బ్రహ్మసాగర్ మునక పల్లెలు ఇప్పుడెలా ఉన్నాయో తెలుసా..! జంగంరాజుపల్లె విశేషాలు | @intothenature246

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • బ్రహ్మసాగర్ మునక గ్రామం - జంగంరాజుపల్లె
    ఎలమోరి కొండను నల్లమలకు కలుపుతూ బ్రహ్మంగారి మఠం దక్షిణ దిక్కున తూర్పు పడమరలుగా ఆనకట్ట ఒకటి కట్టారు. అదే బ్రహ్మసాగర్.
    నల్లమలనుంచి లంకమలకు బయల్దేరిన పులి కొత్త దోవ వెతుక్కుంది. తరాలుగా మట్టితో పెనవేసుకున్న అనుబంధాన్ని తెంచుకుని కొత్త తావులకు మూటె ముల్లె సర్దుకున్నారు బసవాపురం, ఓబులరాజు పల్లె, జంగంరాజు పల్లె, కొత్తపల్లె, చీకటివారి పల్లె, మరో రెండు. మొత్తంగా ఏడు పల్లెల జనాలు. జనాలతో పాటే గొడ్డూ గోదా మేక గొర్రె.
    క్రిష్ణా నది నుంచి బయల్దేరిన తెలుగుగంగ బ్రహ్మసాగర్ నేలకు నీళ్ల దుప్పటి కప్పుతోంది. అన్నాళ్ల స్వేచ్ఛా వాయువులు లాగేసినట్టు ఎరుపెక్కాయి నీళ్లు.
    2016 లో డ్యాం డెడ్ స్టోరేజికి వెళ్లింది గానీ అప్పటికి ప్రయాణాల ధ్యాస, మన చుట్టూ ఉండే సమాజాన్ని చూసే కోణం పరిచయమవ్వలేదు. కరోనా నుంచి ప్రతి సంవత్సరం కెపాసిటీ పెరుగుతూపోయింది. 2022 లో కట్టకు లీకేజీ పనులు పూర్తి చేసి 17 టీఎంసీల ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ చేర్చారు.
    2023 లో తక్కువ వర్షపాతం వల్ల తెలుగుగంగకు నీళ్లు రాలేదు. ఈసారైనా బయటపడకపోదా, నేను చూడకపోతానా అంటూ గత నవంబర్ రాణిబాయి, రేకలకుంట, బాలాజీ నగర్ మీదుగా డ్యాం బ్యాక్ సైడ్నుంచి వెళ్లాం. అప్పటికి నీళ్లు పూర్తిగా తగ్గలేదు. చేపల వాళ్ల తెప్పల్లో పోదామంటే వాళ్లు కూడా లేరు. ఇలా కాదని గుడ్డివీరయ్య సత్రం, గంగాయపల్లె మీదుగా బయల్దేరాం. గంగాయపల్లె చెరువులో చేపలు పట్టే శీను సాయంతో జీవీసత్రం - బ్రహ్మంగారి మఠం పాత దారి వెంట అడవిలో వెళ్లేసరిగి పొద్దుగుంకింది. వెన్నెలునింది గానీ గుట్టకు పడమటి వైపు కూడా నీళ్లుండడంతో వెళ్లడం కుదర్లేదు.
    దానికి నిన్న మోక్షం దొరికింది.
    సింగిల్ రోడ్డుకు అటుఇటు మిరప పంట, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న, దానిమ్మ తోటలు, ఇలా ఎప్పుడూ ఏదోక పైరు ఉండనే ఉంటుంది. వర్షాకాలంలో చామంతి, చెండుమల్లె పూల తోటలు చిణుకు తడిలో మురిసిపోతుంటాయి. ఆకుపచ్చని చెట్లకు తెలుపు, పసుపు, నారింజ రంగుల్లోని ఆ తోటలు కదలనియ్యవు. దానిమ్మ తోటల సందుల్లో డ్యాంలోకి చేరుకున్నాం. నీళ్లు అడుగంటుతున్నాయి. డ్యాం బోసిపోయినట్టు కనిపిస్తోంది. గెడ్డి కూడా మొలవనంతగా గులకరాళ్లు తేలివుంది నీళ్ల అడుగు. ప్రాణం కోల్పోయిన తుమ్మ చెట్లు జింక కొమ్ముల్లా ఉన్నాయి. నీళ్లున్నప్పుడు పక్షి గూళ్లు పెట్టుకున్నట్టున్నాయి. అంతకంటే సురక్షితమైన ప్రదేశం మరొకటి ఉంటుందా..!
    బ్రహ్మసాగర్ దక్షిణపు అంచు మీదుగా పడమటి వైపు కదిలాయి బండ్లు. వెళ్తున్న దారిలో ఏదో గుడి దూరంగా కనపడితే అటువైపు పోనిచ్చాం. గుడిలో మూల విరాట్ లేడు గానీ అదొక రామాలయం. మేకలు కాసుకుంటున్న వ్యక్తిని అడిగితే అదే కొత్తపల్లె అన్నాడు. బ్రహ్మసాగర్ డ్యాంలో తెలుగుగంగ కాలువ కలిసే చోటు దాటుకుని నారాయణస్వామి మఠం గుట్టవైపు కదిలాము. నారాయణ స్వామి మఠం గుట్టకు దక్షిణంగా జంగంరాజు పల్లె ఉంది. శిధిలావస్థలో ఉన్న ఆ ఊరిని చూడగానే మొహంజదారో లాగా అనిపించింది.
    ఉత్తర దక్షిణంగా పెద్ద వీధి, తూర్పు పడమరలుగా చిన్న వీధులున్నాయి. గాడి పాటలు, గరిసెలు, కల్రోళ్లు, చేదురు బావి, గడపమాను బండలు అలానే ఉన్నాయి. స్థానిక కొండల్లోదొరికే బండలు తప్ప ఎక్కడా ఇటుక వాడలేదు. ఊరి మధ్యలో గుడి ఉంది.

