Roots - మనమూలాలు || Latest Telugu Short Film 2020 || LB Sriram He'ART' Films
Вставка
- Опубліковано 5 лют 2025
- Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... మనం ఎంత ఎత్తుకి ఎదిగినా- 'ప్రపంచం అంచు' దాకా వెళ్ళినా-"మన 'మూలాలు' మరిచిపోకూడదు" మీరెక్కడ బతికినా- 'సొంతవూరు'లో మీ చిరునామా చెరిపేసుకోకండి! రేపంటూ మీరు వెళ్లాలనుకుంటే- మీకంటూ'అగ్గిపెట్టి' అంతచోటైనా ఉండాలిగా అక్కడ!? అలా లేకుండా చేసుకున్న గొప్పవాళ్లనుకుంటున్న నిరుపేదలు ఎంతమందో!?!?
Cast & Crew:
LB sriram
Rakhee
G rajeswar
Sri anvesh
Story
Prof. Raamaa chandramouli
Cinematography
Vishal(chinna)
Editor & Technichal Director
Rajesh RB
Music & Sound effects
PVR raja
Direction Department
Sri anvesh,
Savith c Chandra,
Mahmed rafee,
Mahesh,
Shanigaram ramesh,
Vivek
Manikanta
Subtitles
Vedantam Sripati sarma
Screenplay
Direction
LB sriram
Subscribe:
/ @lbsriram6916
You may like our other telugu short films :
1. LB Sriram's " గంగిరెద్దు" Latest Telugu Short Film
• LB Sriram's Gangireddu...
2. LB Sriram's "పండగ" Latest Telugu Short Film
• LB Sriram's Panduga పం...
3. LB Sriram's "Breakup" Latest Telugu Short Films 2018
• LB Sriram's Breakup La...
4. LB Sriram's "Endaro Mahanubavulu" Latest Telugu Social Message Short Film
• LB Sriram's Endaro Mah...
5. "Ye Perutho Pilichinaa" New Telugu Short Emotional Film 2017
• L B Sriram's Ye Peruth...
6. LB Sriram's Most viewed "Dolu Sannayi" | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films
• LB Sriram's Dolu Sanna...
7. LB Sriram's Latest Telugu Short Film "Maa Nanna" : LB Sriram heart Touching Films
• LB Sriram's Maa Nanna ...
8. LB Sriram He'ART' Films : Latest Nice Telugu Short Film 2017 "Panduga"
• LB Sriram's Panduga పం...
9. LB Sriram's "Prasadam" Latest Telugu Devotional Short Film 2017 | LB Sriram He'ART' Films
• LB Sriram's Prasadam ప...
10. LB Sriram Best Devotional He'ART' Films "Devudu"
• LB Sriram's Devudu దేవ...
11. Latest LB Sriram Emotional Telugu He'ART' Film "Nurse"
• LB Sriram's Nurse నర్స...
12. LB Sriram's Latest Telugu He'ART' Film 2018 "Premikudu" (The Lover)
• LB Sriram's Premikudu(...
ఈ 'ROOTS' సంస్థ 'ఎక్కడ ఉంది' అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు..
లేదట..కథారచయిత చెప్పారు.. అందుకే మరీ నచ్చింది నాకు.. అయినా, అదెంత సేపూ?.. ఏ గొప్ప వ్యక్తో, వ్యవస్థో రేపు ఇట్టే ప్రారంభిస్తారు ఎక్కడో.. విలువల కోసమైనా, వ్యాపారం కోసమైనా.. గతంలో ఇలాగే 'పండగ' అని ఒక 'హా(ర్)ట్ ఫిలిం' తీసేను.. పల్లెటూళ్ళో ఒక రిటైరైపోయిన వాడూ, వట్టిపోయిన 'ఆవు' తప్ప ఏ ఆధారం లేని నిరుపేదవాడూ- ఆవుపేడతో 'గొబ్బిళ్ళు' చేసి hi tech city ముందు అమ్మేసి, ఆ డబ్బుతో సంక్రాంతి పండగని అందరికంటే గర్వంగా ఎలా జరుపుకున్నాడో చెప్పే కధాంశంతో.. cutచేస్తే- next year అతి పెద్ద వ్యాపార సంస్థ amazon- on line లో 'గొబ్బిళ్ళు' అమ్మితే- ఘోరమైన సేల్స్.. 😄
Avunu ADI nenu chusanu kani ala Pidakalu chesi ammey vallalo undey apayatha...Amazon lo ekkada dorkiddi andi
Thank you so much sir... for Choosing My Home to made this beautiful video about my occupation nd My parents are so happy because they are participated in this beautiful Video.....
