ADIVO LAKIMAMMA / అదివో లకిమమ్మ అహోబలేశ్వరుతోడ /AAV SERIES 05 EP 461/ NIHAL / SWAPNA / ABHERI

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024

КОМЕНТАРІ • 8

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  3 місяці тому +1

    NARASIMHA VIABHAVAM - EP - 08
    🌺🍃 ------------🍃🌺
    అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 461
    ( అదివో లకిమమ్మ అహోబలేశ్వరుతోడ .. )
    🌺🍃 ----------- 🍃🌺
    ఓం నమో వేంకటేశాయ. 🙏
    అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 461 కి శుభ స్వాగతం ..🙏
    ప్రార్థన ః--🌹🙏
    గరుడాద్రియు వేదాద్రియు
    నిరువంకల గొడుగుఁ బట్ట నిదిగో కొలువై,
    సరియైన జమళి వలె, యా
    నరసింహుడును లకిమమ్మ నవకాంతులతో !
    🌹🙏🌹
    ✍ స్వీయపద్యము ( కందము )
    🌹🌹
    ఇదిగో అహోబిలాన ,
    ఒకపక్క గరుడాద్రి ఇంకోపక్క వేదాద్రి గొడుగు పడుతున్న రీతిలో అమరి యుండగా ,
    సరియైన జంట వీరే అను విధముగా ,
    నారసింహుడు , శ్రీ మహాలక్ష్మి కొలువై ఉన్నారు నిత్య నూతన కాంతులను సదా ప్రసరింపజేయుచూ !🙏
    🌹🌹
    🌺🍃 ----------- 🍃🌺
    మున్నుడి ః--🌹👇
    అన్నమాచార్యులవారికి అహోబల లక్ష్మీ నారసింహుడనగా ఎనలేని భక్తి.🙏
    నారసింహునిపైనే ఎక్కువగా కీర్తనలు రచించారు శ్రీ వేంకటేశ్వరుని తరువాత .🙏
    ఈ అద్భుతమైన శృంగార సంకీర్తనలో శ్రీ మహాలక్ష్మి నారసింహుడూ కలిసి అహోబలమంతా తిరుగుతూ ,
    సాగిస్తున్న ప్రేమములను , శృంగారములనూ వర్ణిస్తున్నారు .🙏
    నిజానికి అహోబలమెంత దివ్యమైన ప్రదేశమంటే
    నవనారసింహమూర్తులే కాదు ,
    అక్కడి గరుడాద్రి వేదాద్రి కొండలు , ఆ కొండలలో ఉన్న తరువులూ, జలపాతాలు , భవనాశినీ నదీ తీరము ,
    ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ ఉన్న సమస్తమూ లక్ష్మీ నారసింహమయమే ! 🙏
    ఆ భావననే బహు శృంగారముగా చెప్పుచున్నారు అన్నమయ్య ,
    స్వామి దేవేరులు కలిసి అక్కడ ఉన్న అన్ని పరిసరాలలో విహరిస్తూ ప్రేమములను పంచుకుంటున్నారని !🙏
    మరి చక్కటి ఈ సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇
    🌺🍃 ----------- 🍃🌺
    🌹🌹
    అదిగో శ్రీ మహాలక్ష్మి అహోబలమునకు ప్రభువైన నారసింహుని కూడి యున్నది .🙏
    వేవేల విధములుగా ప్రసరింపచేయుచున్నది తన ప్రేమమును శృంగారమును స్వామిపై !🙏
    🌹🌹
    అదిగో జంటకొండలైన గరుడాద్రి వేదాద్రి నడుమన
    స్వామి పక్కనే కూర్చుని ఉన్నది . ఒకరిపై ఒకరు చీకట్లను జల్లుకుంటున్నారు .🙏
    ( అ దట్టమైన కొండలలో ఒకరికి ఒకరు ఎంత దగ్గరగా ఉన్నారంటే వారి మధ్య గాలీ వెలుతురు కూడా జొరబడనంతగా )🙏
    అనేకానేకమైన విధములుగా అదిగో ఆ భవనాశినీ నదీ తీరములో గట్లపై విహరిస్తూ , సరసములాడుకొనుచూ తిరుగుచున్నారు , ఒకరికొకరు సరిపుచ్చుకుంటూ !🙏
    🌹🌹
    ఒకరికి ఎదురుగా ఒకరు మొకములు చూసుకుంటూ , గట్టి కౌగిళ్ళలో ఉన్నారు , ఆ కొండలలోని వృక్షాల నీడలలో !🙏
    ఆమె తన పెదవులను స్వామి పెదవులపై మెత్తగా వత్తుచు తేనియనందించుచున్నది , మిక్కిలి ప్రేమతో !🙏
    ఇలా స్వామితో కూడి ఉన్న ఆమెను చూస్తుంటే నిధి - నిధానము రెండూ కలిసిపోయినవా అన్నట్లు ఉన్నది .🙏
    చిరు వాన జల్లు ( నిధి ) వంటి అమ్మ , నల్లని మేఘము ( నిధానము ) వంటి స్వామీ కూడగా ఇక నిత్యము వాన పడకుండునా ( ప్రేమ )
    అటువంటి స్థితిలో తనను తానే మైమరచిపోయి ఉన్నది , తన చాతుర్యముతో మెరిసిపోతు లకిమమ్మ !🙏
    🌹🌹
    త్వరత్వరగా స్వామికి అతి చేరువగా చేరినది , ఒక్కింత గట్టిపట్టుదల గల జాణగా ,
    శృంగారములో తానేమీ తీసిపోనని భయపడకుండా స్వామితో పోటీపడుచున్నది !🙏
    తనని విడువని ఆ శ్రీ వేంకటేశ్వరుడే
    నారసింహునిగా ఇక్కడకు వచ్చి ,
    అతిశయమైన రీతిలో వ్యాపించి ఈ లకిమమ్మను
    వివాహమాడినాడు అమితమైన సంతోషముతో !🙏
    🌹🙏🌹
    ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 461 )
    ✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
    🌹🌹 సంకీర్తన 🌹🌹
    ॥పల్లవి॥
    అదివో లకిమమ్మ అహోబలేశ్వరుతోడ
    పదివేలు చందముల పరగీ రతులను
    ॥చ1॥
    సరుసనే కూచుండి జవళిఁ గొండలమీఁద
    యిరులు చల్లులాడీ విభుఁడుఁదాను
    పరిపరివిధముల భవనాశి దరులను
    సరసములాడీని సాటికి బేటికిని
    ॥చ2॥
    యెదురుఁగాఁగిళ్ళతోడ నెనసి మాఁకులనీడ
    పెదవితేనె లానీని ప్రేమమునను
    నిదినిధానాలవలె నిచ్చ వానపడలను
    సదమదమై నవ్వీని చతురత మెఱసి
    ॥చ3॥
    తొడఁదొడఁ గదియఁగ దోమటి గద్దెల నుండి
    జడియక పెనఁగీని సమరతిని
    యెడయక శ్రీవేంకటేశుఁడే నరసిఁహుఁడై
    అడరఁగఁ బండ్లెడీ నతి సంతోసమున
    🌹🙏🌹🙏🌹

