రామోజీ ఆశయాలకు ప్రతిరూపం అమరావతి | Amaravati Replica For Ramoji Rao Ambitions | CM Chandrababu

Поділитися
Вставка
  • Опубліковано 26 чер 2024
  • రామోజీ ఆశయాలకు ప్రతిరూపం అమరావతి - చంద్రబాబు
    ఎంతో చేసిన రామోజీరావుకు సమాజం ఏం చేయగలదని అంతా మాట్లాడారు. సంస్మరణ ఆయనకు నివాళి. అసాధారణ శక్తి, వ్యక్తి, వ్యవస్థ రామోజీ రావు. సమాజంలో ఒకే రామోజీ రావు ఉంటారు ఆయనలా మరొకరు ఉండబోరు. ఒకే ఒక్క ఎన్టీఆర్, ఒకే ఒక్క రామోజీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి ఆయన. పత్రికారంగ, మీడియా, సినీ రంగం ఇలా ఏ రంగం అయినా ఆయన అగ్రస్థానంలో ఉన్నారు. భారత ప్రభుత్వం అత్యున్నత బిరుదు పద్మ విభూషణ్ ప్రదానం చేసింది. 62 ఏళ్ల క్రితం పెట్టిన మార్గదర్శి ఇప్పటికీ అందరికీ మార్గదర్శిగానే ఉంది. ఆ సంస్థ విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు కానీ చందాదారులు అంతా ఆయన వెంటే ఉన్నారు. అన్నదాత పత్రిక రైతుల కోసం, 1974 లో ఈనాడు పత్రిక స్థాపించారు. ప్రజాగళంగా ఈనాడు నిత్యం పని చేస్తోంది. రాజకీయాల్లో ప్రతిపక్షాలు గా ఉండి అంతా పోరాటం చేస్తారు. ఈనాడు, ఈటీవి మాత్రం నిత్యం ప్రజా పోరాటాల చేస్తూనే ఉంది. 40 ఏళ్లు గా అగ్రస్థానంలో ఆ పత్రిక కొనసాగుతూనే ఉంది. ప్రియా పచ్చళ్ళు దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
    ఎలక్ట్రానిక్ మీడియాలో ఒకే దఫా ఏడు ఛానెళ్ళు పెట్టారు. రామోజీ ఫిలిం సిటీ దేశానికే తలమానికం. దేశంలో ఎక్కడ ఏ ఆపద వచ్చినా ముందు ఉండే వ్యక్తి ఆయన. కొవిడ్ సమయంలోనూ 20 కోట్లతో ప్రజా సేవలు చేశారు. 40 ఏళ్లుగా నాకు ఆయనతో పరిచయం.
    ఈనాడు, ఈటీవి విశ్వసనీయతకు మారుపేరు. రేటింగ్ కోసం పోరాటాలు చేసుకునే పరిస్థితి. ముఖ్యమంత్రులు తెలిసినా ఫలానా అధికారిని బదిలీ చేయాలనో వేయాలనో ఎప్పుడూ చెప్పకపోవడం ఆయన నిజాయితీ. ఎన్టీఆర్ అధికారంలోకి రావడంలోనూ రామోజీ రావు కృషి ఉంది. ఆగస్టు సంక్షోభంలోనూ ఎంతో ఉన్నతంగా వ్యవహరించారు. శాసనసభలో ఓమారు ఉల్లంఘన నోటీసు ఇస్తే సుప్రీం కోర్టు వరకూ వెళ్ళారు. మార్గదర్శి ఒడిదుడుకులు ఉన్నపూడూ ఆయన ప్రజలకు భరోసా ఇచ్చి వారి వెంట నిలిచారు. హైద్రాబాద్ లోనూ ఆయన స్ఫూర్తి ఉంది. అమరావతికి పేరు విషయంలో అధ్యయనం చేసి సూచించారు.
    ప్రపంచ వ్యాప్తంగా దానికి ఖ్యాతి వచ్చింది. ఐదేళ్ళ పాటు ఇబ్బంది పడినా తెలుగు జాతి ఉజ్వల భవిష్యత్‍గా నిలుస్తుంది. ఆయన ఎవరిని పిలవడు, కానీ వస్తే గౌరవించేవారు. ఆయన పత్రికలో ఎవరికీ అన్యాయం జరగదు. ఏ పార్టీకి అయినా తగిన ప్రాధాన్యం ఇచ్చి వార్తలు ప్రచురిస్తారు. విలువల కోసం పని చేసిన వ్యక్తి రామోజీ. పనిచేస్తూ మరణించాలన్నది ఆయన ఆకాంక్ష. అలాగే జరిగింది కూడా. తెలుగు జాతి, భాష అంటే రామోజీరావుకు ఎనలేని ఆప్యాయత. తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు కలకాలం గుర్తు ఉండేలా చూడాలి. రామోజీ స్థాపించిన వ్యవస్థలు ఆయన కుటుంబ సభ్యులందరిదే కాదు 10 కోట్ల మంది తెలుగు ప్రజలది కూడా. రామోజీకి భారత రత్న కోసం కృషి చేయాలి. ఆయన పేరిట అమరావతి రామోజీ విజ్ఞాన్ కేంద్రం నిర్మిస్తాం. ఒక రోడ్డుకు రామోజీ మార్గ్ పేరు పెడతాం. విశాఖలో రామోజీ చిత్ర నగరి అనీ స్థాపిస్తాం. ఆయన స్ఫూర్తిని భావి తరాలకు అందించడమే మా లక్ష్యం. ఎన్టీ ఆర్ మెమోరియల్ నిర్మించాం. అలాగే రామోజీరావుకు గుర్తింపు ఇచ్చేలా వారత్వం కొనసాగేలా కార్యాచరణ చేపడతాం సూచనలు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం.
    #ramojirao
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 6