Nice guruvu garu
Guruvu garu Okkasari story vinandi guruvu garu please
L B Sriram Sir, చాలా బాగా చెప్పారు సార్. కులం అంటే చేసే వృత్తే కాని ఒకటి గొప్ప ఇంకోటి తక్కవేం కాదు. శరీరంలో ఏది అధమం, ఏది ఉత్తమం?
అన్నీ కలగలిసిన సమాజమే ఉత్తమం.
అద్బుత దృశ్య కావ్యం... వళ్లు మర్చి, కళ్ళు చమర్చి, చూసాం మా కుటుంబం అంత.. కానీ నేను ఎంతగానో ఎదురు చూసిన నా కుల వృత్తి (నాయి బ్రాహ్మణ)ని చూపించలేదు గురువుగారు. మూలం మరువలేని నేను నా వృత్రిని నేర్చుకోలేకపోయాను.. మీ లఘు శీర్షకలు కళ్ల తో ప్రారంబించి మనసు తో చూస్తాను. ధన్యవాదాలు.
ఈకాలం విద్యార్థులకు ఏమినేర్పితే ప్రయోజకులు అవుతారు అనే సందేహం కలిగినపుడు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఒక పాఠ్య పుస్తకాన్ని పరిచయం చేసినట్లుగా ఈ life is beautiful శ్రీరామ్ గారి హార్ట్ ఫిలిమ్స్ చూపించాలి అనేది ఒక ఉపాధ్యాయునిగా నా అభిమతం. శ్రీరామ్ గారు మీరు ఎన్నో కోణాలను మీ ఫిలిమ్స్ ద్వారా చూపిస్తున్నారు కానీ నాది ఒక కోరిక మన సంస్కృతి సంప్రదాయాల వెనుక దాగివున్న సైన్స్ మూలలను నేటి తరానికి తెలిసేలా ఒక షార్ట్ ఫిల్మ్ తీయగలరు ఎందుకంటె మన ప్రతి చాదస్తం వెనుక ఒక విజ్ఞాన రహస్యం దాగివుంది నేటి తరానికి అది చాదస్తం కాదు సైన్స్ అని భోదపడేలా ఒక చక్కటి హార్ట్ ఫిల్మ్ తీయగలరు ఆచిత్రం నా విద్యార్థులకు పరిచయం చేయాలని కోరిక కాస్త దీనిగురించి ఆలోచించగలరు
మీ లఘు చిత్రాలని టి.వి లో వేస్తే బాగుంటుంది వారానికి ఒకసారైనా. జనం మంచి ని చూసే అవకాశం ఉంటుందని ఆశ.
ఈ మహానుభావుడి పాదం పద్మములకు వందనాలు మారిపోయిన మనల్ని మళ్ళీ మన మూలాల్ని గుర్తు చేశాడు. హృదయాల్లో పదిలంగా దాచుకునే గొప్ప వ్యక్తి L.B.Sriram gaaru
Mana moolalalu goppaga/adbhuthanga theliyachesina kadhavidhanam chala bagundi.
చాలా మందికి ఒక స్థాయి వచ్చాకా, తమ మూలాల అంటే ఇష్టం ఉండదు. ఏవృత్తి తక్కువ కాదు..ఎక్కువా కాదు. దేనికి అదే సాటి. గొప్ప ఆలోచన లఘు చిత్రం
మీ విడియో లు ఎప్పుడు వస్తాయా??...అని ఎదురుచూస్తూ ఉంటాం ...చక్కటి నేపథ్యం తో ఈ తరం వాళ్ళు ఎలా ఉండాలో బలే చూపిస్తారు అండి మీరు ..👌👏👏
నిజమే సామి...నా మూలం వ్యవసాయం...
ఉద్యోగ రీత్యా విదేశాలలో వుండడం వల్ల
ఈ ఆనందాలకు దూరమయ్యా...
సెలవులకు ఇంటికి వెళ్ళి నా ,ఆ అవకాశం లేదు...ఆ వరి పొలాల్లో చేసిన పనులు, బురద అంటిన బట్టలు....
ఎప్పటికైనా మళ్ళీ నా మూలాలను నేను చేరుకోవాలి...
గుండె లోతుల లోని మూలాల్ని తాకి కంట తడి పెట్టించిన అద్బుతం ...ఎల్బీ శ్రీరాం గారికి వందనం
నేను చిన్నప్పుడు స్కూల్ నుండి వచ్చిన తరువాత మట్టి వడబోసి మా నాన్నగారు చేసిన కుండలు కుండీలు లోపల పెట్టి , ఆదివారం పూట నేను కూడా ప్రమిదలు చిచ్చుబుడ్లు చేసేవాడని, ఇప్పుడు అవేమీ లేవు. మట్టి కుండ లేదు మట్టి ప్రమిద లేదు. కానీ ఒకటే బాధ ఇప్పుడు నా కొడుకుకి నా వృత్తి గురెంచే చరిత్రగా చెప్పుకునే దోర్బాగ్యం పట్టింది. కానీ వాడికి కనీసం వాటి గురించి చెప్తాను. కులం అంటే మనిషిని వేరు చేసేది కాదు బతుకుతెరువు అంతే . అన్ని కులాలు అన్ని అవసరాలే. ఇది ఎక్కువ అది తక్కువ కాదు. ధన్యవాదాలు LB SRI RAM గారు
శ్రీరామ్ గారు మన మూలాలు షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. నేను ఒక రైతు బిడ్డనే. దినందిక జీవితం లో పడిపోయిన నాకు మరలా నా బాల్యం ఆ పొలాలు వరి పైరు ను తిరిగి గుర్తు చేసారు. చాలా కృతజ్ఞతలు.
మా పిల్లలకు ఒకసారి పొలం దుక్కి దున్నడం చూపించి చేయిస్తాను.
గోసుకోండ కాత్యాయనీ
👌👌👌 నేను కుమ్మరి, మీరు మన మూలలను చాల చక్కగా చూపించారు...ధన్యవాదములు...
కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం శాలల మగ్గం సహస్ర వృత్తులు సమస్త చిహ్నాలు నా వెనుతెంచే నా విరచించే నవీన గీతికి నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం......
ఎల్ బి శ్రీరామ్ 🙏
బతుకు చిత్రాలకు లఘు చిత్రాల రూపంలో ప్రాణం పోస్తున్న మీకు... ఎప్పటికీ రుణపడి ఉంటాం...ఎల్‌బీ సార్...
గురువు గారు మన మూలాల్ని కళ్లకు కట్టినట్టు చూపించిన మీకు పాదాభివందనం...
చిన్నప్పటి తీపి గుర్తులను ఒక లఘు చిత్రంగా చూపుతారని ఆశిస్తూ...(గోలి కాయలు, కర్రా బిల్ల లాంటి ఆటల్ని చూపుతూ).
కళ్యాణిక్రిష్ణారెడ్డి సూరగాని
Good & Great. Super.
చాలా చక్కటి చిత్రం శ్రీరాంగారు. నాకు ఎంతో నచ్చింది. బయట పొలాల్లో పనిచేసిన ఎద్దులు చీకటిపడగానే వాటంతట అవే ఇంటికి చేరతాయి. రైతు బండిలో నిద్రపోతున్నా సరే! అలాగే పక్షులు. ఎగురుకుంటూ వచ్చి గూటికి చేరతాయి. మరి మనుష్యులందరూ కూడా అలా చేస్తే ఎంత బాగుంటుంది. అభినందనలు. - సత్యం మందపాటి
మూలాలని మరువకూడదని ఈ చక్కటి లఘు చిత్రం గుర్తు చేస్తుంది. అభినందనలు ఎల్బీ శ్రీరామ్ గారికి
అన్ని కులాల వృత్తుల గురించిన వీడియో తీసిన్నందుకు కృతజ్ఞతలు. ఇప్పటి తరానికి చాలా అవసరం సర్.
ఎందుకో కళ్ళంట నీళ్ళొస్తున్నాయి గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భరత మాత ను ... అన్నట్టు.... ఏ ఉద్యోగం చేసిన, ఏ స్థాయి లో ఉన్న మరవకు రా మన “ మూలాలు “ అని బాగా చెప్పేరు. నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻
అనుక్షణం మన మూలాన్ని మరువకూడదు అనే మీలాంటి వారు ఇంస్ప్రెషన్.. సార్ 🙏🙏🙏👌
అన్ని కులాల వృత్తుల గురించి వీడియో తీసినందుకు మీకు కోటి దండాలు గురువుగారు
ధర్మో రక్షతి రక్షితః. గ్రామీణ కుటుంబ అధ్యాత్మిక జీవనశైలి వర్ధిల్లాలి అని ఆశిస్తూ.. ధన్యోస్మి..
