ఘుమ ఘుమలాడే చేపల పులుసు...ఒక్కసారి తింటే...మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది🦈🐟🐠 | Fish curry In Telugu

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • భారత్ లోని తీర ప్రాంతాల్లో నివసించే చాలామంది ప్రజల భోజనంలో చేపలు ప్రధాన ఆహారంగా ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు మన శరీర జీవక్రియలు సక్రమంగా జరిగేలా ప్రోత్సహిస్తాయి. చేపలను ఆవిరిలో ఉడికించి తీసుకోవచ్చు. గ్రిల్ చేసుకోవచ్చు. లేదా ఉడకబెట్టి తినొచ్చు. ఎలా తిన్నా వీటిల్లో ఉండే పోషకాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందుతాయి.
    మన దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలూ చేపలను ఇష్టంగా తింటారు. అన్నంతో కలిపి లేదా రోటీలతోనూ చేపలు మంచి రుచిని అందిస్తాయి. రుచితో పాటు చేపల్లో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వీటిని ఆహారంలో తీసుకుంటే కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
    చికెన్, మటన్ వంటి మాంసాహారంతో పోలిస్తే చేపల్లో ఉండే కొవ్వులు మంచి గుణాలను కలిగి ఉంటాయి. సాల్మన్, ట్రౌట్, సార్డినెస్, ట్యూనా, మాకేరెల్ వంటి చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే.. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు శరీరానికి అందుతాయి. ఈ ఫ్యాటీ యాసిడ్లు మెదడు, కళ్ల పనితీరును మెరుగుపరుస్తాయి. గర్భిణులు తరచూ చేపలను ఆహారంలో చేర్చుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
    చేపలలో శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉండవు. అందువల్ల ఇవి మీ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. చికెన్, మటన్లలో గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొలెస్ట్రాల్ ఉంటుంది. అందుకే మాంసాహారం ద్వారా అందే ప్రోటీన్లను కాకుండా, చేపల ద్వారా అందే ప్రోటీన్లను తీసుకోవడం మంచిది. మీ డైట్లో చేపలను చేర్చుకుంటే హృదయ సంబంధ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.
    చేపల నుంచి విటమిన్- డి శరీరానికి తగినంత అందుతుంది. వివిధ రకాల పోషకాలను మానవ శరీరం గ్రహించాలంటే విటమిన్ డి క్రమం తప్పకుండా శరీరానికి అందాలి. చేపలను తరచూ తినడం ద్వారా డి విటమిన్తో పాటు ఇతర పోషకాలు కూడా మనకు అందుతాయి.
    చేప సహజమైన యాంటీ-డిప్రెసెంట్. డిప్రెషన్, మూడ్ స్వింగ్స్తో పోరాడటానికి ఇది సహాయపడుతుంది. చేపల ద్వారా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి వంటివి ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తాయి. మానసిక ఆరోగ్య సమస్యలను అరికట్టడానికి చేపలు సహాయపడతాయి. కాబట్టి చేపలు తినడం వల్ల సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు.
    చేపలను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు దరిచేరవు. చేపల ద్వారా లభించే పోషకాలు శరీర ఆరోగ్య సమతుల్యతను కాపాడతాయి. అన్ని రకాల వ్యాధులతో పోరాడటానికి ఇవి సహాయపడుతాయి. వీటితో పాటు చేపలు తినడం వల్ల జీవక్రియ, నిద్ర నాణ్యత, చర్మ ఆరోగ్యం, ఏకాగ్రత వంటివి పెరుగుతాయి.
    #viral #food #fish #fishcurry #cooking
    #viral #video #viralvideo #trending #viralshorts #ytshorts #ytshort #trendingshorts #shorts #short #youtubeshorts #youtube #trend #youtubeshort #youtubevideo #viralshort #viralreels #viral_video #masterchef #food #desserts #cooking #dessert #tiffin #breakfast #snacks #snack #tips #tipsandtricks #youtubeshorts #youtube #youtuber #youtubeshort #youtubevideo #youtubechannel #youtubetips #youtubetipsandtricks youtube tips and tricks #youtubetipsforbeginners, youtube tips for beginners, tips youtube, useful youtube tips

КОМЕНТАРІ •