#NamaYogam
Вставка
- Опубліковано 6 лют 2025
- #Samavedam #ShanmukhaSarma #Namayogamday4
00:00:00 Start, Dhyana Slokas
00:02:25 Recap
00:08:00 Don’t leave ritual while doing nāmaṁ
00:29:05 Stages of nāmaṁ - Pronouncing (Phonate), processing(inquring), recollection
01:23:35 Daśa apacārālu, Ten sins
01:34:37 Who will be saved, and how many birth
01:44:32 Announcement
నామయోగము 4వ రోజు ప్రవచనాంతర్గతం:
నామము పలికే దశలు: ఉచ్చారణ, విచారణ, స్మరణ
1 ఉచ్చారణ: నోటితో పలికేది. దీనిలో మరలా రెండు, అమతిః పలుకుతున్నప్పుడు స్పృహలో లేకపోవడం, మతిః అంటే పలుకుతున్నాము అనే స్పృహలో ఉండడం. ఇది పుణ్యం కోసం, పాపము పోగొట్టుకోవడం కోసం చేస్తారు లేదా ఏదో కోరిక తీరడానికి. ఉదాహరణకి అచ్యుత అనంత గోవిందా అంటే సర్వరోగనివారిణి.
అభీష్టసిద్ధికి కూడా నామాలు పనిచేస్తున్నాయి. నామము విషయంలో ఎప్పుడు శంక కూడదు. అవి మనం తయారు చేసుకోలేదు కనుక, భగవంతుడి లక్షణాలు అన్నీ నామాలకు ఉంటాయి.
2 అర్థము భావన చేస్తూనో, రూపన్నో, లీలనో తలంచుకుంటే ఆనందం కలుగుతుంది కదా, అది ఇంకొంచం పై స్థాయి.
ఉదాహరణకి రామా అనగానే రాములవారు గుర్తు వచ్చాడు అంటే, ఆయన విగ్రహం, ఏదో ఒక లీలయో స్ఫురించుతూ ఉంటే నామము యోగం అవ్వడం ప్రారంభించడం మొదలయింది. నామము అనగానే ఆ రూపం తప్పక స్ఫురిస్తున్నది. మూర్తి స్ఫురణ ఎప్పుడైనా ధ్యానమే! ఛాయా మాత్రంగా స్ఫురించినా అది ధ్యానమే. ఉచ్చారణ క్రమంగా ధ్యానంలోకి వెళ్తున్నది. కాసేపయినా ప్రపంచాన్ని మర్చిపోవాలి. నామము పట్టుకుంటే భగవంతుడు కదిలి వస్తాడు లీలలతో పాటు.
స్పృహతో నామము అంటే శీఘ్రంగా వస్తాయి ఫలితాలు.
3 నామార్థవిచారణ స్మరణలోకి తీసుకువెళుతుంది.
ఉచ్చారణ, ధ్యానం క్రమంగా విచారణలోకి, స్మరణలోకి తీసుకు వెళతాయి. అపుడు పరిపూర్ణ దశ. ఇది ముక్తిని ఇస్తున్నది.
"నామస్మరణాత్ అన్యోపాయం నహి సంసారే భవతరణే" - స్మరణ వల్ల సంసారం నుండి తరిస్తావు అంటున్నారు, అదే మోక్షం.
ఉచ్చారణ నుండి స్మరణకి వెళ్ళాలి అంటే అది బలపడాలి అంటే విచారణ మధ్యలో ఉంటుంది.
విచారణ అంటే నామర్థము విచారణ చేయాలి. "తజ్జపః తదర్థభావనం" అన్నాడు పతంజలి. అర్ధాన్ని తెలుసుకుని దాన్ని ఆలోచించడమే విచారణ. ఎప్పుడైతే నామము అర్ధవిచారణ చేయడం మొదలు పెట్టామో అది "ఏకం అద్వితీయం బ్రహ్మ" అని తెలిసి భేదభావం పోతుంది. ప్రతీ నామర్థ విచారణ బ్రహ్మ విచారణయే! ధ్యానం జ్ఞానంలోకి వెళ్ళాలి.
ఎప్పుడైతే ఉచ్చారణ విచారణలోకి వెళ్లిందో ఆ విచారణ దృఢ పడాలి. ఆ విచారణ మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాలి, అది స్మృతిగా మారిపోవాలి, అప్పుడు స్మరణ అవుతుంది.