ఒక మాట అద్భుతం అయ్య, పుట్టింటి కి వచ్చిన అమ్మాయి దగ్గర డబ్బులు .......... Great sir
ప్రతి మనిషి జీవితం లో రూట్స్ అనే పదం వుంది.కానీ ఎదుటివారికి చెప్పటానికి మాత్రమే ఉపయోగిస్తాము మన రూట్స్ మనం chusukovalante కష్టానికి వంగాలిగా.తనువు,మనసు.
ఎలా వంచాలో ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా చూపించి మరోసారి మా మనసులు మురిపించి మరిపించారు . అన్నగారికి నా నమోవాకాలు
ఈ షార్ట్ ఫిల్మ్ చూశాక నా కు ఎంతో ఉపయోగించిన చిన్ననాటి పలక, డొక్కు సైకిల్, విసనకర్ర, గొడుగు, పడక్కుర్చీ వంటివి గుర్తుకొచ్చాయి. థాంక్స్.
ఉగాది కానుకగా ఈ short film release చేసినందుకు కృతజ్ఞతలు LB శ్రీరామ్ గారు.
అవునండి ఆ ఆనందానుభూతి ఖరీదైన జీవితంలో కనిపించదు. మీ ప్రతి షార్ట్ ఫిల్మ్ గొప్ప సందేశంతో తీస్తారు...మీకు నా ధన్యవాదాలండీ....👏👏🙏
అద్భుతమైన సందేశమండీ👌👏🙏💐
నమస్కారం ఆచార్యుల వారికీ , 🙏🙏
ధన్యవాదాలు మీరు ఈ లఘు చిత్రాన్ని చేసినందుకు ,వృత్తి దారుల జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తూనే భారతి,భరత్ అనే పేరులతో ఈ సమాజానికి కులంఅనేది కేవలం వృత్తి అని చూపెట్టినందుకు మాట్లాడటానికి మాటలు లేవు అద్బుతంగాఉంది ధన్యవాదములు.
కుల వృత్తి 😍 చక్కని ఫిలిం👏
అద్భుతమైన సందేశాత్మక చిత్రం ఎల్. బి.శ్రీ రామ్ గారు . జలసాలలో కళ్ళుమూసుకొని వృద్దాప్యం లో కూడా కళ్ళు తెరిచి "మూలాల "గురించి ఆలోచించని వారికి ఇది మంచి సందేశం .
వృత్తి మనకు దేవుడు దాన్ని మనం వదలకుండా ఉండాలి అని చెప్పకనే చెప్పారు
చలా బాగుంది. ఇలాంటి సంస్థ దాన్ని ఆదరించె మనుషులు వుండాలి. శ్రీరామ్ గారు ఓకే విలువల విప్లవం తెస్తున్నారు
నాకు కూడా మా తాతలు బ్రతికిన విదంగా ఒక్కరోజైనా ఉండాలని ఉంది
యల్ బి శ్రీరామ్
సార్ మీరు గ్రేట్... మూలాలు శీర్షిక గ్రేట్
అద్భుతం🙏🙏🙏నిజంగా ఇలాంటి సంస్థ ఎవరైనా స్థాపిస్తే ఎంత బావుంటుందో❤❤❤
చాలా బాగుంది అన్నీ వృత్తులు చూపిస్తున్నారు చేనేత చూపించడం లేదు అని అనుకుంటున్న చూపించారు చాలా బాగుంది ..
అన్ని వృత్తులు గొప్పవే అనే మంచి మెసేజ్ మిరు చక్కగా చూపించారు.
🙏👏👏👏బాబాయిగారు, మాట్లాడటానికి మాటలు లేవు....అద్బుతంగాఉంది...ఇలాంటి అద్భుతాలు మీవల్లే సాధ్యం...ఉగాది శుభాకాంక్షలు...
