మా బుజ్జక్క GREAT | MAA BUJJAKKA GREAT | LB Sriram He'ART' Films | Heart Touching Short Film 2019

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... 'అక్క' అమ్మతో సమానం!
    'తమ్ముడు' కొడుకుతో సమానం!
    తమ్ముడూ! ఈ పండక్కి--
    అక్కకి 'చీరా-జాకెట్టూ' పెట్టు!!
    నీ బతుకు బాగుండకపోతే ఒట్టు!!
    please do watch and 'share' your 'THOUGHT'..!!
    CAST
    L.B. SRI RAM
    SURABHI PRABHAVATHI
    K YAMINI DEVI
    T SHAMITA
    B SATVIK
    STORY
    ALLURI GOWRI LAKSHMI
    DOP
    A.REVANTH
    EDITOR
    BALU UNGARALA
    TECHNICAL DIRECTOR
    RAJESH R.B
    MUSIC
    PVR RAJA
    ASST DIRECTORS
    MAHMED RAFEE S
    RAJ BHARATH
    KUNDAN YADAV K
    V.NARENDRA NATH
    SUB TITLES
    KUNDAN YADAV K
    PRODUCER SCREEN PLAY DIRECTION
    L.B. SRI RAM
    You may like our other telugu short films :
    1. LB Sriram's "Breakup" Latest Telugu Short Films 2018
    • LB Sriram's Breakup La...
    2. LB Sriram's "Endaro Mahanubavulu" Latest Telugu Social Message Short Film
    • LB Sriram's Endaro Mah...
    3. "Ye Perutho Pilichinaa" New Telugu Short Emotional Film 2017
    • L B Sriram's Ye Peruth...
    4. LB Sriram's Most viewed "Dolu Sannayi" | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films
    • LB Sriram's Dolu Sanna...
    5. LB Sriram's Latest Telugu Short Film "Maa Nanna" : LB Sriram heart Touching Films
    • LB Sriram's Maa Nanna ...
    6. LB Sriram He'ART' Films : Latest Nice Telugu Short Film 2017 "Panduga"
    • LB Sriram's Panduga పం...
    7. LB Sriram's "Prasadam" Latest Telugu Devotional Short Film 2017 | LB Sriram He'ART' Films
    • LB Sriram's Prasadam ప...
    8. LB Sriram Best Devotional He'ART' Films "Devudu"
    • LB Sriram's Devudu దేవ...
    9. Latest LB Sriram Emotional Telugu He'ART' Film "Nurse"
    • LB Sriram's Nurse నర్స...
    10. LB Sriram's Latest Telugu He'ART' Film 2018 "Premikudu" (The Lover)
    • LB Sriram's Premikudu(...
    Subscribe:
    / @lbsriram6916

КОМЕНТАРІ • 788

  • @vijayakrishna07
    @vijayakrishna07 5 років тому +90

    DD లో ఇదివరకు చిన్నప్పుడు వచ్చే ధారవహికలా ఉన్నాయి. సూపర్ శ్రీరామ్.

  • @mvvprasad7176
    @mvvprasad7176 5 років тому +440

    పక్షి ఎప్పుడు గుట్లొ వుంటే గుబులుగా వుంటుంది , ఆకాశంలో ఎగురూతు వుంటే ఆరోగ్యం గా వుంటుంది

    • @NareshKumar-qe5jo
      @NareshKumar-qe5jo 5 років тому +6

      100% nijam

    • @kashni
      @kashni 5 років тому +8

      Okka line lo enta pedda satyam chepparu..

    • @lokeshkuchellapati8682
      @lokeshkuchellapati8682 5 років тому +4

      Same dialogue touched me also..😘

    • @jjsatyanaryanajala4427
      @jjsatyanaryanajala4427 5 років тому +3

      Super word sir heart full touching film thanku sir

    • @sivakumar-gm9me
      @sivakumar-gm9me 4 роки тому +4

      పక్షి ఎప్పుడు గూటిలో వుంటే గుబులుగా వుంటుంది... ఆకాశంలో ఎగురుతూ వుంటే ఆరోగ్యంగా వుంటుంది....

