HYDERABAD CITY POLICE/ANNUAL SPORTS & GAMES-2025/ CLOSSING CEREMONY/PROGRAM VISUALS
Вставка
- Опубліковано 10 лют 2025
- తేది 23.1.2025
ప్రెస్ నోట్
ఈ రోజు హైదరాబాదు సిటీ పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 విజయోత్సవ ముగింపు వేడుకలు శివకుమార్ లాల్ , గోషా మహల్ పోలీసు స్టేడియం నందు అద్భుతం గా జరిగినవి. ఈ ముగింపు కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా శ్రీమతి ఎ.శాంతి కుమారి ఐఎఎస్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , గౌరవ అతిథులుగా శ్రీ సివి ఆనంద్ ఐపిఎస్ డిజి & కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాదు, శ్రీమతి లలితా ఆనంద్ గార్లు హాజరైనారు.
తరువాత ముఖ్య అతిథుల సమక్షంలో పురుషులు మరియు మహిళలు 100 మీటర్ల పరుగు పందెం , టగ్ ఆఫ్ వార్, గుర్రాల జంపింగ్ మరియు పెగ్గింగ్, అబ్బుర పరిచే నృత్య ప్రదర్శనలు మరియు దేశభక్తి గీతాలతో ముఖ్య అతిథులను, ప్రేక్షకులను మరియు హాజరైన అందరిని ఆకట్టుకున్నాయి.
ముగింపు కార్యక్రమంలో వివిధ విజేతలకు ట్రోఫీలు, పతకాలు ముఖ్య అతిథి, గౌరవ అతిథులు ప్రధానం చేసి నారు. 4 రోజులుగా జరిగిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లలో CAR హెడ్ క్వార్టర్స్ అన్నింటిలోను మొదటి విజేతగా నిలిచింది మరియు CSW-టాస్క్‌ఫోర్స్ జట్టులకు రెండో స్థానంలో నిలిచారు.
తరువాత ముఖ్య అతిథి గారి అనుమతితో పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 ను ముగిస్తున్నాము అని తెలుపుతూ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ జేండాను అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీమతి ఎ.శాంతి కుమారి ఐఎఎస్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడుతూ హైదరాబాద్ సిటీ పోలీసుల వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 నిర్వహణ మరియు మీరు చేస్తున్న కృషి చాలా బాగుంది అని కొనియాడారు. ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడా సమయము ఉండాలి అన్నారు. క్రీడలు ఆడడము వలన శారీరకంగా కాకుండా మానిసికంగా దృఢంగా ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు మరికొన్ని నిర్వహించాలి అన్నారు.
శ్రీ సివి ఆనంద్ ఐపిఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాదు గారు మాట్లాడుతూ ఉద్యోగుల పోటీ తత్వాన్ని, క్రీడా స్పూర్తిని చూసి వారిని కొనియాడారు. మరియు క్రీడల వలన సంకల్ప శక్తి, ఒడిదుడుకులను అధిక మించే సామర్థ్యాన్ని పెంచి , ఆత్మ విశ్వాసాన్ని మరింత బల పరుస్తాయని తెలిపారు. వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 ను గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అధికారులను, పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. నాలుగు రోజుల ఈవెంట్‌లో హైదరాబాదు సిటీ పోలీసుకు చెందిన దాదాపు 2000 మంది పురుషులు & మహిళలు వివిధ క్రీడా విభాగాల్లో పాల్గొన్నారు అని అన్నారు. మరి కొన్నిరోజుల్లో స్టేట్ లెవల్ లో ఛాంపియన్ షిప్ లు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఎంత పని వత్తిడిలో ఉన్నా ఫిట్ నెస్ కోసం సమయాన్ని కేటాయించాలని అన్నారు.
ఈ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 ముగింపు కార్యక్రమానికి శ్రీ విక్రమ్ సింగ్ మాన్, ఐపిఎస్ , అడిషినల్ సిపి లా ఆండ్ ఆర్డర్ ,శ్రీమతి నందితా మాన్ , శ్రీ.పి.విశ్వ ప్రసాద్ ఐపిఎస్ అడిషినల్ సిపి ట్రాఫిక్, శ్రీమతి పరిమళ హానా నూతన్, ఐపిఎస్ జాయింట్ సిపి అడ్మిన్ , శ్రీమతి రక్షిత కృష్ణ మూర్తి ఐపిఎస్ డిసిపి సిఎఆర్ హెడ్ క్వార్టర్స్, హైదరాబాదు మరియు ఇతర విభాగాల అధికారులు, క్రీడల్లో పాల్గోన్న ఉద్యోగులు హాజరైనారు.
*****