Yes exactly
LB శ్రీరాములు గారు మీ షార్ట్ ఫిల్మ్స్ చాలా మొరల్గా ఇన్స్పరేషన్ గ వుంటాయి సార్ మీరు రజకులు చాకలి వారి గురించి ఒక ఫిల్మ్ చేయండి సార్
Moolalu marchipotey puttagathulu vundav antaru. L.B Sriram garu and staff ki naa pranamalu 🙏🏻
అద్భుతః
కాకాని సతీష్ కుమార్
ఎర్రవరం గ్రామం
కోదాడ మండలం
సూర్యాపేట జిల్లా
తెలంగాణ రాష్ట్రం
భారతదేశం
న చిన్న నాటి స్మృతులు అన్నీ గుర్తు కు వచ్చాయి సర్ మీకు చాల చాల థాంక్స్
Happy ugadhi sir
Manaku nachina work cheste aa happiness entha money unna sarithugadu, thank u sir
ఈ తరం పిల్లలు ఇలాంటి వీడియో లో చూసి వాళ్ళ కుల వృత్తి గురించి వాటి ప్రాధాన్యం గురించి తెలుసుకునే భాగ్యం కలిగించిన మీకు ధన్యవాదాలు.. మీ మేడం గారికి మా కుల వృత్తి అయిన చేనేత లో భాగం చేసినందు కు గర్విస్తున్నాను, అన్ని కులలవారు ఏ స్థితి లో ఉన్న తమ మూలాలు మర్చి పోకూడదు అనే ఓ గొప్ప సందేశాన్ని అందించారు.. చివరగా మీ మాటలతో నా కళ్ళు చెమ్మగిల్లాయి.. ధన్యవాదములు సార్..
ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు సర్..
కాన్సెప్ట్ అమోఘం....
చాలా మంచి ఐడియా.....
మీ నటన అద్వితీయం..
ఆఖరి శ్రీ శ్రీ గారి మాటలు..ఇరగతీశారు మీరు..
మా గౌడ కుల వృత్తి అయిన కల్లుగీత ను కూడా మరువకుండా చాలా చక్కగా చూపించారు..
Hats off to you sir..
Very Great Concept..
చాలా అందమైన అనుభూతి sir!!!!యువతరానికి చాలా గొప్ప సందేశం ఇచ్చారు
హాయ్ యల్ బి శ్రీరామ్ గారూ మీకు నాహృదయపూర్వక నమస్కారాలు. కాస్త ఆలస్యమైనా మీ వెబ్ సీరీస్ చూస్తున్నాను. మీరొక అద్భుతం. మీకు ఆ శ్రీరామ చంద్రుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని మీరు ఇంకా మానవ సంబందాలు ప్రేమాభిమానాలు విలువలు కల వెబ్ సీరీస్ జనరంజకంగా తీయ్యాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను
మాది వ్యవసాయ కుటుంబం..ఆదివారాల్లోమా నాన్న కూడా పొలం వెళ్లి పనులు చేసే వాడిని. గడ్డి కోసేవాడిని..ఆయన చేస్తుంటే చూసే వాడిని..నాన్న లేరు..కానీ నాన్న ఆరోజులు గుర్తొచ్చి కన్నీళ్లు ఆగడం లేదు..మనం రైతు లం.. రా అనేవారు..మన చెమట భూమిలో పడాలి రా అనేవారు..అవును మనం భూమి పుత్రులమ్.. ఎంత మారినా ఎదిగినా మూలాలు మరచిపోకూడదు..మిస్ యూ నాన్న...థాంక్యూ lb sir
మనసంతా చాలా నిండుగా అనిపించింది సర్... మీ షార్ట్ ఫిలిమ్స్ అన్ని మట్టి వాసన కొడుతుంటాయి... తెలుగులో ఎలాగో ఇలాంటి సినిమాలు తియ్యరు షాట్స్ ఫిలిమ్స్ అయిన తీస్తున్నారు... 🙏🙏🙏
eppudu comment cheyyakapoina ....ee short film kaadhu kaadhu ee 'heart film' ki naa gundey ankitham😍..inkokka '♥️' aa chivarlo unna diologue ki..