  • @rajghopall9588
    @rajghopall9588 5 років тому +283

    పూజ్యులు ఎల్బీ శ్రీరామ్ గారికి,
    నా కళ్ళ వెంబడి నీళ్లు ఆగడం లేదు. మానవ సంబంధాల మీద మీరు తీస్తున్న ఈ లఘుచిత్రాలు "లఘుచిత్రాలు" కానే కావు. "ఘన చిత్రాలు". ఈ చిత్రాన్ని చూసి చాలామంది కళ్ళు తెరుచుకుంటాయి అనుకుంటాను.. మీరు మరిన్ని మంచి చిత్రాలను తీయాలి. హ్యాట్సాఫ్ టు యు సర్☀️🍋🌺🙏

    • @tadigadapasatyasriramachan1570
      @tadigadapasatyasriramachan1570 5 років тому +4

      బాగుంది...మానవ సంబంధాల మీద మంచి ప్రయత్నం.. నాదో చిన్న మనవి 1.పూర్తిగా తెలుగు పద ప్రయోగమే బాగుంటుంది కదా.ఆంగ్ల పదజాలం వాడకుండా ఉంటేనే మంచిదని మనవి.2. అసలు ఇలా అందరూ ఉండి ఒంటరిగా ఉన్న మహిళల శాతం ఈ మధ్య కాలంలో పెరిగి పోతోంది..దీనికి కలిసి వుండే పరిష్కారమే లేదా..ఇలా ఒంటరిగా ఎవరో వస్తారని ఎదురు చూస్తుండవలసిందేనా...

    • @ramulukka4280
      @ramulukka4280 5 років тому +1

      @@tadigadapasatyasriramachan1570 c

    • @NagadurgaraoTamarapalli
      @NagadurgaraoTamarapalli Рік тому

      నేను మా అక్కతో

    • @athmaramarao9323
      @athmaramarao9323 4 місяці тому

      Meeru cheppindi aksharala nijam andi. This type of short films inka ravalani korukundam

  • @sureshpadala1333
    @sureshpadala1333 2 роки тому +2

    Naaku kanneellu vachhay... Very nice..

  • @ramapamireddy4495
    @ramapamireddy4495 2 роки тому +49

    మరుగై పోతున్న అనుబంధాలని మళ్ళీ ఈ తరం వారికి పరిచయం చేస్తున్నారు శ్రీరామ్ గారు. ధన్యవాదాలు🙏🙏

  • @laxmikumark8884
    @laxmikumark8884 5 років тому +9

    మీరు అప్పట్లో ఎప్పటికి మర్చిపోని పాత్రలు చేశారు ఇప్పుడు ఈ రకంగా ప్రజలకి మరింత చేరువవు తున్నారు సర్....ఇలాంటి ఎన్నో గుండెకు చేరువయ్యే సినిమాలు మీరు మరెన్నో తీయాలని మన:స్ఫూర్తిగా కోరుకునే ఒక అభిమాని...

  • @mylifemelodies2110
    @mylifemelodies2110 Рік тому +3

    ఒక మనిషిని ఉన్నది ఉన్నట్లు ఇంకో మనిషి అర్ధం చేస్కుని , మంచిగా మసలగలిగే రోజులు ఇప్పుడే లేవు ఫ్యూచర్ లో కూడా రావనుకుంటా..

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 2 роки тому +23

    ఇదివరకు ఇది జీవితం.
    ఇప్పుడు కళ్ళు తడి చేసే జీవన సత్యం.
    కానీ నేను అలాంటి బుజ్జక్క గా ఉన్నందుకు చాలా సంతోషం.అధ్భుతం L.B.garu .ఇటువంటి tonics అవసరం. అందుకోండి అభినందన మందారమాల.

  • @TheSavithChandra
    @TheSavithChandra 5 років тому +165

    అమ్మ అక్క ఆప్యాయత అనురాగం ఆవకాయ అద్భుతం అన్ని ఆ తో నే మొదలు అవుతాయి

  • @ganapthirao5048
    @ganapthirao5048 5 років тому +41

    హృదయాన్ని పిండేసే లా సినిమా తీశా వు గురువుగారు నేటి యాంత్రిక జీవితాన్ని ప్రేమ ఆప్యాయతలు ఉట్టి పడేలా హృదయాన్ని తాకే ల తీశావు ధన్యవాదములు గురువుగారు

  • @sriramarangavalli9192
    @sriramarangavalli9192 2 роки тому +2

    Chala bagundi ... meru enka elanti vi cheyandi ... chala happyga vundi .. chusthunty old days gurthuku vachai