ఉచ్చారణ - విచారణ - స్మరణ - ముక్తిహేతువు.
నామయోగసాధకులు గుర్తు పెట్టుకోవలసినవి ఆ క్రింది నామాపచారాలు చేయరాదు అని:
సన్నిందాఽసతి నామవైభవ కథా: శ్రీశేయోర్భేదధీ:అశ్రద్ధా శృతిశాస్త్రదేశిక గిరాం నామ్న్యర్థవాద భ్రమః
నామస్తిఇతినిషిద్ధవృత్తివిహిత త్యాగౌచ ధర్మాంతరై: సామ్యం నామని శంకరశ్చ హరే: నామాపరాధా దశా
1) సత్పురుషులను నిందించరాదు (ఎవరినీ నిందించకుండా ఉండడం మరీ మంచిది)
2) అసతి నామవైభవ కథా: అసత్పురుషుల వద్ద నామము గొప్పతనం చెప్పరాదు ఎందుకంటే వాడు
అవహేళన చేస్తాడు కనుక. భగవద్విముఖులే అసత్పురుషులు. వారు నీకున్న శ్రద్ధ కూడా పాడు చేస్తారు. సాధన దశలో వీరితో తిరగకపోవడం మంచిది. చిన్న మొక్కకు కంచె అవసరం, అది మహావృక్షం అయ్యాక ఫరవాలేదు.
3) శ్రీశ ఈశయో: భేద ధీ: - విష్ణువుకు శివునకు భేదము చూపరాదు.
4) శృతివాక్యములయందు అశ్రద్ధ
5) శాస్త్రవాక్యములయందు అశ్రద్ధ
6) దేశిక వాక్యములయందు అశ్రద్ధ
7) నామ్ని అర్థవాద భ్రమః - నామము గొప్పతనము యందు అర్థవాద భ్రమ కలిగి ఉండడం
నామము చేస్తున్నాను కదా ఫరవాలేదు అని 8) శాస్త్ర నిషిద్ధములైనవి చేయడం (శాస్త్రములో కూడదు అని చెప్పినవి చేయడం) 9) శాస్త్రము చేయమన్నవి చేయకుండా ఉండడం
10) నామమును ఇంకో ధర్మంతో పోల్చరాదు. ఎన్ని ధర్మాలైనా నామముతో సరికావు.
Sri Guruvu gariki padabhivandanamulu 🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏
మా అమ్మ ఎప్పుడూ భక్తికీర్తనలు పాడుతూ ఉండేది.చివరికాలంలో పూర్తిగా కృష్ణుని భజన చేసుకునేది.ప్రాణంపోయే 10నిముషాలముందు ఆవిడకి తెలిసింది.కృష్ణుని భజన చేస్తూ తేలికగా ప్రాణం వదిలింది.అలాంటి చల్లని అమ్మకు కూతురిని అవడం పూర్వజన్మ పుణ్యం.ఇప్పుడు ఈ గురువుగారి ప్రవచనాలను వింటున్నానంటే అమ్మ నాటిన భక్తి వల్ల
గురువు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం మా శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ సామవేదమ్ షణ్ముఖ శర్మ గారు..
Guru paada padmamulaku namassumanjali...enta prayatnistunna inka swakutumbam pai mamakaaram povadam ledu swamy...chala kashtamgane undi....Rajasa bhaktilone inka unnannu ...satwika bhaktini prasadinchamani aa paramatmani naa sreeramunni ella velala prardhistunna
Jai sriram
44:36 super explaining
నామ సంకీర్తనం యస్య
సర్వపాపప్రణాశనమ్
ప్రణామో దుఃఖశమనః
తం నమామి హరిం పరమ్
శ్రీరామ🙏
ఇత్థంభూతగుణో హరిః. ఆతండట్టివాడు నవ్యచరిత
Narayana🙏
Dattadigambara
Hari nama mahima@1:04:10 and 1:09:00
Jai anjaneya danyavadalu guruji
jai sri Ram.Rama rama Ram.Om Namaha Shivaya.Sri Lalitha.
🌺శ్రీరామరక్ష🌺
🙏🙏🙏🙏🙏
కృతజ్ఞతలు గురువు గారు
Namasthe. Guruji
Srigurubyonamaha 🙏🏻🙏🏻🙏🏻
🙏 🙏 🙏 🌺 🌺
We are getting so many ads. As I never see ads before though
Hi
Ads are very annoying