గురుదేవోభవ!చాలా బాగుంది గురువుగారు
గురుభ్యోనమః మన మూలాలు మరోక్కసారి గుర్తు చేశారు.ఉగాది శుభాకాంక్షలు .✍️👏🙏
L B శ్రీరామ్ గారు అందించిన roots మన మూలాలు ఒక అద్భుతం. నేను చూసిన అన్ని చేతి వృత్తులను ఇందులో చూపించారు. ఈ వీడియో ద్వారా మా అబ్బాయి కి ఒకేసారి అన్ని వృత్తులను చూపించగలిగాను. అలాగే ఎవరైనా ఎంత ఎత్తుకు ఎదిగినా, వారి ,వారి పూర్వీకుల ఉనికి ఎక్కడినుండి మొదలైనది వాటిని ఎలా మరిచి పోకుండా మననం చేసుకోవాలో చాలా బాగా చూపించారు.మంచి సందేశం ఇచ్చారు. ఒక్కసారిగా మనసు ప్రశాంతము అయినది. ఈ short ఫిల్మ్ కి అందించిన music మంచి గ్రామీణ వాతావరణం గుర్తు చేసేలా చాలా బాగుంది.
L B గారు, మీరు ఇలాంటి వీడియోస్ చేయాలి, మేము వాటిని lessons లా మా పిల్లలకి చూపించాలని ఆకాంక్షిస్తూ
మీ అభిమాని శ్రీనివాస్....
మెమర్బుల్ వీడియో సర్ విలువలు ఉన్న మీ వీడియోస్ కి ధన్యవాదాలు🙏🙏🙏
కమ్మరి కొలిమి. కుమ్మరి చక్రం.జాలరి పగం.సలెల్ల మగ్గం.సహస్ర వృత్తుల సమస్త చెక్నలు నా వెనుతిచే నా విరాజిచే నవేనా గితికి నవేనా రితికి భావం భాగ్యం ప్రాణం ప్రాణవం 🙏 మా నాన్న రైతు కూడా గ్రేట్ వీడియో మాన గ్రేట్ మూలాలు మరచిపోకూడదు
మంచి మెసేజ్ ఇచ్చారు..మూలాలు మరవ నప్పుడే మనిషి లో మానవత్వం బ్రతికి ఉంటుంది.. చాలా బాగుంది శ్రీ రామ్ గారూ..🙏
Lb sriram gariki dhanya vadalu. 👌👌👌🙏🙏🙏🌺🌺🌺🌺🌺
Namaskaram guruvugaru ur great 💐👌 sir,
Sir mee short films lo act. Cheyalani undi... I respect u sir
Still u r fighting for against struggling days...Great Sir....Age is just a Number...
Great sir సూక్ష్మం లో మోక్షం అంటే ఇదేనేమో.చిన్న చిన్న సంఘటన లో ఎంత అర్థం దాగి ఉందో?
సార్ మీ ప్రతి చిన్న సినిమా లో పెద్ద విషయం దాగివుంటుంది దేశసేవా చేసే వ్యక్తులలో ఒక్కొక్కరికి ఒక దారి ఉంటుంది. అందులో మీరు ఎంచుకున్న ఈ దారి చాలా అద్భుతమైనది. దేశం మారాలంటే వ్యక్తి వ్యక్తిత్వంలో మార్పు రావాలనే మీ ఆలోచనకు నమస్కరిస్తున్న సార్
ముందుగా మీ మాత పితరులకు శిరః పూర్వక పాదాభివందనం. ఇలాంటి ఒక మనసును కదిలించగలిగే చిత్రాలను రూపొందించే మహా మనీషిని మాకు అందించినందుకు. అయ్యా మీరు తీసే లఘు చిత్రాలు చిన్న పాప నవ్వులలా మనసుకి ఆనందంగా ఎంతో హాయిగా ఉంటాయి. మీ ఈ ప్రయత్నం చిరకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తూ మీ అభిమాని.
🙏🙏🙏పొగడటానికి మాటలు రావటం లేదు.
నా చిన్నతనం లో మా అమ్మ వాళ్ళ ఊరిలో....కుండను చెయ్యటం చూశాను... ఆయన అలా చేస్తుంటే......అలా కళ్ళు అప్పగించి చూసే వాడిని సర్..మళ్ళీ ఇప్పుడు వీడియో లో చూసాను....చాలా బాగుంది సర్....మూలాల మర్చిపోకూడదు....thanku సర్...
మీ రచనలు తెలుగు ఇంకా బతికే ఉన్నదని రుజువు చేస్తున్నాయి ... అద్భుతం సర్. 🙏
LBS Garu I am a cabin crew, i have seen the world but no wonder i am watching now ur videos standing in front of burj Khalifa in Dubai, love ur videos sir, thank u
Marokkasaari maa Manasu ni tadepesaaru sriram Garu.hats off...
