కోలాహలంగా ఆదిరెడ్డి నామినేషన్‌

Поділитися
Вставка
  • Опубліковано 17 кві 2024
  • కోలాహలంగా ఆదిరెడ్డి నామినేషన్‌
    - వేలాదిగా తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
    - అందరి అభిమానానికి కృతజ్ఞుడను
    - ఇక్కడ 50 వేలకుపైగా మెజార్టీ నాదే... రాష్ట్రంలో అధికారమూ కూటమిదే
    - మీడియాతో ఆదిరెడ్డి శ్రీనివాస్‌
    రాజమహేంద్రవరం :
    రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ ` జనసేన ` బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్‌ గురువారం నామినేషjన్‌ దాఖలు చేశారు. తిలక్‌ రోడ్డులోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, వారి నివాసంలో సర్వమత ప్రార్ధనల అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య భారీ జన సందోహంతో తిలక్‌ రోడ్డు సాయిబాబా మందిరం దగ్గర నుంచి భారీ ర్యాలీగా శ్యామలానగర్‌, గోరక్షణపేట, జాంపేట, దేవీచౌక్‌ మీదుగా గోకవరం బస్టాండ్‌ సమీపంలోని నగర పాలక సంస్థ ఆవరణలో ఉన్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వారి కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళ మేయర్‌ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, రాజమండ్రి పార్లమెంట్‌ అభ్యర్ధిని దగ్గుబాటి పురంధేశ్వరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఆర్యాపురం బ్యాంకు మాజీ చైర్మన్‌ చల్లా శంకరరావులతో ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఆర్వో కార్యాలయానికి చేరుకుని పలు పత్రాలు పూర్తి చేసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వారికి తన నామినేషన్‌ పత్రాలు అందచేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కూడా నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వారికి సమర్పించారు.
    అందరి అభిమానానికి కృతజ్ఞుడను :
    రాజమండ్రి చరిత్రలో ఎన్నడు లేని విధంగా తన నామినేషన్‌ కార్యక్రమం జరిగిందని, తన నామినేషన్‌కు అశేషంగా తరలి వచ్చిన అందరికీ కృతజ్ఞుడను అని ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మీడియాతో అన్నారు. టీడీపీ ` జనసేన ` బీజేపీ పార్టీలకు చెందిన సుమారు 20 వేల మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అశేషంగా తరలివచ్చారని అన్నారు. ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం ఇవాళ తన నామినేషన్‌ సందర్భంగా కళ్లకు కట్టినట్టు కనిపించిందన్నారు. కూటమి అభ్యర్ధినైన తాను 50 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించబోతున్నానని ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. తన నామినేషన్‌ దృశ్యాలు మన రాజమండ్రి రీల్స్‌ స్టార్‌కు కనువిప్పు కలిగిస్తాయన్నారు.
    ఏం ముఖం పెట్టుకుని రాజమండ్రి వస్తున్నారు జగన్‌ :
    సంపూర్ణ మద్యపాద నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌ మహిళలను, రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు. మద్యపాన నిషేధం చేయకపోగా దానిపై వచ్చే ఆదాయంతోనే పాలన సాగించి, కల్తీ మద్యం, చెత్త బ్రాండ్లు తీసుకువచ్చి ప్రజల ప్రాణాలు తీశారని మండిపడ్డారు. ఇంకా ఏముఖం పెట్టుకుని రాజమండ్రి వస్తున్నారు జగన్‌ అని ప్రశ్నించారు.
    అబ్బబ్బే మా భరత్‌కు ఏం లేదు అనే మాటలు వద్దు..!
    రాజమండ్రి వస్తే వచ్చారు కానీ... అబ్బబ్బే మా భరత్‌ రామ్‌ వద్ద ఏం లేదు... చాలా పేద వాడు అనే మాటలు చెప్పొద్దని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ సూచించారు. పలు నియోజకవర్గాల్లో యాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో అక్కడి అభ్యర్ధులను పాపం మా వాళ్లకు దగ్గర ఏం లేదు... చాలా పేదవాళ్లంటూ జగన్‌ ఇలాగే వెనకేసుకు వచ్చారని గుర్తు చేశారు. ఇక్కడి రీల్స్‌ స్టార్‌ మార్గాని భతర్‌ రామ్‌ చేసిన అవినీతి తెలిసీ కూడా అవే పదాలు వాడొద్దంటూ హితవు పలికారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో 50 వేలకు పైగా మెజార్టీతో ఇక్కడ విజయం సాధిచేసి తానేనని, రాష్ట్రంలో అధికారంలోకి రానున్నది తమ కూటమేనని ఆదిరెడ్డి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.
    దారిపొడవునా పూల వర్షమే :
    నామినేషన్‌ వేసేందుకు భారీ జనసందోహంతో వెళ్లిన ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పువ్వులతో స్వాగతం పలికారు. తిలక్‌ రోడ్డులోని సాయిబాబా ఆలయం దగ్గర నుంచి గోకవరం బస్టాండ్‌ సమీపంలోని నగరపాలక సంస్థ కార్యాలయం వరకూ ఆయనకు పువ్వులతో స్వాగతం పలికారు. ఆయన వెంట అధిక సంఖ్యలో టీడీపీ ` జనసేన ` బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.

КОМЕНТАРІ • 1