  • @భరత్-వ6త
    @భరత్-వ6త 5 років тому +24

    యల్ బి శ్రీరాం గారు ఈ కాలంలో సినిమా కి పిల్లలతో వెల్లలేక పోతన్నాం కాని మీ వీడియో స్
    మా ఫ్యామిలీ అంతా కలిపి చూస్తాం మీకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు

  • @Lakshmis-du6bfmanaswidu6bf
    @Lakshmis-du6bfmanaswidu6bf 4 роки тому +35

    సహజత్వం ఉట్టిపడేలా జీవితంలో సంబంధాలకు ఉన్న విలువల్ని సమాజానికి అందించడంలో మీకు మిరే సాటి LB శ్రీరామ్ గారు.

  • @saikrishnakantamani8291
    @saikrishnakantamani8291 4 роки тому +5

    అయ్యా భద్రం గారు మరల మా చిన్న నాటి రోజులు గుర్తు చేసారు సెలవులకు మా పెద్దమ్మ వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం.అక్కడ మాకు బుడం బియ్యం తో మా పెద్దమ్మ కొత్త ఆవకాయ తో ముద్దలు తినిపించేది.దన్యవాదములు ఇంకో ఐదువందల చిన్న చలన చిత్రములు సృష్టించాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @victordpo2024
    @victordpo2024 3 роки тому +5

    నాకు తెలిసి మీ సమయాన్నీ, జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని అనుకుంటున్నా..

  • @daydreamers1878
    @daydreamers1878 Місяць тому +2

    loved it sir, Extra ordinary performance

  • @madhavipullela4578
    @madhavipullela4578 4 роки тому +9

    నా అన్నదమ్ములు కూడా ఇంతే ..ఇలాగే వుంటారు❤️

  • @ankalaiahankalaiah8875
    @ankalaiahankalaiah8875 2 роки тому +8

    కరుడుగట్టిన, కటిక మహారాజుల కై న, కన్నీళ్లు తెప్పించే, కన్నీటి, శుభాశీస్సులతో నా నమస్కారములు..L""""B.... SAR

  • @tvschaitanyachaitanya9931
    @tvschaitanyachaitanya9931 2 роки тому +3

    పాత రోజుల్లో ఇలానే వుండేవారు greate films

  • @rameshbadugu5332
    @rameshbadugu5332 5 років тому +9

    మనిషి ఎప్పుడూ గూట్లో ఉంటే గుబులుగా ఉంటుంది.. ఆకాశంలో కూడా ఎగురుతూ ఉంటూనే ఆరోగ్యం గా ఉంటుంది

  • @U.c.k.999
    @U.c.k.999 Рік тому +2

    తర్వాణి అన్నం తిని చాలా ఏళ్ళు అయ్యింది ఆకుండా లోంచి అన్నం తీస్తుంటే ఒక్కసారిగా తర్వాణీ అన్నం గుర్తువచ్చింది నోరూరింది👌🙏

  • @annammamarneni4267
    @annammamarneni4267 2 роки тому +2

    మా అమ్మ కూడా అంతే మనవాళ్ళు నీ .మనవరాళ్ళనీ చుట్టూ కూర్చో పెట్టుకొని తినిపించేది

  • @sangeethaagga6169
    @sangeethaagga6169 3 роки тому +3

    ఈ వీడియో నేను చాలా సార్లు చూసాను అయినా ఇంకా చూడాలి అనిపిస్తుంది

  • @swathigottemukkala8539
    @swathigottemukkala8539 Місяць тому +1

    Nice ❤

  • @abhimerugu
    @abhimerugu 5 років тому +27

    Excellent heart film sir
    నా ఎదను తాకింది
    మీకు ధన్యవాదములు సార్

  • @banalanagarajaachari9409
    @banalanagarajaachari9409 Рік тому +2

    మా ఉమక్క కూడా ఇంతే...👍🙏💐

  • @banalanagarajaachari9409
    @banalanagarajaachari9409 Рік тому +13

    పక్షి ఎప్పుడూ గూట్లో వుంటే గుబులుగానే ఉంటుంది......... మాటలు..అద్భుతం 👌👌👏👏🙏🙏🙏🙏💐 గురువుగారు

  • @krishnakumarirokkam8307
    @krishnakumarirokkam8307 5 років тому +27

    బావుంది సర్ మీ బుజ్జక్క
    ఆవకాయ అన్నం తిన్నంత తృప్తిగా ఉంది.