మట్టి వాసన ఎరిగిన ఓ మట్టి మనిషి మూలాల తత్వం పసిగట్టిన నటతపస్వి కి నమస్సుమాంజలి
Sri Sri Hari Kavitha tho mee shart film Chala bhagundhi.
Mallesham bharain
గురువు గారు...నాగలి పట్టుకుంటే చూడాలని ఉంది..
చెట్టు కి వేర్ల ఎంత ముఖ్యమో. మన జీవితం కి ఎది ముఖ్యమని భలే చూపించారు
Sri Ram Garu You are a great creator of Natural feelings .... You give real enjoyment of Nature by seeing your heaartful shirt stories
అద్భుతం శ్రీ రామ్ గారు.. మీకు మా తాత వయసు ఉంటుందేమో, నాకు 29..
నాకు చాలా బాగా నచ్చింది మీ వీడియో.. మీ కొత్త సీరియల్ అమృతం ద్వితీయార్థం కూడా చూస్తున్న...
మీరు బావుండాలి, నవ్వుతూ, నవ్విస్తూ..
మీ సంతోష్ కుమార్ నక్కా...
Abba chusthunnantha sepu entha hayeega undo manasuki chala chala baguntayee mee heart films.vache inko heart film kosam eduruchusthu unta,endukante inko anubhuthee kosam.
మీకు,మీ కుటుంబ సభ్యులకు శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి... "హార్ట్ ఫిల్మ్స్"... పేరుకు దగ్గట్టే మనసుకి హత్తుకుని ఆలోచింప చేస్తున్నాయి...డబ్బుకు మాత్రమే విలువున్న ఈ రోజుల్లో మనుషులకు విలువలు నేర్పుతున్నాయి మీ ఫిల్మ్స్.. ...చాలా సంతోషం అండి.. ప్రపంచం అంచు దాకా వెళ్ళి నా .... మొదటి అడుగు వేసిన ఇంటి గడపను మర్చిపోకూడదు... 👌👌👌👌👌
చాలా గ్రేట్ మూవీ ని చాలా గ్రేట్ డైరెక్టర్ ఎల్బీ శ్రీరామ్ గారు చాలా బాగా అందించారు.
LB sir మొదట చూసిన వీడియో roots- మన మూలాలు , నేను ఊ ర్లో నే పుట్టి పెరిగాను అన్నీ కుల వృత్తులు చూస్తూనే పెరుగుతున్నా ను అయిన కూడా మీరు చేసిన ఈ అందమైన, అర్థవంతమైన కథా మనసుకు ఎంతో నచ్చింది. ఒక్కసారిగా ఆలోచిస్తూనే ఉండిపోయాను....
చూసిన వెంటనే లైక్, షేర్, కామెంట్ చేస్తున్నాను...
Excellent short film stating that donot forget our roots hatsoff to LBS Garu
Goppavalaku goppa goppa alochanale vastaei.super sir.🙏
ప్రపంచమంతా విస్తరించిన తెలుగు వాళ్ళకి ఎంతో ప్రేమగా చిత్రించిన మీ లఘు చిత్రాలు ద్వారా ఎన్నో విశేషాలు తెలియచెప్పడం అభినందనీయం
అదే నేనూ ఎంతో అదృష్టంగా భావిస్తూంటాను!!
ఒక సినీ నట,రచయితగా-
సగటు సామాజిక వ్యక్తిగా,వ్యాఖ్యాతగా-
నా నటననీ,మాటనీ,బాటనీ,భావాన్నీ, వ్యక్తీకరణనీ-
తరాల,తరతమాల తేడా లేకుండా-
నా తప్పుల్ని పక్కకి తోసేస్తూ,
నా తెలియని తనాన్ని క్షమించేస్తూ-
ఒక 'దిగువ తరగతి అతి తక్కువ
తెలివితేటల' మామూలు మనిషిని-
జాతీయంగా,అంతర్జాతీయంగా 'ఇంత-ఎంతో 'మంది-
నన్ను మీ చుట్టంగా,ఆంతరంగికుడిగా కలిపేసుకుని-
ఇంత ఆత్మీయతా,ఆప్యాయతా కురిపిస్తున్న
ఈ ఒక అపురూప ప్ర'క్రియ' ఏదైతే ఉందో-
దీని కర్త, కర్మ కూడా మీరే!!
