Asamanudu అసమానుడు Full song Lyrics | Telugu Christian Song | Pas.David Varma | Chinny Savarapu

Поділитися
Вставка
  • Опубліковано 21 січ 2025

КОМЕНТАРІ • 1

  • @ChristianMusicBank
    @ChristianMusicBank  23 дні тому +2

    Lyrics:
    అసమానుడైనవాడు - అవమానపరచడు నిన్ను
    ఓటమి ఎరుగని మన దేవుడు - ఓడిపోనివ్వడు నిన్ను
    ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు
    కష్టకాలమందు నీ చేయి విడచునా
    అసాధ్యములెన్నో దాటించిన నాథుడు
    శ్రమలో నిన్ను దాటిపోవునా
    సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
    కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును (2)
    1. అగ్ని గుండములో నెట్టివేసినా
    సింహాల నోటికి నిన్ను అప్పగించినా
    శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా
    సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచినా
    నాకే ఏల శ్రమలంటూ కృంగిపోకుమా
    తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై (2)
    శత్రువు చేతికి నిను అప్పగించడు (2) (సియోను)
    2. పరిస్థితులన్నీ చేజారిపోయినా
    ఎంతగానో శ్రమపడిన ఫలితమేమి లేకున్నా
    అనుకున్నవన్నీ దూరమైపోయినా
    మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
    మారదీ తలరాతని దిగులుపడకుమా
    మారాను మధురముగా మార్చును నీకై (2)
    మేలులతో నిను తృప్తిపరచును (2) (సియోను)
    3. ఒంటరి పోరాటమే విసుగురేపినా
    పొందిన పిలుపే భారమైపోయినా
    ఆత్మీయులందరు అవమానిస్తున్నా
    నమ్మదగిన వారులేక నిరాశతో నిలిచినా
    పిలుపునే విడచి మరలిపోకుమా
    న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను (2)
    పిలిచిన దేవుడు నిను మరచిపోవునా (2)