భగీరధుని తపస్సు | bhagiradhuni tapassu | bhagiratha tapassu katha | chaganti koteswara rao speeches

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025
  • #bhagiratha tapassu chaganti,
    #bhagiratha tapassu,
    #bhagiradhuni katha,
    bhagiradhuni tapassu katha chaganti,
    sagaruni asvamedhayaga sankalpam chaganti,
    Kapila mahamuni chaganti,
    Kapilamahamunini,
    chaganti koteswara rao,
    chagantikoteswararao,
    chaganti koteswara rao speech,
    Chaganti koteswara rao speeches,
    chaganti koteswara rao speeches funny,
    chaganti koteswara rao speeches on shiva,
    chaganti koteswara rao stories,
    chaganti koteswara rao stories telugu,
    Sri Guru Bhakthi Pravachanalu
    #Sri Guru Bhakthi Pravachanalu
    please subscribe my channel
    / @srigurubhakthipravach...
    భాగీరధుడు
    రోమశుని మాటలు విని ధర్మరాజు " మహర్షీ ! భగీరధుడు సముద్రాన్ని జలంతో ఎలా నింపాడు? " అని అడిగాడు. రోమశుడు ధర్మరాజుతో " ధర్మజా! పూర్వం ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే రాజు ఉన్నాడు. అతనికి వైదర్బి, శైబ్య అనే ఇద్దరు భార్యలు. అతనికి సంతానం లేదు. అందుకని సగరుడు కైలాసం వెళ్ళి ప్రసన్నం చేసు కున్నాడు. సగరుడు సంతానం కావాలని శివుని కోరాడు. శివుడు అలాగే వరమిచ్చాడు. సగరుని భార్యలు ఇద్దరు గర్భం ధరించారు. వైదర్భి గర్భాన ఒక అలబూఫలం (ఆనపకాయ) పుట్టింది. శైబ్య గర్భాన అసమంజసుడు అనే కొడుకు పుట్టాడు. అప్పుడు ఆకాశవాణి " రాజా ఆ కాయలోని విత్తనాలు నేతికుండలలో పెట్టి కాపాడితే నీకు అరవైవేల మంది కుమారులు జన్మిస్తారు " అని పలికింది. సగరునికి అరవై వేల మంది కుమారులు జన్మించారు. సగరుని కుమారులు లోక కంటకులుగా తయారయ్యారు. దేవతలను, ఋషులను బాధిస్తున్నారు. దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు దేవతలతో " వారి గర్వం ఎక్కువ కాలం ఉండదు. త్వరలోనే వారు చనిపోతారు " అని చెప్పాడు.
    సగరుని అశ్వమేధయాగ సంకల్పం
    తప్పిపోయిన యాగాశ్వాన్ని కపిలుని ఆశ్రమ సమీపాన చూసిన సగర కుమారులు
    సగరుడు అశ్వమేధయాగం చేయ సంకల్పించాడు. యాగాశ్వాన్ని రక్షించే బాధ్యతను కుమారులకు ఇచ్చాడు. యాగాశ్వం నీళ్ళు లేని సముద్రంలోకి వెళ్ళి మాయమైంది. సగరుడి కొడుకులు యాగాశ్వాన్ని వెదుకుతూ సముద్రాన్ని తవ్వారు. వారికి ఈశాన్యంలో కపిల మహాముని ఆశ్రమంలో యాగాశ్వం కనిపించింది. కపిలుడే తమ అశ్వాన్ని దొంగిలించాడని సగరకుమారులు అతడిని అవమానించారు. ఆ మహాముని కోపాగ్నితో సగరకుమారులను భస్మంచేసాడు. నారదుని వలన ఆ విషయం సగరునికి తెలిసింది. సగరుడు దుఃఖించాడు. ఆ సమయానికి అసమంజసునికి జనించి పెరిగి పెద్దవాడైన అంశుమంతుడు అనే కుమారుడు ఉన్నాడు. సగరుడు అంశుమంతుని చూసి " నాయనా! నాకుమారులు చనిపోయినందుకు నేను భాధపడను కానీ అశ్వమేధయాగం సగంలో ఆగిపోయింది దానిని నీవు పూర్తి చెయ్యి " అని కోరాడు. అలాగే అని
