ఘనంగా పెందుర్తి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు

Поділитися
Вставка
  • Опубліковано 14 тра 2024
  • ఘనంగా పెందుర్తి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు
    టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖండవిల్లి లక్ష్మి ఆధ్వర్యంలో...
    జీవకారుణ్యసంఘం వృద్ధులకు
    రొట్టెలు,పండ్లరసం పంపిణి
    వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసిన పెందుర్తి కుమారుడు అభిరామ్
    రాజమహేంద్రవరం,మే15: రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు బుధవారం సాయంత్రం శ్రీ గౌతమీ జీవకారుణ్యసంఘంలో ఘనంగా నిర్వహించారు.టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి,ఏపీ హ్యూమన్ రైట్స్ ఎస్సీ సెల్ చైర్మన్, రాజమండ్రి సిటీ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఖండవిల్లి లక్ష్మి ఆధ్వర్యంలో జీవకారుణ్య సంఘం వృద్ధుల సమక్షంలో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకల్లో పెందుర్తి కుమారుడు‌ పెందుర్తి అభిరామ్ పాల్గొని కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా వృద్ధులకు, రోగులకు రొట్టెలు, పండ్లరసం పంపిణీ చేశారు.ఖండవిల్లి లక్ష్షి మాట్లాడుతూ తన రాజకీయ గురువు‌ మాజీ ఎమ్మెల్యే , టీడీపీ సీనియర్ నాయకులు పెందుర్తి వెంకటేష్ జన్మదిన వేడుకలు జీవకారుణ్య సంఘం వృద్ధుల మధ్య జరగడం సంతోషంగా ఉందన్నారు.తనను రాజకీయంగా ఎంతో ప్రోత్సాహించే వెంకటేష్ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎప్పుడూ ప్రోత్సాహిస్తారని‌ అందుకే జీవ కారుణ్య సంఘంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరిపినట్లు తెలిపారు.ఈ పుట్టినరోజు వేడుకలకు వెంకటేష్ కుమారుడు పెందుర్తి అభిరామ్ హాజరుకావడం తమకు మరింత ఆనందాన్ని కలిగించిందని ఖండవిల్లి లక్ష్మి అన్నారు. పెందుర్తి అభిరామ్ మాట్లాడుతూ తన తండ్రి పెందుర్తి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు సోదరి సమానురాలు ఖండవిల్లి లక్ష్మి ఆధ్వర్యంలో జీవకారుణ్యసంఘం వృద్ధుల మధ్య నిర్వహించడం సంతోషకరమన్నారు.పుట్టినరోజు వేడుకల్లో తమ్మినీడి టింకు, బెజవాడ దుర్గాప్రసాద్, బెజవాడ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

КОМЕНТАРІ •