulapuram1755 5 років тому +20

    సూపర్ అన్న సాంగ్ యెనుకటికి ఇప్పటికి ఎంత మరమో 💯 కరెక్ట్ గా చెప్పరు

  • @vuyyalasaidulu1430
    @vuyyalasaidulu1430 5 років тому +9

    BvM creations వారికి ప్రత్యేక అభినందనలు.... మీ లాంటి చానల్స్ వల్ల గ్రామ సంస్క్రుతులకు ప్రాణం పోసినట్లవుతుంది. మా చిన్న నాటి తీపి మధురానుభూతిని పంచే జ్ఞాపకాలను ఒక్కసారిగా గుర్తుకొచ్చే విధంగా మీ పాట అత్యంత అద్భుతంగా ఉంది.

  • @sridharchiluka
    @sridharchiluka 4 роки тому +12

    నిజంగా చాల అధ్భుతమైన పాట. రాసిన వారికి పాదాభివందనాలు

  • @kurvaramesh6855
    @kurvaramesh6855 5 років тому +14

    Anna e songs kosam chala search chesinaaaa ippudu dorikindi ఎంత మంచి పాట అన్నా..............I lv u
    ....ఇంత మంచి పాటకు dislike ఏంటన్నా......😥

    • @naveenreddy9438
      @naveenreddy9438 5 років тому

      KURVA RAMESH చెత్త నా కొడుకులు dislikeకొట్టారు

  • @uncutlifewithlucky5709
    @uncutlifewithlucky5709 5 років тому +6

    Bayya I am a India army soldier.....ma vurunu gurthuchesav Annaa Tq very much...song really superrrb

  • @aravindgoud.k8137
    @aravindgoud.k8137 4 роки тому +13

    I am studying mbbs in europe, but eurpoe never makes me as happy as my village makes, whenever i miss my village, i get back to this song, this is so soothing.

    • @yerriswamybellary9890
      @yerriswamybellary9890 Рік тому +1

      Rightly expressed your feelings, first achieve your goal and come back to India, serve the people, enjoy the life in mother land

  • @sudhirbnpunith9384
    @sudhirbnpunith9384 5 років тому +12

    *చరణ్ అర్జున్* రచన, సంగీతం, గానం 👏👏👏👏👌

    • @JRadhaKrishna-i7n
      @JRadhaKrishna-i7n 9 місяців тому

      Anna nevus super 100 yers Bagudali om namashiva

  • @srinivaasbodduupally740
    @srinivaasbodduupally740 3 роки тому +9

    ఈ పాట వింటుంటే మనసే ఉన్నట్టుండి నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు ధన్యవాదాల పాడిన అన్నగారి

  • @ramuluyalala9907
    @ramuluyalala9907 5 років тому +5

    I like this song soo much.I don't hear like this kind of village song till this time.lyrics, music& singer all are super.I don't forget this song never.

  • @zivorrmeir674
    @zivorrmeir674 5 років тому +20

    Hats-off bro......such wonderful job. Yes once again u remind the past and present situations in the village.....I wish those golden days should come back

  • @rayavelliramakrishna6853
    @rayavelliramakrishna6853 5 років тому +7

    అన్న పాట సూపర్ అన్న పాట వింటున్నంత సేపు ఊరి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి👃👃👃🌺🌺🌺

  • @bodapatlalingam6617
    @bodapatlalingam6617 3 роки тому +4

    పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి
    సూపర్ పాట .చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి

  • @bhargav210
    @bhargav210 5 років тому +13

    Very nice invitation for those who ignored and wish, to return to see their villages and make moral contributions towards progress in positive direction as a gift for their next generations....
    Nice lyrics and good composition.

  • @srinivasarajuayenampudi1830
    @srinivasarajuayenampudi1830 5 років тому +7

    మనసారా జోహార్లు, ఇంత గొప్పభాషను తనివితీరా ఆస్వాదించడం మనందరికీ కలిగించిన సమూహంనకు ధన్యవాదాలు.