ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కోర్టుకు వెళ్ళవచ్చు అంటూ భరోసా..సిటీ ఎమ్మెల్యే కృష్ణ చైతన్య

Поділитися
Вставка
  • Опубліковано 2 тра 2024
  • ఎన్నికల హామీలను స్టాప్ పేపర్ పై వ్రాసి ఇచ్చిన జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి
    ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కోర్టుకు వెళ్ళవచ్చు అంటూ భరోసా
    త్రాగు నీటిని స్వచ్ఛమైన గోదావరి జలాలు అందిస్తా
    జై భారత్ పార్టీ తరఫున రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ చైతన్య
    రాజమహేంద్రవరం ,
    ప్రధాన రాజకీయ పార్టీ లు ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ముఖం చాటేస్తున్న రోజులలో జై భారత్ నేషనల్ పార్టీ తరఫున రాజమండ్రి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ చైతన్య వినూత్న రీతిలో తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ను స్టాంప్ పేపర్ పై వ్రాసి ఇచ్చి ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే కోర్టుకు వెళ్ళవచ్చు సంచలన నిర్ణయం ప్రకటించారు. గురువారం రాత్రి రాజమండ్రి లేడీస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జై భారత్ నేషనల్ పార్టీ రెండు మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఒకటి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే మేనిఫెస్టో అయితే రెండోది స్థానికంగా రాజమండ్రి కి చేయబోయే అభివృద్ధిపై విడుదల చేసిన మేనిఫెస్టో అని తెలిపారు. ఈ మేనిఫెస్టోలను కేవలం మాటల ద్వారానే కాకుండా స్టాంప్ పేపర్ ముద్రించి ప్రజలకు భరోసా కల్పించేందుకు వారికి ఇస్తున్నామని అన్నారు. ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు కోర్టుకు వెళ్లవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని అన్నారు.
    తనను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే రాజమండ్రి 50 వార్డులోని ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి జలాలను త్రాగునీటిని అందిస్తానని గత 25 సంవత్సరాల నుంచి ముందుచూపు, ప్రణాళిక, లేకపోవడంతో తేలికపాటి వర్షాలకు కూడా నగరంలోని అనేక ప్రాంతాలు ముంపు కు గురవుతున్నాయని వివరించారు. జంతు బెడద సమస్య నియంత్రించడానికి అవసరమైన ఎ.బి.వి, ఏ.ఆర్.వి వ్యాక్సిలను సమర్ధవంతంగా వేయించడంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ విఫలం అయిందని అన్నారు. ఈ కారణంగా రాజమండ్రి పట్టణ పరిధిలో 15 వేలకు పైగా కుక్కలు విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం తోపాటు నియోజవర్గానికి నిమ్స్ స్థాయి, జిల్లాకి ఎయిమ్స్ స్థాయి ఆసుపత్రులు ఏర్పాటు చేయడానికి తమ పార్టీ ఎన్నికల మేనఫెస్టోలో పెట్టిందని అన్నారు. ప్రత్యేక హోదా సాధించడంతోపాటు ఆంధ్రప్రదేశ్ హక్కులు , విభజన హామీల సాధనే మా ధ్యేయ మని అన్నారు. అప్పు, అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చేస్తామని అన్నారు.
    ప్రతి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతి పంచాయితీకి 10 చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ, కొత్తగా పట్టణ ఉపాధి హామీ పథకం అమలు, ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపడతామని అన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్లు, జనవరి 26 - గ్రూప్-1, ఆగష్టు 15 - గ్రూప్-2 + సెప్టెంబరు 5 - డిఎస్సీ, అక్టోబర్ 31" - ఎస్సై/కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని అన్నారు.
    ప్రతి ఒక్కరికి 10 లక్షల జీవిత భీమా ఇంటివద్దే ఎఫ్ఎఆర్, మొబైల్ పోలీస్ స్టేషన్లు, గ్రామీణ కోర్టులు, మహిళల రక్షణకు షీ-టీమ్స్ పునరుద్ధరణ చేస్తామన్నారు. సంయుక్త భాగస్వామ్యం ద్వారా అందరికీ ఆరోగ్య భీమా ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులకు, వృద్ధులకు, దివ్యాంగులకు, గర్భిణీలకు ఆర్టీసీ బస్ లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వివరించారు. ప్రతి సంవత్సరం నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల కేటాయిస్తామని అన్నారు. ప్రతి జిల్లాకి పోటీ పరీక్షల కేంద్రం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ప్రతి మండలానికి 2 కోట్లతో లైబ్రరీ, నాలెడ్జ్ హబ్, స్పోకెన్ ఇంగ్లీషు, ఆప్టిట్యూడ్ కంప్యూటర్ కోర్సులతో విద్యార్థులకు విద్యాబోధన చేస్తామని అన్నారు.
    ఆడబిడ్డలకు ఆస్తిగా టేకు, ఎర్ర చందనం చెట్లు, ప్రతి ఇంటికి ఉచిత వాటర్ ప్యూరిఫయర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. సొంత ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక, కంకర నిర్మాణ స్థలం వద్దకే సరఫరా చేస్తామన్నారు.
    ప్రతి నియోజక వర్గానికి అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్, ప్రతి జిల్లాకి ఒలింపిక్ స్థాయి ట్రైనింగ్ సెంటర్, 6వ తరగతి నుండీ సైనిక శిక్షణ, కాలేజీలలో ఎన్.ఎస్.ఎస్.లో భాగస్వామ్యం అయ్యల విద్యార్థులను ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే జై భారత్ నేషనల్ పార్టీ ని గెలిపించాలని పిలుపు ఇచ్చారు.

КОМЕНТАРІ •