КОМЕНТАРІ • 25

  • @ravikumar-du8mg
    @ravikumar-du8mg 6 місяців тому +1

    భయంకరతెలుగు

    • @intothenature246
      @intothenature246  6 місяців тому

      వాడుక భాషలో కొన్ని పదాలు పొరపాటున దొర్లుతుంటాయి. మీకు కంటెంట్ నచ్చుతుంది అనుకుంటున్నాను.

  • @sreenuvlogs6094
    @sreenuvlogs6094 6 місяців тому +1

    మీ వీడియోస్ interest గా ఉన్నాయి అన్న

  • @gangarajugangaraju5421
    @gangarajugangaraju5421 6 місяців тому +1

    Super bro

  • @bhaskar9578
    @bhaskar9578 6 місяців тому +1

    Nice.Maa vuru basavapuram chupinchu bro

    • @intothenature246
      @intothenature246  6 місяців тому

      అది ఇంకా బయటపడలేదు బ్రదర్

  • @ravikumar-du8mg
    @ravikumar-du8mg 6 місяців тому +1

    పాపం😮😮😮😮

  • @ramalakshmi3063
    @ramalakshmi3063 6 місяців тому +1

    Thank you bro ma oorini choopinchinanduku meeru andi correct adi maa oori ramalayam aa ramalayam pakkane maa illu undedi okappudu memu chala sarlu vellalani anukunnam kani kudaraledu meeru choopincharu thank you soo much bro

  • @Janakhi_Bhakti_Vibes
    @Janakhi_Bhakti_Vibes 6 місяців тому +1

    Excellent Drone visuals and well narration about olden days living lifestyle.

  • @sivasaikumarreddy2954
    @sivasaikumarreddy2954 6 місяців тому +1

    Vivek intro lo maanchi walk tho bale undhi 😂

    • @intothenature246
      @intothenature246  6 місяців тому

      ఎందుకు బ్రో సబ్జెక్ట్ ను వదిలేసి ఇలా హేళన చేస్తావ్, ఏదో ఒకరోజు మన వీడియోల్లో నిన్ను టార్గెట్ చేయడం పక్కా 😂

  • @prasadreddy5643
    @prasadreddy5643 6 місяців тому +1

    Pulijudham that is and more persons sweet moreries in that , nice bro

  • @hauksbyers2786
    @hauksbyers2786 6 місяців тому +2

    పల్లె పల్లెకు చెరువులు కట్టి నీటి సరఫరా చేసి ఉంటే సరిపోయేది 1000 పరిపాలన చేసిన ముస్లిమ్స్ ప్రతి ఊరికి చెరువులు కట్టించినారు డ్యాములు కూడా కట్టించారు అయితే పెద్ద నదికి చాటల్ మాధురి ఎక్కడెక్కడ డ్యాములు చిన్నవి కట్టి ఉంటే పోయేది కరెంటు కోసమని ఇంకెన్నో ఊర్లు టీబీ డ్యాం కట్టినారు కదా ఎనిమిది వందల పల్లీలు మునిగి పోయినాయి భూమి యొక్క ఈ డ్యాముల వలన చలనము ప్రేమించు చున్నది శ్రీకృష్ణదేవరాయలు ప్రతి పల్లెకు చెరువులను కట్టించినాడు ఏం చేస్తాం చెప్పండి

    • @intothenature246
      @intothenature246  6 місяців тому

      మీరు చెప్పింది పూర్తిగా అర్థం కాకపోయినా, మీ ఉద్దేశ్యం మంచిదే అనిపిస్తోంది. స్పందించినందుకు ధన్యవాదాలు..

  • @sunilrachamreddy267
    @sunilrachamreddy267 6 місяців тому +2

    రేపు పౌర్ణమికి వెల్దామా

    • @intothenature246
      @intothenature246  6 місяців тому +1

      వెళ్దాం వెళ్దాం

  • @ravikumar-du8mg
    @ravikumar-du8mg 6 місяців тому +1

    పల్లీలు కాదు😊😊😊😊 పల్లీలు మునిగితే మెత్తగతినొచ్చుబ్రో😊😅
    **పల్లెలుమునిగిపోయాయి**

    • @intothenature246
      @intothenature246  6 місяців тому

      అక్కడ అన్నది కూడా పల్లెలు మునిగిపోయాయనే కదా