    సగర కుమారులను భస్మము చేయుచున్న కపిలుడు
    అంశుమంతుడు కపిలమహామునిని చూసి నమస్కరించి తను వచ్చిన పని చెప్పాడు. కపిల మహర్షి అంశుమంతునికి యాగాశ్వాన్ని అప్పగించాడు. కపిల మహాముని " అంశుమంతా! ఈ యాగాశ్వంతో నీ తాత సగరుడు అశ్వమేధయాగం పూర్తి చేస్తాడు. నీ మనుమడు భగీరధుడు గంగను భూమి మీదకు తీసుకువచ్చి సాగరాన్ని జలంతో నింపుతాడు " అని చెప్పాడు. అలాగే సగరుడు అశ్వమేధం పూర్తిచేసాడు. సముద్రాన్ని తన కుమారునిగా స్వీకరించాడు. అందుకే సముద్రానికి సాగరం అనేపేరు వచ్చింది.
    భగీరధుని తపస్సు
    ఆకాశము నుండి భూమికి వచ్చుచున్న గంగను తన జటాఝూటముతో బంధిస్తున్న శివుడు
    అంశుమంతుని కుమారుడు దిలీపుడు. దిలీపుని తరువాత అతడి కుమారుడు భగీరధుడు రాజ్యపాలనకు వచ్చాడు. కొంతకాలం భగీరధుడు జనరంజకంగా రాజ్యం చేసాడు. సగరుని వృత్తాంతం తెలుసుకున్న భగీరధుడు సాగరాన్ని జలంతో నింపాలనుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళి గంగను గురించి ఘోరతపస్సు చేసి ఆమెను ప్రత్యక్షం చేసుకున్నాడు. భగీరధుడు గంగాదేవిని " అమ్మా! నీవు దేవమార్గాన్ని వదిలి భూమికి రావాలి సాగరాన్ని జలంతో నింపాలి. సగర పుత్రులకు మోక్షం కలిగించాలి " అని కోరాడు. గంగాదేవి " అలాగే, వస్తాను కానీ నా ఉద్ధృతిని భరించే శక్తి ఒక్క పరమ శివునికే ఉంది. కనుక నువ్వు శివుడిని ప్రసన్నుని చేసుకో " అని చెప్పింది. తరువాత భగీరధుడు కైలాసానికి వెళ్ళి శివుని ప్రార్ధించాడు. శివుడు భగీరధుని కోరిక మన్నించి " నీవు గంగను తీసుకురా నేను భరిస్తాను " అన్నాడు. మరల భగీరధుడు గంగను ప్రార్ధించాడు. గంగ భగీరధుని వెంట భూమికి దిగి వచ్చింది. శివుడు తన జటాజూటంలో ఉధృతంగా దుముకుతున్న గంగను ధరించాడు. తరువాత గంగ భూమి మీదకు వచ్చి సాగరాన్ని నింపింది. అప్పటి నుండి గంగానదికి భాగీరధి అనే నామం వచ్చింది " రోమశుడు గంగావతరణం గురించి ధర్మరాజుకు వివరించాడు. తరువాత ధర్మరాజు గంగ, నంద, అపరనంద, నదులలో స్నానం చేసాడు. తరువాత వారు హేమకూట పర్వతాన్ని చేరుకున్నాడు. అక్కడ రాళ్ళ నుండి అగ్ని పుడుతూ ఉంది. ఆ అగ్నికి మేఘాలు ఆకర్షితమౌతున్నాయి. ఆ తరువాత వారు విశ్వామిత్రుని ఆశ్రమాన్ని చేరారు. అక్కడికి సమీపంలో ఉన్న ఋష్యశృంగుని సరోవరం చూసారు.

КОМЕНТАРІ • 33