Aascharyamaina prema ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ, UESI & Songs of Zion | Sam & Jessi

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • Songs of Zion : 151
    Vidhyarthi geethavali: 22 (13)
    ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ
    మరణము కంటె బలమైన ప్రేమది
    నన్ను జయించె నీ ప్రేమ (2) ||ఆశ్చర్యమైన||
    పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ
    నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే ||ఆశ్చర్యమైన||
    పావన యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ
    నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే ||ఆశ్చర్యమైన||
    శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ
    విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు ||ఆశ్చర్యమైన||
    నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని జూపిన ప్రేమ
    నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ||ఆశ్చర్యమైన||

КОМЕНТАРІ •