దేవతార్చన చేయరా ముందు దేవుళ్ళు తల్లిదండ్రులు/తెలుగు లిరిక్స్/గానం:రుక్మాగద రెడ్డి గారు/sr naidu tv

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • telugu lyrics #sr naidu tv రాయినిపల్లె భజన పోటీలు /దేవతార్చన చేయరా ముందు దేవుళ్ళు తల్లిదండ్రులు / గానం : రుక్మాగద రెడ్డి గారు
    ____________________________________________
    ప: దేవతార్చన చేయరా దేవుళ్ళు తల్లిదండ్రులు
    తీర్ధయాత్రలు ఏలరా దివ్య క్షేత్రాలే తల్లిదండ్రులు
    చ: నీ బాల్యమున వారు
    నీ ప్రాణమైనారు
    నీ ఆశల వారు రా
    నిండి పండైనారు రా ॥ దేవతా ॥
    చ: అండ బాసిన నాడు
    పిండ కూడది యేల.. అయ్యో-2
    తిండి వేలకు పెట్టరా వారి
    దండి సేవలు చేయరా. || దేవతా ||
    చ: ఎలుకా ఫైనా ఎక్కి .....
    ఎల్లలోకములందు
    తల్లిదండ్రుల జూచెరా
    గణపయ్య పుత్రుండనిపించెరా. || దేవతా ||
    చ: కావడొక్కటి కట్టి
    కన్నవారిని మోసి -2
    అందులైన వారికీ శ్రవణుండు
    అన్ని తానై జూచెరా ‌‌ || దేవతా ||
    చ: తండ్రి మాటను నిలుప
    దరులందు నివసించి
    రాజ్యభోగములీడెరా ధశరత
    తనయుండు శ్రీరాముడు. || దేవతా ||
    చ: ఇంటి లోపల పెద్దా
    జంట ఊయల కట్టి
    ధర్మవ్యాదుడు ఊపుచూ
    తల్లిదండ్రుల కృపకు పాత్రుండాయెరా || దేవతా ||
    చ: శంతన తనయుండు
    శబదమొక్కటి భూని
    బ్రహ్మచారిగ మిగిలెరా
    భీష్మండు బ్రహ్మచారిగ మిగిలేరా ||దేవతా ||

КОМЕНТАРІ • 19

  • @govardhangoud4107
    @govardhangoud4107 Рік тому +3

    కొన్ని పాటలు కొందరే పాడాలి. ఈ పాటను మీరే పాడాలి. ఈ పాటను మీ కొరకే రాసినట్లుంది అన్న.

  • @vigneshgoud7500
    @vigneshgoud7500 4 місяці тому +2

    అన్న గారూ చాలా బాగా పాడారు ధన్యవాదాలు... లిరిక్స్ పెట్టండి 🎉🎉🎉🎉

  • @user-uj8vq7fb2p
    @user-uj8vq7fb2p 29 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs Рік тому +1

    ❤ heart full song very nice

  • @user-bp9ml1uc7u
    @user-bp9ml1uc7u Місяць тому

    సూపర్ సాంగ్ బాగుంది
    రిలేక్సీ పెట్టండి సర్

  • @MohanManarthi
    @MohanManarthi Місяць тому +2

    లీరిక్స్ పెట్టండి

    • @srnaidutv6516
      @srnaidutv6516  Місяць тому +1

      Ok

    • @srnaidutv6516
      @srnaidutv6516  28 днів тому +1

      anna లిరిక్స్ పెట్టాను చూడగలరు

  • @_i_am_ur_mr_srikanth_8106
    @_i_am_ur_mr_srikanth_8106 3 місяці тому

    Dani artham mottam cheppara... 😢😮🎉

  • @Radhakrishna-st8dr
    @Radhakrishna-st8dr 3 місяці тому

    This song written by Sri K.Raghu Ramulu Goud garu Kalwakurthy

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 3 місяці тому +2

    లిరిక్స్ పెట్టండి బ్రో
    🙏🙏🙏

    • @srnaidutv6516
      @srnaidutv6516  28 днів тому

      భక్తులు గమనించగలరు ఈ పాటకు లిరిక్స్ పెట్టాను చూడండి.

  • @Radhakrishna-st8dr
    @Radhakrishna-st8dr 3 місяці тому

    Kolla poor kadu Kalwakurthy.Reddy garu.

  • @user-bp9ml1uc7u
    @user-bp9ml1uc7u Місяць тому

    సర్ రిలేక్సీ పెట్టండి

    • @srnaidutv6516
      @srnaidutv6516  28 днів тому

      అన్న లిరిక్స్ పెట్టాను చూడగలరు

  • @chandakababurao8623
    @chandakababurao8623 2 місяці тому +2

    పాట బాగా పాడారు దయచేసి పాట లిరిక్స్ పాటకు తగ్గ రాగము తెలపగలరు

    • @srnaidutv6516
      @srnaidutv6516  2 місяці тому

      అన్న త్వరలో గాయకుడిని అడిగి తప్పకుండా లిరిక్స్ పెడతానని చెబుతున్నాను.