List Of Model School Seniority Teachers | మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా రూపకల్పన

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను రూపొందించి..2023 నాటి మార్గదర్శకాల ప్రకారం బదిలీలు చేపట్టాలని... హైకోర్టు తీర్పు వెలువరించింది. సీనియారిటీ జాబితా లేకుండా రూపొందించిన..మార్గదర్శకాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టగా.....తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాలు.. గతంలో ఇచ్చిన జీవో 81కి విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. పిటిషనర్లు 2012 నోటిఫికేషన్ ఆధారంగా.......... 2013, 2014 సంవత్సరాల్లో నియమితులయ్యారని, అధికారుల పాలనాపరమైన వివాదాల వల్ల.... కొందరు 16 నెలలు ఆలస్యంగా...... నియమితులయ్యారన్నారు. సీనియారిటీ జాబితా రూపొందించే ముందు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను వేర్వేరుగా చూడరాదని......... గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.విద్యాశాఖ కింద పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ కమిటీ బదిలీ మార్గదర్శకాలను రూపొందించిందని..... ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. ఇవి జీవో 81కి విరుద్ధం కాదని తెలిపారు. పిటిషనర్లంతా 10 ఏళ్లకు పైబడి ఒకేచోట పని చేస్తున్నారని...., అందరూ బదిలీకి అర్హులేనని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.......... ఒకే నోటిఫికేషన్ ఆధారంగా నియమితులైనందున..చేరిన తేదీలు, తెలుగు, ఆంగ్ల మాధ్యమంతో సంబంధం లేకుండా.... సీనియారిటీ జాబితా రూపొందించాలని ఆదేశించారు. నిబందనల ప్రకారం సీనియారిటీ జాబితా రూపొందించి బదిలీ పాయింట్లను కేటాయించి......... బదిలీ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ •