#Konaseema

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025
  • చిరకాల స్మ్రుతులలో నిలిచిపోయే ఒక మధురమైన ప్రయాణం :)
    A Travel Story that you can cherish as a life long memory.
    Includes: Adventures, Exploration, Off the Grid living, Native Foods, Special Tastes, Godavari region culture, traditions, beauty & foods.
    #కోనసీమ అందాలు
    మాటలకందని అనుభూతులు, రహదారుల వెంట కాలువలు ,పచ్చని చెట్ల తోరణాలు ,అరటి గెలలు, కొబ్బరి తోటలు , కోడిపందాలు ,అంతర్వేదిలో గోదావరి సాగరసంగమంలో పడవ ప్రయాణం మరపురాని ఒక మధురానుభవం. పచ్చని పంట పొలాలు... ఆకాశాన్ని తాకేలా పెరిగిన కొబ్బరిచెట్లు...పుష్కలమైన ప్రకృతివనరులు. కనుచూపు మేరకు తనివితీరని రమణీయమైన ప్రకృతి సౌందర్యం. గోదావరి నదిలో సుమారు 10-20 నిమిషాల లాంచీ ప్రయాణం (కోనసీమ పరిసర ప్రాంతాలలో .. ) పర్యాటకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది.
    #దేవాలయాలు
    కోనసీమ ప్రాంతంలో పర్యాటకులు ఎన్నో దేవాలయాలను చూడవచ్చు. వాటిలో ప్రధానమైనవి మురమళ్ళలో గల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి గుడి, ర్యాలీ లో గల జగన్మోహిని కేశవ స్వామి గుడి, ముక్తేశ్వరం లోని క్షణ ముక్తేశ్వరాలయం, ముక్తేశ్వరాలయం పలివెల లోని శ్రీ ఉమాకొప్పు లింగేశ్వర ఆలయం, మందపల్లి లోని శనీశ్వర ఆలయం, అయినవిల్లి విగ్నేశ్వర ఆలయం , అంతర్వేది లక్ష్మి నృసింహా ఆలయం, etc.

КОМЕНТАРІ • 8