  • @Nagalakshmi-hj3nt
    @Nagalakshmi-hj3nt 3 роки тому +2

    Aa aaapyaayata asali manasulo ilantivi ennunnayo okati mastram chudagaligaamu love you heart films❤️

  • @munnasurendra1762
    @munnasurendra1762 4 роки тому +14

    సార్ మీరు చాలా ఉపయోగకరమైన సమాచారం చెబుతున్నారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు , మీకూ ఏమీ ఇచ్చి తిర్చుకోవడం మీ రుణం , ఒక్క మీరూ ఎప్పుడూ అయ్యు ఆరోగ్యాలతో కలకాలం బాగుండాలి అని తప్పా సర్ , మీ లా జీవించాలి అని ఉంది సర్ అది మాకు సాధ్యము కాదు,

  • @Nagalakshmi-hj3nt
    @Nagalakshmi-hj3nt 3 роки тому +1

    Samsaaram haayigaa vundaalante kaneesam intiko sri ram please baadha vinte ne truptigaa vuntundi hata vidhi🌉

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika4895 2 роки тому +4

    సురభి ప్రభావతి అక్కా...
    మీతో కలిసి నటించే అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది...

  • @manikandregula251
    @manikandregula251 4 роки тому +28

    జీవిత సత్యాలను చిన్న చిన్న కధలతో చాలా బాగా చూపిస్తున్నారు సర్ 🙏

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 4 роки тому +5

    గుండె కోనల్లో చిన్న కుదుపుల మాటవిరుపు
    మనసున మల్లెల మాలలూగు మైమరపు
    కన్నుల వెన్నెల డోలలూగి
    ఎంతో హాయి గుండె నిండు
    కొమ్మల గువ్వలు గుసగుస
    రెమ్మల గాలులు ఊసులా
    అలలు కొలనులో గలగలలా
    దవ్వుల వేణువు సవ్వడిలా
    కొండంత తెలుగు సంస్కృతికి
    లంకంత భద్రాద్రి శ్రీరాముడి లఘు చిత్రాలు
    గోరంత ఉడతాభక్తి
    ఎంత హృదయంగమం
    వందనం అభినందనం
    యు ట్యూబ్ లో తిలకించి పులకించండి
    ఎల్ బి శ్రీ రామ్ షా(హా)ర్ట్

  • @naresh52
    @naresh52 2 роки тому +1

    నేను కూడా అక్కడే మీ మధ్యనే కూర్చున్నాను అనుకోని అయిపోయిన తరువాత సోఫా లోనుంచి లేచి వెళ్దామని తడుముకుంటున్నా....😊😊

  • @victordpo2024
    @victordpo2024 3 роки тому +1

    మేముండేది అమలాపురం..
    నేదునూరు దగ్గరే..

  • @munikrishnaiah9257
    @munikrishnaiah9257 4 роки тому +2

    లంక భద్రాద్రి శ్రీరాం గారికి, నమఃసుమాంజనములు,
    నేను మీ "మా బుజ్జక్క" షొర్త్ ఫిల్మ్ చూసినప్పటినుంచి, సద్ది అన్నం లొ అవకాయ తొ నువ్వుల నూనె లేద నెయ్యి వెసుకొని రొజూ తింటున్నాను.
    మన ప్రాచీనమైన అహరపు అలవాట్లను గుర్తుచేసినందుకు మీకు నా హ్రుదయపూర్వక నమస్కారములు.
    ఇట్లు
    ముని.......

