మిమిక్రీ కళాకారులు

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • నేరెళ్ళ వేణుమాధవ్ ( డిసెంబరు 28, 1932 - జూన్ 19, 2018 ) తెలంగాణకు చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు.వీరికి ధ్వన్యనుకరణ సామ్రాట్ అనే బిరుదు కూడా ఉంది. మొదట్లో చిలకమర్తి లక్ష్మీనరసింహం రాసిన ప్రహసనాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నా అప్పటి ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య, వేమూరు గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య తదితరుల సినిమాల ప్రభావంతో మిమిక్రీ కళపై మొగ్గు చూపాడు. 1947 నుంచి ఈయన మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు.ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. 1953 లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. కేంద్రప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. విశ్వనాథ సత్యనారాయణ, సినారె మొదలైన ప్రముఖులు తమ రచనలను ఈయనకు అంకితమిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ, జె. ఎన్. టి. యు, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. తిరుపతిలో ఈయనకు గజారోహణం, పౌరసన్మానం జరిగాయి. ఆయన స్వయంగా నేరెళ్ళ వేణుమాధవ్ సాంస్కృతిక సంస్థను స్థాపించి ప్రతి యేటా ఒక కళాకారుడిని సన్మానించాడు. హనుమకొండలో ఆయన పేరు మీదుగా డా. నేరెళ్ళ వేణుమాధవ్ కళాప్రాంగణం నిర్మించారు.

КОМЕНТАРІ • 11

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 4 місяці тому

    వీడియోలన్నీ చాలా బాగున్నాయి పాతరోజులని గుర్తు చేశాయిఆనాటి నటుల్లో కొందరు ఇప్పుడు లేకపోయినా వారి కీర్తి ఎప్పటికీ అజరామరంగా వుంటుంది

  • @deepumurali1072
    @deepumurali1072 8 місяців тому +4

    దుర్గా మేడం గారు ఇలాంటి వీడియోస్ పెట్టి మాకు పాత రోజులు గుర్తు చేస్తున్నారు మీకు చాలా ధన్యవాదములు ఇలాంటి వీడియోస్ ఇంకా పెట్టగలరని మనవి చేస్తున్నాను

  • @bapujiarcot1183
    @bapujiarcot1183 8 місяців тому +2

    మిమిక్రీకి పునాది వేసిన మహానుభావుడు ఆయన. ఒథెల్లో డైలాగులు ఆయనకే సాధ్యం.

  • @kundikishore
    @kundikishore 8 місяців тому +1

    So nice and so much funny 😅👌🏻👌🏻

  • @sanghamitra265
    @sanghamitra265 8 місяців тому +1

    Super 👌

  • @sastryjvs8365
    @sastryjvs8365 8 місяців тому +1

    I know very well

  • @karapaveerabhadrayyasastry1761
    @karapaveerabhadrayyasastry1761 7 місяців тому

    Really wonderful

  • @DURGA-xc3fi
    @DURGA-xc3fi 5 місяців тому

    ఇందులో.. రోగి-నర్సు బిట్ నేను ఆ రోజుల్లో డీడీ లో చూసాను😂.. మళ్లీ ఇన్నాళ్లకు! విజయ దుర్గ గారు థాంక్స్

  • @varunpalreddy438
    @varunpalreddy438 7 місяців тому

    Didn’t know KCR was a mimicry artist before venturing into politics ..