మరో గాంధీ...ఏళ్ల ఉద్యమానికి ఊపిరి | రోడ్డు సమస్యలపై వ్యక్తి పాదయాత్ర | Tiryani to CM Office | MY3

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • #cmotelangana #revanthreddy #padayathra
    గ్రామ సమస్యలు తీర్చాలని, గ్రామానికి కనీస రోడ్డు సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ముందు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు పెందూర్ ధర్ము అనే ఆదివాసి నాయకుడు. ఇది గత నెల 6న కుమ్రం భీం జిల్లా కలెక్టర్ వన మహోత్సవం కార్యక్రమానికి తిర్యాణి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన. సమస్య తీరుస్తామని కలెక్టర్ చెప్పడంతో ధర్నా విరమించారు. కానీ సమస్య నేటికీ పరిష్కారం కాలేదని మరోసారి రోడ్డెక్కాడు ఆ నేత.
    తిర్యాణి మండలంలోని మారుమూల గ్రామాల అభివృద్ధి కోసం ఎంతోమంది అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి వేడుకున్నా చింత తీరడం లేదని విసుగు చెందారు పెందూర్ ధర్ము. ఇక నేరుగా సీఎంనే కలిసి సమస్యలు చెప్పాలని భావించి పోరు తలపెట్టారు. ఆగస్టు 15న గాంధీ వేషధారణ చేపట్టి తిర్యాణి నుంచి హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరాడు. విన్నవించాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. తిర్యాణి నుంచి హైదారాబాద్‌కు పాదయాత్ర చేయాలనీ నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు.

КОМЕНТАРІ • 52