  • @harikrishna851
    @harikrishna851 2 дні тому +2

    Telugu people miss him and his wisdom on Telugu society....

  • @VenkateswarraoGottipati
    @VenkateswarraoGottipati 2 дні тому

    💐💐💐💐💐

  • @maheshmahimahesh8990
    @maheshmahimahesh8990 2 дні тому

    Johar ramoji sir

  • @talasilabalakrishna2451
    @talasilabalakrishna2451 2 дні тому

    Jai CBN

  • @nagarajub1202
    @nagarajub1202 2 дні тому +1

    Abboo😄😄

  • @HR_TV9
    @HR_TV9 2 дні тому

    రామోజీరావు ఏం ఈనాడు పేపర్ ఫ్రీ గా ఇచ్చారా ఈనాడులో ప్రకటన ఫ్రీగా వేసారా ఎందుకు ఇవ్వాలి అంటే ఏమి
    ప్రియా పచ్చళ్ళు ఫ్రీగా ఇచ్చారా రామోజీ ఫిలిం సిటీ లోకి ఏమైనా ఫ్రీగా.. ఎంట్రీ ఉందా... మార్గదర్శి చిట్స్ లో ఒక నెల బోనస్ ఇచ్చారా.....ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల సొమ్ముతో వ్యాపారం చేసి బాగా సంపాదించుకున్నాడు గాని ప్రజలకు ఏమి ఫ్రీగా ఇవ్వలేదు ఎందుకు ఈయనకి విగ్రహాలు రోడ్డు మార్గాలు పేర్లు...ఏదైనా మన కలం మన కులం అయితే సరిపోతుంది... రాష్ట్ర ప్రజలారా తెలుగుదేశం కి సహాయపడ్డారు ఏమోగానీ తెలుగు ప్రజలకి ఏమి చేయలేదు ఉచితంగా ఏమి చేయలేదు తెలుగు ప్రజలే బుద్ధి చెప్పాలి మునుముందు రోజుల్లో....
    తెలుగు ప్రజల కోసం పాటుపడే ప్రతి వ్యాపారికి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం సంతాప సభలు అర్పిస్తూ బాగుంటుంది