మధుపాయీ ఓ మధుపాయీ / వేదవతి ప్రభాకర్ గారు/ డా.బోయి భీమన్న గారు/ పాలగుమ్మి విశ్వనాథం గారు
Вставка
- Опубліковано 5 лют 2025
- రచన : బోయి భీమన్న గారు
సంగీతం : పాలగుమ్మి విశ్వనాథం గారు
గానం : వేదవతి ప్రభాకర్ గారు
మధుపాయీ ఓ మధుపాయి
మధువే పరమార్థమటోయి
పూవును విడిచి పూవును చేరి
మనసు తీరగా మధువును గ్రోలి
కమలిని ఒడిలో కన్ను మూయుటే
జన్మకు సాఫల్య మటోయి // మధుపాయీ//
పాత రోతయై కొత్త వింతయై
పాల పుంతలో పరుగులటోయి
ఎందు వ్రాలినా అందు నీకు
నా డెందమే అరవిందము కదటోయి
//మధుపాయీ//
గీతను పాడిన గోస్వామియే
నీ గీతికి హృదయ స్వామి కదోయి
నా హృదయ రస అద్వైత మూర్తివై
నా ఆర్తిని తొలగించ గదోయి //మధుపాయీ//