పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి తుమ్మల | Minister Tummala Inspected to Peddavagu Project

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఇటీవల భారీవర్షాలకు గండిపడ్డ పెద్దవాగు ప్రాజెక్టును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పెదవాగు ఆనకట్టకు పడిన గండ్లు, వాటి వల్ల తలెత్తిన పరిణామాలపై అధికారులతో ఆరా తీశారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టడంపై ఇంజినీర్లతో సమీక్షచేశారు. మంత్రిని కలిసిన ఆయకట్టు రైతులు కేవలం ప్రాజెక్టు అధికారులు నిర్వహణలో చూపిన నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడిందని వాపోయారు. వారి అలసత్వం వల్ల పంటలు నష్టపోయామని, మళ్లీ ఎప్పటికీ కోలుకుంటామో తెలియని పరిస్థితి ఉందని ఆవేదన చెందారు. వారిలో ధైర్యం నింపిన మంత్రి తుమ్మల...సమస్యకు త్వరితగిన పరిష్కారం చూపుతామంటూ భరోసా కల్పించారు. వరదల్లో ఇళ్ళు కొట్టుకుపోయిన వారికి తక్షణం అత్యవసర సహాయాన్ని అందజేయాలని కలెక్టర్ ని ఆదేశించారు. 42 ఇళ్ళు కొట్టుకుపోయినా.. తమ గోడు వినిపించునే నాథుడే లేరని బాధితులు మంత్రి ఎదుట వాపోయారు. అందరికీ తప్పకుండా న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ •