నెహ్రూ కి నివాళిగా బాల గంగాధర తిలక్ కవిత : ఖదిజ్ఞాసి విజయవిహారం రమణమూర్తి. 👇🏻👇🏻Full Video Link👇🏻👇🏻

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 10

  • @RajmanirajiRajmaniraji
    @RajmanirajiRajmaniraji 11 днів тому

    జై భారత్ .... భారతీయ విప్లవానికి కొనసాగింపు...
    మీరు కవిత చదువుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలని వుంది...,🙏🙏☝️☝️☝️☝️

  • @winieditz4875
    @winieditz4875 17 днів тому +1

    ఎంత అద్భుతమైన కవిత....
    ఈ వేళ పువ్వులన్నీ వాడిపోయిన రోజు..
    ఏకాంతంలో భూమి ధ్రువగళాలెత్తి ఏడ్చిన రోజు..
    తెల్లని పాపురం ఎండలో ..
    సొమ్మసిల్లిపోయింది...
    తల్లిలేని పిల్లల్ని నీడలోకి పిలిచేవాళ్ళు లేరు...
    సముద్రమధ్యంలో ఓడలో దిక్చూచి పనిచెయ్యడం లేదు..
    సర్వజనావళికి యాత్రాపథంలో సైన్పోస్ట్ కూలిపోయింది..
    చరిత్ర మిట్టమధ్యాహ్నంలో చలివేద్రం కనబడడం లేదు..
    నాగరికత నగరం మధ్య నడిరోడ్డుమీద మూర్ఛపోయింది...
    అన్నివిధాలా చెడ్డరోజని అన్ని పంచాంగాలూ ఒప్పుకున్నాయి...
    స్విన్ననయనం ఛిన్నహృదయం నేటి చిహ్నఁగా నిలిచిపోయాయి...
    అయిదు ఖండాల జిజ్ఞాసువులు ఆలోచనాంధకారంలో చిక్కుకున్నారు..
    అఖండ కాలనీల కూలంకష పొంగి అందమైన పట్టణాన్ని ముంచివేసింది..
    ఆకాశ ద్వారంలో అతనికి స్వాగత తోరణం కట్టారు..
    రణంలో..
    మరణంలో..
    అజేయుడైన యీ వ్యక్తి అమరుడన్నారు..
    అవనత మస్తకాలతో అశేష ప్రజానీకం అశ్రుతర్పణం చేశారు...
    అజరామరమైన అతని వాణి తరతరాలు వింటారు కలలు కంటారు...
    ఈ హఠాత్పరిణామంలో..
    ఎంత అర్థవిహీనమైపోయింది సర్వం..
    ఎంతగా కుంగి 'కో' యని విలపించింది నా హృదయం..
    ఎవరు చెప్పు యింతటి దాకా...
    ఈ భూవలయంమీద ఇంత హుందాగా ఇంత అందంగా..
    ఇంత గర్వంగా తిరిగిన మనిషి...
    ఎవరు చెప్పు ఈ విశాల గగనం మీద...
    ఈ దిక్కునుండి ఆ దిక్కుకు యింత అర్థవంతంగా...
    ఆగామి మానవ సంతతికి ఆదేశంగా ఆదర్శంగా...
    స్వర్ణాక్షర సంకేతాన్ని రచించిన మనీషి..
    ఎవరు చెప్పు యీ ప్రపంచ చరిత్ర తలుపు తట్టి...
    లోపలి చీకటిలో గదిగదిలో మూల్గులు వినవచ్చే ఎదఎదలో...
    ఆశా కర్పూర దీపాన్ని వెలిగించిన నవీన రాజర్షి...
    జ వ హ ర్
    నలభై ఐదుకోట్ల జనుల ప్రియతమ నాయకుడా...
    నీవు లేవనే తలపు రానివ్వలేక పోతున్నాను...
    నిద్దమైన ఈ..నిలువుటద్దం మీద పగులు చూడలేక పోతున్నాను...
    ఈ దేశంలో ఏ హృదయద్వారం తెరిచినా..
    సాలోచనగా జాలిగా గంభీరంగా నిలబడే నువ్వు..
    ఈ దేశంలో ఏ దారి మలుపు తిరిగినా
    అక్కడ నీ పదాంకం నువ్వు కట్టిన యిల్లు ధైర్యంగొలిపే నీ చిరునవ్వు..
    ఎలాగ నీ స్మృతినుండి పారిపోగలను..
    ఈ దుఃఖాన్ని మరచిపోగలను...
    మానవో త్తముడవు...
    మేరునగ ధీరుడవు...
    అకుంఠిత కార్యదీక్షాదీక్షితుడవు...
    అపుడే ఎలాగ విడిచిపోయావయ్యా...
    అసంపూర్ణ చిత్రాన్ని వదలి...
    అనిబద్దమాలికను వదలి...
    ఎలాగ కనుగిలికి తెర తొలగించి నిశ్శబ్దంగా నిష్క్రమించావు దిగ్భ్రాంతమైన దేశాన్ని విడిచి...
    దీన మానవాళిని మరచి...
    ---------------------------------
    ఆ తోటలో పువ్వులెప్పుడూ పూస్తాయి..
    అక్కడ నిత్య వసంతం..
    గడచిన శిశిరాన్ని తలచుకొని..
    గజగజ వణక దాచెట్టు అతడు..
    నిత్య యౌవనుడు..
    వర్తమానం పదునైన కత్తి..
    దానినొత్తి చీకటి మొదళ్ళు కోస్తాడు..
    భూతకాలం నూనెలో..తడిపిన వత్తి దాన్ని మెదిపి భవిష్యద్దీపాన్ని వెలిగిస్తాడు...
    చారిత్రక దృక్పథం అతనిశక్తి..
    సమ్యక్సిద్ధాంత రథ్యమీద రథాన్ని నడిపిస్తాడు..
    చరన్మౌఢ్య క్రూరమృగాల సంకులారణ్యంలో..
    సహేతుక సాహసం కవచంగా ధరించిన ఆఖేటకుడు..
    చలజీవన దై నందిన కోలాహల పాంసుపరాగంలో..
    తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు..
    అల వివేకానంద రవీంద్ర మహాత్ముల త్రివిధ పథగామి..
    అనిదంపూర్వ వసుధైక కౌటింబికుడు మహానాయకుడు..
    ప్రిన్స్ ఛార్మింగ్ డార్లింగ్ ఆఫ్ ది మిలియన్స్ వెళ్ళిపోతున్నాడు దారి నివ్వండి..
    స్వప్న శారికల అతని శిరస్సుచుట్టూ పరిభ్రమిస్తున్నాయి..
    మనవాడు జవహరుడు.. భారతభూషణుడు కదలిపోతున్నాడు..
    కన్నీరు విడువకండి..
    కోటికోటి ఎదల గులాబీలు అతని పాదాలు ముద్దిడుతున్నాయి...
    ప్రియదర్శనుడు నెహ్రూపండితుడు శాశ్వత నిద్రపోతున్నాడు
    సద్దు చేయకండి...
    విధుర వసుమతి మౌన విషాదగీత మాలపిస్తున్నది..
    జై జ వ హ ర్
    జైభారత్

  • @vamsichowdavaram
    @vamsichowdavaram 27 днів тому +2

    ఆ తోటలో పువ్వులు ఎప్పుడూ పూస్తాయి అక్కడ నిత్య వసంతం గడిచినశిశిరాన్ని తలుచుకొని గజగజ వణకదా ఆ చెట్టు అతడు నిత్య యవ్వనడు .. నెహ్రూ పట్ల బాలగంధర్ గారికి ఉన్న ప్రేమను కవిత్వం రూపంలో అద్భుతంగా వివరించారు..wonderful..☝️☝️

  • @Gallavoice
    @Gallavoice 23 дні тому +1

    💗💗💗🙏☝

  • @abdulsalarmuthavlli3107
    @abdulsalarmuthavlli3107 25 днів тому +1

    👍👍

  • @peddakallachannel5429
    @peddakallachannel5429 26 днів тому +1

    జై భారత్

  • @jaibharatananthapurteamg.k8356
    @jaibharatananthapurteamg.k8356 27 днів тому +1

    Jaibharat

  • @jkullayappa1911
    @jkullayappa1911 27 днів тому +2

    ☝️☝️jai bharat

  • @PrabhudasPrabhu-ee7oc
    @PrabhudasPrabhu-ee7oc 27 днів тому +1

    జైభారత్. ☝️☝️☝️