వ్య‌వ‌సాయానికే అధిక ప్రాధాన్యం...మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • వ్య‌వ‌సాయానికే అధిక ప్రాధాన్యం...
    - పంటల విషయంలో ప్రత్యేక దృష్టి పెడతాం
    - ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం
    - సోమశిల వద్ద పనులు పూర్తి చేస్తాం
    - జిల్లా ప‌రిష‌త్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌
    నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలో...జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్‌ ఆనం అరుణ‌మ్మ అధ్య‌క్ష‌త‌న స‌ర్వ‌స‌భ్య స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో రాష్ట్ర పుర‌పాల‌క శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ పాల్గొన్నారు. ముందుగా జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ ఆనం అరుణ‌మ్మ‌...మంత్రి నారాయ‌ణ‌కి పుష్ప‌గుచ్చం అంద‌చేసి ఘ‌నంగా స్వాగ‌తించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయ‌ణ స‌మావేశంలో ప్ర‌సంగించారు. రాష్ట్రంలో 62 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్నారు. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వం వ్య‌వసాయానికే అధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని తెలిపారు. ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు కొరత రాకుండా చూస్తామ‌ని చెప్పారు. పంటల విషయంలో ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. మండల స్థాయిలో జిల్లా అధికారులు పర్యటించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామ‌ని వివ‌రించారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమ‌ని పేర్కొన్నారు. అలాగే ఆయకట్టు స్థిరీకరణ విషయంపై చర్యలు చేప‌డుతున్నామ‌న్నారు. కాలువల పూడికలు తీయాలని అధికారులను అదేశించామ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే సోమశిల వద్ద పనులు పూర్తి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. మంత్రి నారాయ‌ణ‌తోపాటు మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, క‌లెక్ట‌ర్‌, జ‌డ్పీటీసీలు, స‌ర్పంచ్‌లు, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

КОМЕНТАРІ •