  • @kolaveerabhadraswamynaidu1208
    @kolaveerabhadraswamynaidu1208 5 років тому +47

    అమ్మ అక్క అత్త చెల్లి వాళ్ళ విలువ ఈ తరం వాళ్ళకి మళ్ళీ గుర్తుచేశారు

  • @indrareddypalvai8531
    @indrareddypalvai8531 Рік тому +1

    Appudu chusina, anisarlu, chusina, ada great feeling 😊

  • @RaviKochana
    @RaviKochana 3 місяці тому +1

    ఎల్బీ శ్రీరామ్ గారు మీరు గ్రేట్ అండి

  • @sirich6033
    @sirich6033 5 років тому +27

    ఆ అభిమానాలు, ఆప్యాయతలు ఇపుడు ఎక్కడ ఉన్నాయి.. అన్నీ కను మారుగై పోతున్నాయి..ఆ పాత జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళారు🙏🙏 ఇలాంటి బుజ్జక్కులు గ్రేట్

  • @bhaskaraiahchintha6420
    @bhaskaraiahchintha6420 2 роки тому +1

    Maa sreeram great
    Maa Bujjamakka great great
    I'm very happy

  • @Mangavenkatvlogs
    @Mangavenkatvlogs Рік тому +1

    దబ్బ ఆకుల తరవాని (గంజి) అన్నం,కొత్తఆవకాయ చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి.

  • @abhinavchinthala4276
    @abhinavchinthala4276 2 роки тому +2

    సార్ మీరంటే నాకు చాలా అభిమానం సర్ మీ యాక్టింగ్

  • @banalanagarajaachari9409
    @banalanagarajaachari9409 Рік тому +1

    బంగారం లాంటి సందేశం,👌👏👏👍🙏🙏💐💐

  • @nagendra115
    @nagendra115 4 роки тому +8

    నట్టింట్లో నవ్వుతూ తిరిగే తోబుట్టువు అంత అందంగా ఉంటాయి శ్రీరామ్ గారు మీ నెట్టింటి చిత్రాలు....😊🙏🙏🙏

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden 2 роки тому +1

    ఇప్పుడు వచ్చే short films కి చాలా భిన్నంగా, హృద్యంగా ఉన్నాయి, ప్రతి మనిషి ఏదో ఒక వ్యాపకం ఉండాలి👍

  • @satyavalmiki5723
    @satyavalmiki5723 3 роки тому +3

    గురువూ గారు మంచి విందు భోజనం చేసిన తృప్తి కలిగింది🙏🙏🙏

  • @mohanpinninti8007
    @mohanpinninti8007 2 роки тому +1

    Sir మీ ప్రతి లఘుచిత్రం మామనస్సులను ద్రవింపజేస్తుంది మమ్మల్ని 1960లో ఉన్నట్లు భ్రమింపజేస్తుంది. నా ఉద్దేశ్యం సమాజపు విలువల్ని , కుటుంబ‌, స్నేహితుల బాంధవ్యలను తెలియజేస్తూ పాతసినిమాలు చూసినంత ఆనందాన్ని ఇస్తుంది . మీరు చేసే యజ్ఞంలో నేను ఒక సమిధనై ఉంటే బాగున్ను అనిపిస్తుంది అయినా పరవాలేదు హుష్ కాకి నాటికలో యువకుడి పాత్ర నేను ,నా స్నేహితుడు హుష్ కాకి అప్పారావు బిచ్చగాడి పాత్రలు వేసినందుకు చాలా సంతోషంగా ఉంది.

  • @jhetinmathiguddeti
    @jhetinmathiguddeti 5 років тому +65

    మాష్టారు మీరు పిల్లలతో పాటు పెద్దలకీ మంచి నీతిని బోధిస్తున్నారు మీకు 🙏🙏🙏

  • @rajeshsimhadri8342
    @rajeshsimhadri8342 3 роки тому +2

    స్వచ్ఛమైన తెలుగుని అచ్చంగా తెలుగులో వింటున్నాం.

  • @sunderj4774
    @sunderj4774 8 місяців тому +1

    Ultimate Portrayal of Human Emotions brought out by these actors Simply moving.Respects to L.B. Sriram Garu and the lady.

  • @Venkatvenkat-kv2ri
    @Venkatvenkat-kv2ri 2 роки тому +5

    హృదయానికి హత్తుకునే విధముగా ఉన్నాయి మీ అన్ని వీడియోలు

  • @rajeshvarig3780
    @rajeshvarig3780 Рік тому +2

    నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. హృదయానికి హత్తుకునేలా ఉన్నాయండీ.LB Sriram gari short films.chaala టాలెంటెడ్ ఆర్టిస్ట్

  • @sobhadevi181
    @sobhadevi181 5 років тому +5

    Tq sir బంధాల గురించి బాగా చెప్పారు. చూస్తుంటే మా అన్నయ్య లు గుర్తుకొచ్చారు.