దీనికి నాకేం అర్హత ఉందని మాత్రం
పంచాయితీ పెట్టను!!
"ఓహో! అయితే మేం నీకు ఇచ్చిందంతా
వెనక్కిచ్చేసి ఫో, పన్చూసుకో"అంటే-
'ఢాం'మని నిద్దట్లో పోతాను!!
నాకు దైవదత్తంగా అబ్బిన ఈ అదృష్టాన్ని-
"ఇలాగే నికరంగా నిలబెట్టెయ్ దేవుఁడా"అని
మనసులోనే అగరొత్తి వెలిగించి
కోరుకుంటూంటాను_/\_
దైవదత్తం ఐనా శక్తి ని సామన్య ప్రజలకి ధారదత్తం చేయగలిగే మనసునే అంతా మంధీ కలిపేసుకుంది మన పద్దతులు భోజనాలు పెల్లిల్లు ఇలా ప్రతీది చుపిన్చిన మీరు సదా గౌరావనీయులు.
Importance of Roots is most Important in life recalled by you. Hats off.
గురువు గారు....అద్భుతంగా వుంది
చాలా బాగుంది అండి..
చరిత్ర తెలియనివాడు చరిత్ర సృష్టించలేడు-బి.ఆర్ అంబేద్కర్
మూలాలు మరిచినవాడు ముందుకు పోలేడు-బి.ఆర్ కలువ స్వేరో
శ్రీరామ్ గారు మీకు ధన్యవాదములు.
కమ్మరి చట్రం, కుమ్మరి మగ్గం సహస్ర వృత్తుల సమస్త చిహ్నం. నా వినుతించే నవీన గితికి భావం భాష్యం ప్రాణం, ప్రణవం.... సూపర్ సార్...శ్రీశ్రీ గారిని స్మరింప చేశారు
అద్భుతః గురువుగారు మీ లఘు చిత్రం చూడడం పూర్తయ్యేసరికి హృదయం ద్రవించి తెలీకుండానే ఒక్క కంటి నుండి రెండు చుక్కలు అలా రాలిపడతాయి, నేనూ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నవ్విస్తూ కూడా రెండు కళ్ళనుంచి ఎప్పుడు రప్పిస్తారని.
Sree ram garki padaabhi vandanalu. 🙏🙏🙏🙏🙏🙏
సార్.. మీరు ఈ వయసులో కూడా మా హృదయాలను తాకే షార్ట్ ఫిలిమ్స్ తీసి మమ్మల్ని సంతోష పెడుతున్నందుకు చాలా సంతోషం. మీరు కలకాలం మమ్మల్ని నవ్విస్తూ మీరు నవ్వుతూ సంతోషంగా ఉండాలి..
Chala manchi concept Andi..Manshulni marchipothunna e rojullo ..Mana mulali gurinchi marchipokunda undali Anna me alochanaku Padabivandanalu.. at least once in a month ela mana mulalaku velli mana Pani manam chestey Mana viluva Manisha viluva telsthndi 🙏🙏🙏🙏👏🏾👏🏾👏🏾
మనసుకి హత్తుకునే ఒక మంచి లఘు చిత్రం...👏 మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు lb శ్రీరామ్ గారు...
Tatayya I'm watching your videos life lessons teach chestunnanduku meeku thanks
I want your blessings tatayya
Great & Good Super Value Seens😊🙏💐🚩.
In every angle of our life basic things n ethics r reflected in this episode it's very very heart touching it must be realise this generation
హృదయాన్ని హత్తుకుంది. మనం ఎంత ఎదిగినా మన మూలాలు మరిచిపోకూడదు అని చాలా బాగా చెప్పారు.🙏🙏🙏
తాత గారు మీరు గొప్పవారు మీ ఆశయాలు అంతకంటే గొప్పవి.
మీకు ఉగాది శుభాకాంక్షలు సార్.మీరు చూపించిన కథ కూడా ఉగాడి పచ్చడి అంత కమ్మగా ఉంది.మన మూలాలు మర్చిపోకూడదు అన్న మీకాన్స్ ప్ట్ సూపర్.Than you sir.
మన సమాజం లో ఉన్న పేదల సామాజిక వృత్తి గురించి బాగా చూపించారు ఆ పనిలో ఉండే విలువ చాలా గొప్పది సర్..ధన్యవాదాలు..