Nirguname Nee Gunamu | Beautiful Shiva Bhajan | SGS Composition

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • Pujya Guruji Sachchidanand Composition
    Lyrics :
    నిర్గుణమె నీ గుణము కాగా ఓ శివా
    ఎందుకయ్యా ఈ తతంగమంతా
    అంతయూ నీపై ఉండగా ఓ శివా
    ఎందుకయ్యా తోలుబొమ్మలాట? ॥ నిర్గుణమె ||
    నింగి నిప్పు నీరు నేల గాలి నీవు
    ఎందుకయ్యా నీకు అభిషేకము?
    జీవులను పుట్టించి పోషించు నాధుడవు
    ఎందుకయ్యా నీకు నైవేద్యము?
    నేను నీ వాడనని నిన్ను నాలోగని కనువిప్పు కలిగించుటకునేమో
    మర్మముల్ దెల్పుటకు ముదమునందించుటకు త్రిగుణముల్ దాటించు టకునేమో || నిర్గుణమె ||
    కాంచీపురమ్మున కైలాశనాథుడ, శ్రీరంగమందున్న జంబునాథ
    అరుణా చలేశ్వరా అగ్ని స్వరూపా కాళహస్తీశ్వరా వాయులింగ
    చిదంబరేశ్వర ఆనంద నటరాజ; పంచభూతేశుడవు నీవే కదా
    స్థూలము నీవై సూక్ష్మము నీవై కారణము నీవై ఉన్నావుగా
    ఆపదల్ తొలగించి, అరివర్గముల్ దునిమి సచ్చిదానందమ్ము నందీయవా || నిర్గుణమె ||

КОМЕНТАРІ • 12