సెలూన్ ఛైర్ పై రక్తదానం🫡

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • ‪@Janagalam‬ విశాఖకు చెందిన ఓ హెయిర్ స్టైలిస్ట్ వినూత్న ఆలోచనతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సీతమ్మధారకు చెందిన ట్రెండ్జ్ 47 హెయిర్ సెలూన్ యజమాని చరణ్ కుమార్ నిర్వహించిన రక్తదాన శిబిరం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా నిర్వహించే బ్లడ్ క్యాంప్ లకు భిన్నంగా ఓ వైవిధ్యమైన ఆలోచనను చరణ్ అమలు చేశారు. తన వద్దకు హెయిర్ కటింగ్ కోసం వచ్చే వారితో సామాజిక, సేవా అంశాలపై ఆలోచనలు పంచుకునే అలవాటు కలిగిన చరణ్ వారందరినీ ఓ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని భావించారు. ఆరోగ్య సంబంధిత అంశాలపట్ల సరైన అవగాహన లేకపోవడం కారణంగా కొద్ది సంవత్సరాల క్రితం తన సోదరుడిని కోల్పోయిన చరణ్... సమాజానికి కాస్త ఆరోగ్య సంబంధిత అంశాల్లో సహాయపడే ప్రయత్నాలనూ చేస్తున్నారు. అందులో భాగంగా తన వద్దకు వచ్చే వారందరినీ రక్తదానం చేయమని ప్రోత్సహించిన చరణ్... ఈ కార్యక్రమాన్ని తన సెలూన్ లోనే నిర్వహించారు. సెలూన్ ఛైర్స్ పై కూర్చుని రక్తదానం చేస్తున్న వారిని చూస్తే సరికొత్త చైతన్యం ప్రతిబింబించింది. ఇలాంటి వినూత్న ప్రయత్నంతో ప్రజల దృష్టిని రక్తదాన ఆవశ్యకతవైపు మళ్లించిన చరణ్... రానున్న రోజుల్లోను ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తానని చెబుతున్నారు. హెయిర్ కట్ కోసం వచ్చిన వారి కోసం ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమ విశేషాలను మనమూ చూసొద్దం రండి...
    #charankumargulimi #trendz47 #vizaghairstylist #janagalam #bloodbank #blooddonationcamp #blooddonation #vizag #seethammadara #gudurusithamahalakshmi #vinodbalublooddonor #vinodbalu #vizaghairsaloon

КОМЕНТАРІ • 6