  • @VsvlsraoAyithy
    @VsvlsraoAyithy 3 місяці тому +1

    ఓమ్ నమో వేటకటేశాయ గోవిందా

  • @padmaiyengar5387
    @padmaiyengar5387 3 місяці тому +1

    🙏🙏🙏

  • @ramakrishnaanisingaraju7129
    @ramakrishnaanisingaraju7129 3 місяці тому +1

    చాలా బాగుందండి కీర్తన. స్వప్న గారు మధురంగా ఆలపించారు. దృశ్యాలు ఆకట్టుకున్నాయి. ధన్యవాదములు

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  3 місяці тому

      ధన్యవాదములండి . అహోబల సందర్శనము అందరు చేసుకుంటారని అక్కడి కొమ్డలు జలపాతాలు భవనాశిని అన్నీ ఏర్చి కూర్చి పెట్టాను . అక్క్డి స్వామి ఊంజల్ సేవ పల్లకీ సేవ ఊరేగింపులు అన్ని జతచేసాను . మీకు నచినందులకు చాలా సంతోషము అండి

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri1023 3 місяці тому +2

    Om Sri Mahalakshmi Devaiy Namaha🙏🙏🙏 Maduramaina Sankeertana; Sri Lakshmi Devi; Narasimha Swami Varini; Ahobilamunu chala Baaga Chupincharu; thank you so much; Adbhutamaina dhrusyamalika; preface; Keerthana Bhavamu ; excellentga vivarincharu; abhinandanalu🙏 Madhuramga sungby Swapna Garu; om Ahobila Sri Lakshmi Narasimha Sri Venkatesaya Namaha🙏🙏🙏 bless you

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 3 місяці тому +1

    Om namo narayana govind a

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  3 місяці тому +1

    🌺☘ ------------☘🌺
    ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 461
    ( ADIVO LAKIMAMMA AHOBALESWARUNI TODA .. )
    🌺☘ ------------☘🌺
    PREFACE :-- 🌹👇
    Annamacharya has immense devotion upon Ahobala Lakshmi Narasimha.🙏
    He has written innumerable sankeertanas on Narasimha which stand next place to the keertanas on Sri Venkateswara !🙏.
    In this beautiful romantic song annamayya describes how The Mother and The Lord are romancing delightfully wandering at all places of The Ahobalam.🙏
    Indeed Ahobalam is such a divine place
    That ,
    it is not just a shrine of Nava Narasimhas ,
    Apart from it there are so many ! 🙏
    The Garudadri Vedadri hills, waterfalls, Bhavanashini river bank, etc .
    In such a grandeur Lakshmi And Narasimha are filled every where there .🙏
    Indirectly Annamayya qoutes the same as a romatic song , that they both are romancing every where.🙏
    Here goes the interesting keertana as below !👇
    🌺☘ ------------☘🌺
    🌹🌹
    There She Is ! The Mother Sri Maha Lakshmi
    Along with The Lord Of Ahobila ( Narasimha )🙏
    In A Thousand Fold Manner She Is Shining forth In Love Sports With The Lord !🙏
    🌹🌹
    Seated Just Beside The Lord , at The Twin
    Dark Dense forests Garudadri And Vedadri ,
    They Are Embraced So Tightly , as if
    They Are Flinging Darkness Upon Each other !🙏
    In Many Many Ways At
    The Banks Of Bhava Nasini River
    They Are Romancing Playfully
    By Matching Themselves Equally Well !🙏
    🌹🌹
    With Faces Towards Each Other Embracing ,
    Under The Shade Of Trees In The Forest
    She Is Pressing Her Honey Filled Lips
    Upon The Lips Of The Lord In Love !🙏
    Like The Treasure And The Treasure House ,
    Like The Cloud And The Rain They Are Together
    Like A Consistent Rainfall Of Love !🙏
    She Is So Deeply Invloved In Romance forgetting Herself
    And Smiling While Her Wittiness Is Shining !🙏
    🌹🌹
    By Swiftly Approaching Nearer And Nearer
    To The Lord
    And Being Stubborn In Love Without Any Fear And Inhibition ,
    She Is Fighting Equally In Love Sports With The Lord !🙏
    Without Being Seperated From Her
    The Lord Sri Venkateswara Became As Narasimha,
    He Arose Delightfully And Married HerWith Greatest Joy !🙏
    🌹🙏🌹
    Om Sri Lakshmi Nrusimha Mama Dehi karaavalambam !
    🌹🌹
    Om Sri Alamelumanga Sameta
    Sri Venkateswara Swaminey Namaha !🙏
    🌹🙏🌹
    ✍ --Venu Gopal