  • @TheGsrkprasad
    @TheGsrkprasad Рік тому +1

    పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి
    సూపర్

  • @satyavani5925
    @satyavani5925 Рік тому +1

    Ee short film yennisarlu chusano lekkaledu. Adbhutam. L.b.sriram garu yenchukune subjects yeppudu goppagane untai. I'm a big fan of l.b sir

  • @bharathibodedda7280
    @bharathibodedda7280 Рік тому +1

    Present generation ki manchi message icharu sir... TQ andi..

  • @peramvijayanirmala591
    @peramvijayanirmala591 2 роки тому +1

    నమస్కారం సార్, చాలా బాగున్నాయి మీరు తీసే ఈ టెలీఫీల్మింస్

  • @kunanageswari9817
    @kunanageswari9817 2 роки тому +2

    Nijamga chala chala bavuntunnayi Sir mee short films ..heart touching.. Dialogues, action everything.. Manishini katti padesthinnayi..

  • @bvsraju5200
    @bvsraju5200 4 роки тому +4

    L.b Sri Ram garu meeru ఏడిపించిన పర్వాలేదు సినిమా superb.meeru ఇట్లాంటి cinemalu తీయాలని మనస్ఫూర్తిగా. కోరుకుఉన్టు న్నా ను.thank you. సో మచ్

  • @publicmint6692
    @publicmint6692 5 років тому +18

    ఇటువంటి short film తెస్తున్నందుకు నా హృదయపూర్వక నమస్కారాలు మరియు అభినందనలు..💐💐😊🙏🙏

  • @kongotisaikumar5842
    @kongotisaikumar5842 4 роки тому +4

    Okka short film lo ne maa generation ki chaala goppa vishayalu chepparu sir...
    Thank you very much sir..

  • @sivakumarmendraguthi154
    @sivakumarmendraguthi154 5 років тому +1

    Akka.... Amma tarvata place akkadi..... Chinna vayasu lone devudu ninnu maku dooram chesadu.... Mis u akkaaa......

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 5 років тому +2

    అన్నా చెల్లెలి అనురాగాన్ని అద్భుతంగా చెప్పేరు. అప్పటి కుటుంబాలలో అభిమానాలు, ఆప్యాతలు కళ్ళకు కట్టినట్టు
    చెప్పేరు. నన్ను గత స్మృతులను మళ్లీ జ్ఞాపకం చేసుకునేటట్టు చేశారు.
    ఎల్. బి.శ్రీరామ్ గారూ మీ ప్రతి షార్ట్
    ఫిల్మ్ లో ఏదో ఒక ప్రత్యేకత. మీ ప్రయాణం ఈలాగే కొనసాగాలని
    ఆశిస్తున్నాను. మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను.

  • @srinivas.v.2944
    @srinivas.v.2944 5 років тому +60

    మనిషి ఎప్పుడూ గూట్లో ఉంటే గుబులుగా ఉంటుంది.. ఆకాశంలో కూడా ఎగురుతూ ఉంటూనే ఆరోగ్యం గా ఉంటుంది..👌👌👌

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy7455 3 роки тому +2

    గతకాలపు ఆదరాభిమానాలు గుర్తుకొస్తున్నాయి

  • @KavithaRayala
    @KavithaRayala 5 років тому +36

    కథ చాలా బాగుందండి,నేటి రక్త బంధం రూపాయితో రణరంగం అయినది.మమత మరిచి మాట మరిచి సర్దుకుపోయే తత్వం మరుగున పడిపోయింది.కాలం బాధలను మా పుతుంది కానీ బంధాలను మనమే కలుపుకోవాలి.భావితరాల భవితవ్యం అనుబంధాల చిరునామాగా మారాలి.

  • @ravindrakumarveeramallu6819
    @ravindrakumarveeramallu6819 2 роки тому +1

    Chala bavundi. Nannu chinnathanam lo ki teesukuvellaru.Thank you L.B.Sriram garu

  • @mohithmayankthumma792
    @mohithmayankthumma792 3 роки тому +1

    మీ అంత కాకపోయినా నాక్కూడా కొద్ది గొప్పో...నాకు జ్ఞాపకాలు ఉన్నాయి....వాటిని మళ్లీ గుర్తు చేశారు...అండి గురువు గారు....నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను

  • @penamakuriradharani3906
    @penamakuriradharani3906 5 років тому +3

    😇😇నా చిన్నప్పుడు మా మేనత్త కూడా ఇలాగే పిల్లలందరికీ ముద్ద లు చేసి పెట్టేది . మళ్ళీ ఆ రోజులు గుర్తు చేశారు.

