నాతో నీవు మాటాడినచో-నే బ్రతికెదను ప్రభో //Bro Yohan//Telugu christian song
Вставка
- Опубліковано 29 лис 2024
- పల్లవి:
నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో నా ప్రియుడా.. నా హితుడా - నా ప్రాణనాధుడా.. నా రక్షకా
1. తప్పిపోయినాను - తరలి తిరిగినానూ
దొడ్డి నుండి వేరై హద్దు మీరినానూ లేదు నీదు స్వరము - నన్ను అనుసరింపన్ - ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం
ఒక్క మాట చాలు (3)
ప్రభో ఆ.....ఆ....... "నాతో "
2. చచ్చియుంటినేనూ చుట్టుబడితి నేను
ప్రేత వస్త్రములతో బండరాతి మాటున్ - కానలేదు నిన్నూ కానరాదు గమ్యం - లేదు నీదు పలుకు నాకు బ్రతుకు నీయన్ - ఒక్క మాట చాలు (3)
ప్రభో ఆ....ఆ...... "నాతో "
3. యుద్ధమందు నేనూ- మిద్దె మీద నుండి - చూడరాని దృశ్యం
కనులగాంచినానూ - బుద్ధి వీడినానూ హద్దు మీరినాను
లేదు నాలోజీవితం - ఎరుగనైతి మార్గం
ఒక్క మాట చాలు (3) -
ప్రభో ఆ....ఆ.... "నాతో "
4. కట్టబడితి నేనే - గట్టి త్రాళ్ళతోను వీడె నీదు ఆత్మ వీడె నాదు వ్రతమూ గ్రుడ్డివాడనైతి - తిరుగలిసురుచుండి దిక్కులేని నేను దయనే కోరుచుంటిన్ -
ఒక్క మాట చాలు (3)
ప్రభో ఆ....ఆ..... "నాతో "