శివరాత్రి రోజు తప్పక వినవలసిన ద్వాదశ జ్యోతిర్లింగ మహిమ పురాణం|Mahashivaratri Special |12 Jyotirlinga

Поділитися
Вставка
  • Опубліковано 27 лют 2022
  • #MahashivaratriSpecial #Shiva #12jyotirlinga
    #శివరాత్రి రోజు తప్పక వినవలసిన ద్వాదశ జ్యోతిర్లింగ మహిమలు
    సామాన్యుడు సైతం తనను ఆరాధించడం సులువుగా ఉండేందుకు శివుడు లింగరూపం ధరించాడు. శైవులు శివున్ని మూర్తి రూపంలో, లింగరూపంలోనూ పూజిస్తారు. జ్యోతిర్లింగం అంటే లింగ రూపంలో శివుడిని ఆరాధించే చోటు. దేశవ్యాప్తంగా 12 చోట్ల జ్యోతిర్లింగాలు నెలకొని ఉన్నాయి.
    1. సోమనాథ లింగం - సోమనాథ్
    2. శ్రీశైల క్షేత్రం (మల్లి కార్జున లింగం) - శ్రీశైలం
    3. ఉజ్జయినిమహాకాళేశ్వరం - ఉజ్జయని
    4. ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రం
    5. వైధ్యనాథ లింగం - చితా భూమి (దేవఘర్)
    6. భీమశంకర లింగం - భీమా శంకరం
    7. రామేశ్వరం రామనాథస్వామి లింగం - రామేశ్వరం
    8. నాగేశ్వర లింగం - దారుకావనం (ద్వారక)
    9. శ్రీ కాశీ విశ్వనాధ్ లింగం - వారణాశి
    10. త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరాలయం (త్రయంబకేశ్వర్, నాసిక్)
    11. కేదారేశ్వర - కేదారనాథ్
    12. ఘృష్ణేశ్వర జ్వోతిర్లింగం
    ఈ జ్యోతిర్లింగ స్త్రోత్రాన్ని నిత్యం పఠించిన వారికి ఏడేడు జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకం.
    సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
    ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్
    ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్
    సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే
    వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే
    హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే
    ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
    సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.
    సోమనాథ్:
    గుజరాత్‌ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికీ ప్రజ్వరిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమ నాథేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి.
    శ్రీశైల క్షేత్రం :
    శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.
    మహాకాళేశ్వర జ్యోతిర్లింగం:
    మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మత ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ దేవాలయం "రుద్రసాగరం" సరస్సు సమీపాన ఉంది. ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని "స్వయంభువు"గా భావిస్తారు. ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు, లింగాల వలె కాకుండా మంత్ర శక్తితో యేర్పడిన శివలింగంగా భావిస్తారు.
    ఓంకారేశ్వరం:
    ఓంకారేశ్వరం భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఖాండ్వా జిల్లాలో ఉంది. ఇది మధ్యప్రదేశ్లో Mortakka నుండి సుమారు 12 మైళ్లు (20 కి.మీ.) దూరం లో వుంటుంది. ఓంకారేశ్వర రివర్ నర్మదా ఏర్పడుతుంది. ఈ నది భారతదేశంలోని నదుల్లో పవిత్రమైన నది, ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆనకట్ట ప్రాజెక్టులో ఒకటి ఇక్కడ ఉంది. రెండుకొండల మధ్య నుండి ప్రవహించే నర్మదా నది మరియు ఈ దివ్య క్షేత్రాలను ఆకాశం నుండి చూస్తే ‘’ఓం ‘’ఆకారం గా కని పిస్తుందిట. అందుకే ఓంకార క్షేత్రం అని పేరు. ఓంకారేశ్వర కొండపై పెద్ద అక్షరాలతో ఓం అని రాయబడి ఉంటుంది.
    వైధ్యనాథ లింగం :
    పర్లి (కాంతిపూర్), దేవొగడ్ బీహార్ - బ్రహ్మ, వేణు, సరస్వతీ నదుల సమీపములో నున్నది. సహ్యాద్రి కొండల అంచునున్నది. అమృతమధనానంతరము ధన్వంతరిని, అమృతమును ఈ లింగములో దాచిరనీ, స్పృశించిన భక్తులకు అమృతము లభించుననీ నమ్మకము.
    భీమశంకర :
    మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతఘాట్‌లో పూణేకు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమనది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసింది. కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది. ఈ జ్యోతిర్లింగం అర్థనాథేశ్వర రూపంలో భక్తులు కోర్కెలు తీర్చేదిగా ప్రతీతి. ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుండడం ఓ ప్రత్యేకత. శివుని రౌద్రరూపం నుంచి వచ్చిన చెమట బిందువులు భీమనదిగా మారిందని స్థల పురాణం.
    రామేశ్వరం :
    రామేశ్వరము, తమిళనాడు - శ్రీరాముడు పరమశివుని అర్చించిన స్థలము - కాశీ గంగా జలమును రామేశ్వరమునకు తెచ్చి అర్చించిన తరువాత, మరల రామేశ్వరములోని ఇసుకను కాశీలో కలుపుట సంప్రదాయము. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధినీ దేవి.
    నాగేశ్వర:
    మహారాష్ట్ర ప్రభాస రైల్వేస్టేషన్‌కు సమీపంలో శ్రీనాగనాథేశ్వర ఆలయం ఉంది. పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ. మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినపుడు శరీరం నిండా పాములు, చేతుల్లో త్రిశూలాలు ధరించిన నగ్నకాపాలికులు వారిని తరిమికొట్టినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి.
    కాశీ:
    మహారాష్ట్ర ప్రభాస రైల్వేస్టేషన్‌కు సమీపంలో శ్రీనాగనాథేశ్వర ఆలయం ఉంది. పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ. మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినపుడు శరీరం నిండా పాములు, చేతుల్లో త్రిశూలాలు ధరించిన నగ్నకాపాలికులు వారిని తరిమికొట్టినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి.
    త్రయంబకేశ్వరుడు:
    మహారాష్ట్రలోని నాసిక్‌కు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబుకేశ్వరాలయం ఉంది. బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా వెలసి బ్రాహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలందుకొన్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
    ఘృష్ణేశ్వరం:
    మహారాష్ట్ర ఔరంగబాద్‌ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో శ్రీవిఘ్నేశ్వరాలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో ఘృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు, ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు, దేవగిరి కొండపై ఘృష్ణేశ్వరుని ఆలయం వెలిసింది.
    #Isha #shivashiva #Mahashivratristatus #mahashivratrikatha #shivwhatsupstatus #shivasongs #stotram

КОМЕНТАРІ • 1