ఉచిత ప్రయాణం హామీపై ఆగ్రహం-రాజమండ్రిలో ఆటో కార్మిక సంఘాలు ఆందోళనసుమారు 500 ఆటోలతో భారీ నిరసన ర్యాలీ

Поділитися
Вставка
  • Опубліковано 2 тра 2024
  • చంద్రబాబు వద్దు..జగనన్నే ముద్దు
    -టీడీపీ ప్రకటించిన మహిళలకు ఉచిత ప్రయాణం హామీపై ఆగ్రహం
    -రాజమండ్రిలో ఆటో కార్మిక సంఘాలు ఆందోళన
    సుమారు 500 ఆటోలతో భారీ నిరసన ర్యాలీ..
    రాజమండ్రి, మే 3: టీడీపీ చంద్రబాబు నాయుడు నోటికొచ్చినట్టు వాగ్దానాలిచ్చి మహిళా ఓట్లను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ‌ రాజమండ్రిలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వద్దు..జగనన్న ముద్దు అంటూ నినదించారు. శుక్రవారం మాజీ కార్పోరేటర్, వైసీపీ సీనియర్ నేత అజ్జరపు వాసు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నగరంలో తమ ఆటోలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక క్వారీ సెంటర్ నుంచి నగరంలోని గోకవరం బస్టాండు సెంటర్ వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. సుమారు 500 ఆటోలలో ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులు, వివిధ ఆటో సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ ఆటో కార్మికులకు మద్దతు పలికారు. క్వారీ సెంటర్ వద్ద ఆటో కార్మికుల నిరసన ర్యాలీకి ఎంపీ భరత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ జగనన్న పాలనలో ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, వాహన మిత్ర పథకం ద్వారా ప్రభుత్వ సహాయం ఇచ్చి‌ ఒక అన్నలా జగనన్న ఆదుకుంటున్నారని అన్నారు. అటువంటిది టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇవ్వడం ఆటో కార్మికుల పొట్టకొట్టడానికే అన్నారు. తమ జీవనోపాధిని అడ్డుకుంటున్న టీడీపీ చంద్రబాబు గెలవకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది ఆటో కార్మికులు అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పథకం పెట్టి అమలు చేయడం వల్ల చాలామంది ఆటో కార్మికులు తమ అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు అనేకం అన్నారు. ఇప్పుడు అదే పథకాన్ని ఏపీలో తమ పార్టీ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. ఏపీలో టీడీపీ చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

КОМЕНТАРІ •