ఆవు పిడకల వ్యాపారం చేస్తున్నాం Cow Dung Cake Business

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • గతంలో ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేసిన వినోద్ రెడ్డి గారు.. ప్రస్తుతం ఆ జాబ్ మానేసి గత పది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. పుంగనూరు ఆవులు పెంచుతున్నారు. ఆ ఆవుల పేడతో పిడకలు చేసి విక్రయిస్తున్నారు. ఎద్దు గానుగలు నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. ఈ వీడియోలో ఆవు పిడకల తయారీ, మార్కెట్ చేస్తున్న విధానం వివరించారు. చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె మండల కేంద్రం పక్కనే ఉన్న ఎగువ తవణంపల్లె గ్రామంలో ఈ రైతు పిడకలు తయారు చేస్తున్నారు.
    మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
    కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
    Title : ఆవు పిడకల వ్యాపారం చేస్తున్నాం Cow Dung Cake Business | బతుకు బడి
    Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
    #BathukuBadi #బతుకుబడి #ఆవుపిడకలు

КОМЕНТАРІ • 53