  • @dellibabu28
    @dellibabu28 2 роки тому

    great videos sriram garu.. comedy ne kadhu.. sentiment tho kuda yedipisthunnaru... gopppaa videos

  • @dasari9009
    @dasari9009 5 років тому +4

    గురువు గారు మీ లాంటి వారికోసమే ఈ యూట్యూబ్ వచ్చింది... అనిపించింది అండి మాకు ఇంత మంచి సినిమాలు చూసే బాగ్యం కలిగింది...

  • @gnani4148
    @gnani4148 5 місяців тому

    ఇలాంటి బంధువులూ నాకే అనుకున్నా అందరికీ ఇలాగేనన్నమాట ఏదైనా ఒకే గూటిపక్షులమన్నమాట.

  • @universetvtelugu7009
    @universetvtelugu7009 2 роки тому +2

    మిమ్మల్ని చూసి చాలా రోజులైంది తాతయ్య అసలు మీరు సినిమాల్లో కనిపించడం లేదు ఈ రోజు యూట్యూబ్ లో చూసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది 🙏

  • @dellibabu28
    @dellibabu28 2 роки тому

    abbaaa yeentha prasamthamgaa undho... alanati madhura gnapakalu..

  • @srinivasgoudsurvi3709
    @srinivasgoudsurvi3709 4 роки тому +5

    పాత జ్ఞాపకాలు మనసును కదిలించాయి

  • @psnarayana9242
    @psnarayana9242 5 років тому +19

    చిన్నతనంలో పిల్లలందరం ఆవకాయ కలుపుకొని తిన్న తరవాణి అన్నం గుర్తొచ్చింది.

  • @nvsubbarao5480
    @nvsubbarao5480 4 роки тому +3

    పోగొట్టుకున్నవి దొరికినప్పుడు ఉండే సంతోషం ఎంతో గొప్పగా ఉంటాది అలా ఉంది మీ బుజ్జక్క మీ ప్రేమలు ఆప్యాత అనురాగం ఈ చలనచిత్రం చూస్తే కలిగే మానసిక ఆనందం అనంతం
    L b శ్రీరాములు గారికి మా శత కోటి నమస్కారాలు

  • @nithyasreeneeharika
    @nithyasreeneeharika 4 роки тому +2

    🙏👌gd film

  • @satyapadmajaangaluri2407
    @satyapadmajaangaluri2407 2 місяці тому

    ఏదో కోల్పోయిన బాధ... ఆ అనుబంధాలు మాకేవి

  • @mandalalithasri2650
    @mandalalithasri2650 3 роки тому +2

    Asala intha manchi routine concepts
    Tho entho manchi telefilm chesthe deenini evarina dislike cheyagalara relationships penchukovalani teesina ee film superb👌👌👌👌👌
    Adhi inka ennisarlu cheppina chala takkuve

  • @mjkcreationsctr8974
    @mjkcreationsctr8974 2 роки тому +1

    Sir your every short film is giving message thank you

  • @lakshmijuluri2328
    @lakshmijuluri2328 Місяць тому

    SriRam garu chaalaa baagundi. Chetta cinimaalu eerojullo chuudaleka chasthunnaamu. Meemovies baaguntaayi. Missamma, Gundamma katha, Maya bazar, laanti navvukune , malli malli chuuse cinimaalu kooda maaku ivvandi. Daya chesi. Namasthe

  • @achari7186
    @achari7186 5 років тому +41

    ఆప్యాయతలతో తొనికిసలాడుతున్న మాబుజ్జక్క గ్రేట్ ఎక్స్ లెంట్ యల్ బి 👌👌👌🙏🙏

  • @mohithmayankthumma792
    @mohithmayankthumma792 3 роки тому +2

    ఇందులో మీ గొప్పతనం పనితనం...నిస్సందేహం..
    అయినప్పటికీ .. background music kuda ఎవరో గాని అద్బుతం గా ఇచ్చారు...good feel

  • @nareshbabu2764
    @nareshbabu2764 4 роки тому +2

    Na chinnapudu guruthukosthunai sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagasiromanich4981
    @nagasiromanich4981 3 місяці тому +1

