చిటికెలో చేసే ఆలూ పాలక్ సబ్జీ ఫుల్కా చపాతీలోకి భలే ఉంటుంది | Aloo Palak Sabzi

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • చిటికెలో చేసే ఆలూ పాలక్ సబ్జీ ఫుల్కా చపాతీలోకి భలే ఉంటుంది | Aloo Palak Sabzi @HomeCookingTelugu
    బంగాళాదుంపలు, పాలకూర వేసి చేసే నార్త్ స్టైల్ ఆలూ పాలక్ సబ్జీ ఎంతో తేలిక చేసుకోగలిగే ఒక కూర. ఇది ఫుల్కా చపాతీల్లోకి చాలా కమ్మగా బాగుంటుంది. ఇదెలా చేయాలో చూసి తప్పకుండా ట్రై చేయండి.
    #aloopalaksabzitelugu #homecookingtelugu #dhabastylealoopalak
    తయారుచేయడానికి: 10 నిమిషాలు
    వండటానికి: 30 నిమిషాలు
    సెర్వింగులు: 4
    కావలసిన పదార్థాలు:
    బంగాళాదుంపలు - 6
    నూనె
    జీలకర్ర - 1 టీస్పూన్
    ఎండుమిరపకాయలు - 3
    ఉల్లిపాయలు - 2 (చిన్నగా తరిగినవి)
    అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్
    ఉప్పు- 1 టీస్పూన్
    పసుపు - 1/2 టీస్పూన్
    టొమాటోలు - 2 (చిన్నగా తరిగినవి)
    కారం - 1 టీస్పూన్
    జీలకర్ర పొడి - 1 టీస్పూన్
    గరం మసాలా పొడి - 1 టీస్పూన్
    నీళ్లు - 1/2 కప్పు
    ఉప్పు - 1 టీస్పూన్
    తరిగిన పాలకూర - 1 బౌల్
    నెయ్యి - 1 టీస్పూన్
    కసూరీ మేథీ - 1 టీస్పూన్
    తయారుచేసే విధానం:
    దుంపలని శుభ్రంగా కడిగిన తరువాత చిన్న ముక్కలుగా తరిగి, నీళ్లలో వేసి ఉంచాలి
    ఒక ప్యాన్లో నూనె వేసి అందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించిన తరువాత చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి అవి రంగు మారేంత వరకూ వేయించాలి
    ఇందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేయించిన తరువాత దుంపలు వేసి కలపాలి
    ఇప్పుడు రుచి కోసం ఉప్పు, పసుపు వేసి కలిపి, ఇంకొన్ని సెకన్ల పాటు వేయించాలి
    తరువాత తరిగిన టొమాటోలు వేసి, కాస్త మగ్గనివ్వాలి
    ఇందులో కారం, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి కలిపి, ముక్కలని ఇంకాసేపు వేగనివ్వాలి
    ఆ తరువాత కొన్ని నీళ్ళు పోసి, బాగా కలిపి, ప్యాన్కు ఒక మూత పెట్టి, కూరని పది నిమిషాలు ఉడికించాలి
    పది నిమిషాల తరువాత చిన్నగా తరిగిన పాలకూరను ప్యాన్లో వేసి, మూడు నిమిషాలు ప్యాన్కు మూత పెట్టి మగ్గనివ్వాలి
    ఇప్పుడు కూరలో నెయ్యి, నలిపిన కసూరీ మేథీ వేసి కలపాలి
    అంతే, ఎంతో రుచిగా కమ్మగా ఉండే ఆలూ పాలక్ సబ్జీ తయారైనట్టే, దీన్ని వేడి వేడిగా ఫుల్కా, చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
    Hello Viewers,
    Today, I am going to show you all an easy and interesting side dish recipe. This is Aloo Palak Sabzi. The main ingredients for this dish are potatoes and spinach leaves. This curry is dry in texture and can be made within half an hour roughly. This one is a great accompaniment for chapati, roti or phulka. It also goes well with mildly flavoured rice recipes like jeera rice, ghee rice or cashew rice. Make sure to prepare this curry at least once a week if you have kids who do not like to have leafy vegetables. In that case, this curry is a blessing. Due to its pleasing taste, nobody can complain about the leaves. So do try this amazing curry and enjoy with your family and friends.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 8