  • @praveenkumar-fl1dq
    @praveenkumar-fl1dq 2 роки тому

    Lb sriram gari videos chuste na chinnappati days gurtostei, chala baguntei videos

  • @gundukarunasri8974
    @gundukarunasri8974 2 роки тому +3

    శ్రీరామ్ గారు చాలా బాగున్నాయి మీ short stories. సత్ససాంప్రదాయలను, అనుబంధాలను అటకమీద నుంచి తీసి అందముగా అల్మారా లో పెడుతున్నారు. మీకు చాలా కృతజ్ఞతలు.

    • @naresh52
      @naresh52 2 роки тому

      మీ ప్రసంశ చాలా బావుందండి కరుణశ్రీ గారూ...

  • @sunkarasreenivasarao
    @sunkarasreenivasarao 5 років тому +5

    చాలా హృదయం గా ఉంది అనేది చిన్నమాట శ్రీరాం గారూ. బుజ్జక్క కూడా జీవించారు. గాయాలకి నవనీతం పూసినట్లు మనసులో గూడు కట్టుకున్న భాధలకి ఉపశమనం

  • @pulipuli2416
    @pulipuli2416 Рік тому +1

    కళ్ళల్లో నీళ్లు తెప్పించారు శ్రీరామ్ గారు

  • @sangeethaagga6169
    @sangeethaagga6169 3 роки тому +2

    సార్ ఇలాంటి వీడియోలు ఇంకా చేయండి మాకు ఇంకా చూడాలని ఉంది మీరెందుకు కొత్త వీడియోలు పెడతా లేరు

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 2 роки тому

    బంగారంలాంటి మాటలను మీ బుజ్జి అక్క తో పాటు మాకు కూడా చాలా బాగా తెలియజేశారు sir.

  • @sivapothukuchi4380
    @sivapothukuchi4380 Рік тому

    చాలా సరళంగా సున్నితంగా ఎలా బాధని మరిచిపోయి సంతోషాన్ని వెతుక్కోవాలో చూపించారు

  • @rajeshn5039
    @rajeshn5039 5 років тому +1

    బంధాలు బాంధవ్యాలు గురించి ఎంత చక్కగా చెప్తారు మీరు. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్న గురువుగారు

  • @KrishnaChakravarthyNarayanam
    @KrishnaChakravarthyNarayanam 4 роки тому +12

    heart touching..... and memories with my sisters again occupied in my heart

  • @Dr_Aparna
    @Dr_Aparna 5 років тому +6

    శ్రీరామ్ గారు,ప్రపంచం అంతా కొత్త వొరవిది పేరుతో సహజత్వం కొల్పుతూ,ఇప్పుడు వచ్చే అన్నీ వీడియోస్/మూవీస్ ప్రస్తుత ట్రెండ్ లోనే నడుస్తున్న ఈ తరుణంలో మీరు తీసే ప్రతి వీడియో మాకు మా చిన్న నాటి జ్ఞాపకాలను తిరిగి తెస్తున్నాయి.
    మా పిల్లల్ని కూడా ఆ రోజుల్లోకి తీఈసుకెళ్లగలుగుతున్నాము.
    ఆ అనుభూతుల్ని మాకు ఇలా ఈ రూపం లో అందజేస్తున్నారు.
    చాలా చాలా ధన్యవాదాలు.
    ఇంకా ఇవి ఎవరు miss avvakudadhu ani
    అందరికీ షేర్ కూడా చేస్తున్నాను.
    ఇలాగే మమ్మల్ని ఆనందింప జేస్తారని ఆశిస్తూ..
    🙏🙏

  • @sudhakarvugumudi4862
    @sudhakarvugumudi4862 2 роки тому

    శ్రీరామ్ గారికి నమస్కారం సార్ ఇలాంటి వీడియోల ద్వారా యూత్ (కుర్రవాళ్ళకు) కనువిప్పు కలిగేలా చేస్తున్న ఈ ప్రయత్నం లో సఫలీకృతులవ్వాలని మనస్పూర్తి గా కోరుకునే మీ వాడు. __సుధాకర్

  • @k.m.presents4606
    @k.m.presents4606 3 роки тому +3

    గురుదేవోభవ!చాలా బాగుంది గురువుగారు