Devunni Maruvaku (దేవున్ని మరువకు) - Lyrical Song - 93

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025
  • "ఆత్మ" అను 'రెండు' అక్షరములు అందరికీ సుపరిచయమేయైనా, ఆ అక్షరములను భావసహితముగా తెలియుటలోనూ, వాటి నిజార్థమును గుర్తించుటలోనూ సర్వ జగతి విఫలమైనదనే చెప్పవచ్చును.
    ఇది చదువుతున్న నీవు, ఇపుడు నివాసము చేయుచున్న, నీది అనుకుంటున్న దేహములో, నఖ శిఖ పర్యంతమూ వ్యాపించి, సర్వ కార్యములు చేయుచూ, నీకు అధిగా ఉన్న ఒక అద్భుత శక్తి... "ఆత్మ" అను బిరుదు కలిగియున్నది అని గ్రహించగలిగావా? లేదు !
    'ఆధ్యాత్మికము' అనగా 'ఆత్మను అధ్యయనము చేయుట' కాగా ...పూర్వము నుండి నేటివరకు ఏ అన్యుడు కానీ, మాన్యుడు కానీ, సామాన్యుడు కానీ, అధ్యయనము చేయవలసిన ఆత్మను గురించి చెప్పలేకపోయారు, కనీసము పరిశోధించలేకనేపోయారు. గొప్ప సిద్ధాంతకర్తలుగా పేరుగాంచిన ఆదిశంకరాచార్యులు (అద్వైతము) కానీ, రామానుజాచార్యులు (విశిష్టాద్వైతము) కానీ, మధ్వాచార్యలు (ద్వైతము) కానీ అంతములో సిద్ధించు "ఆత్మ" యొక్క గట్టు కూడా తాకలేకపోయారు.
    ఈ నేపథ్యంలో, కొన్ని వందల సంవత్సముల క్రితమే "శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు" తన ఏష్యకాలజ్ఞానంలో ప్రకటించిన విధముగా.. "కలియుగము 5110 సంవత్సరములకు ఆధ్యాత్మిక పురుషుడు ప్రకాశమయ్యాడు" .. "ఆత్మాత్మ కాంతియే అన్యధా కాంచగల ఆనంద గురుడు ఉద్భవించాడు".. "మధ్యాత్మ యోగపురుషుని మహత్తు మహా ప్రకాశము చేసాడు".. "నిత్యమూ సత్యమయ్యే సిద్ధాంతమునకు శిరోమణిగా 'గురుస్వామి' వెలిశాడు" ఆ సిద్ధాంతమే "త్రైత సిద్ధాంతము".
    ఆదినుండి ఆదిత్యునిద్వారా శృతులుగా పలుకబడిన 'జపర' జ్ఞానము సాక్షిగా, మహోత్తరమైన 'మూడు దైవ గ్రంథముల' సాక్షిగా, దైవ దూతల, జ్ఞాన సంపన్నుల, యోగసిద్ధుల హృదయ సాక్షిగా ... "మధ్యాత్మయే అసలైన ఆరాధ్యుడు" ! ఆ "ఆత్మను" అధ్యయనము చేయించి, ముక్తిని చూపించగల సిసలైన సిద్ధాంతమే "త్రైత సిద్ధాంతము" !!
    సాంద్ర సింధు వేదముతో ఆనందాశ్రమమునకు కర్తగా విరాజిల్లి, సోమ సిద్దాంతముతో నన్ను రంజిల్లజేసి .. నాయొక్క ధ్యాన, ప్రార్థన, నమాజులు స్వీకరించగల "అల్లాహ్" ను కళ్ళకు చూపించిన "శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద గురుదేవుల"కివే నా సాష్టాంగ దండ ప్రణామములు.
    www.thraithash...
    TEAM:
    ----------
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Praveen Kumar Koppolu
    Music - N Nagesh
    Editing - Subbu
    Production - Gnanavaahini Team
    Presented By - Gnanavaahini Channel
    సాకీ:
    సర్వకాల సర్వావస్థలలో గురువుని మరువక ధ్యానము చేయాలి
    ప్రాపంచికమౌ ప్రతి పయనములో ప్రభువుని మరువక ప్రార్థన చేయాలి
    నీ దేహయాత్రలో ఇహలోక పాత్రలో మధ్యాత్మనే మరువక నమాజు చేయాలి ... నిరంతర నమాజు చేయాలి
    పల్లవి :
    --------
    దేవున్ని మరువకు దేవున్ని మరువకు //2
    నీ గుండెను కొట్టే ఊపిరి పీల్చే
    మనువును ఏలే తనువును తోలే
    దేవున్ని మరువకు దేవున్ని మరువకు
    కలలో ఇలలో మాయల వలలో దేవున్ని మరువకు
    హృదిలో సుధలో తీరని వ్యధలో దేవున్ని మరువకు
    నీ ఆయువు పట్టే నెత్తురు నెట్టే
    నాడుల నడిపే గ్రంథుల కదిపే
    దేవున్ని మరువకు దేవున్ని మరువకు .. దేవున్ని మరువకు
    చర 1 :
    -------
    కంటికి దృశ్యము తాకేవేళ జంటగా ఉండేవాని మరువకు
    నోటికి వాక్కులు కూడేవేళ వెంటగా పలికినవాని వదలకు
    పచనములోన రుచులను చూపే నాలుకలోని నరము మరువకు
    వచనములే వినిపించేవేళ చెవిలో చేరిన గురుని వదలకు
    కరమూలతో కార్యాలనే చేసే చేతగాని వీడకు
    చరణాలతో చరియించగా నడిచే నేతగాని విడువకు
    మరలా మెదిలి మలమూత్రాలే మాపుచేయు మర్మాన్ని మరువకు
    దొరలా కదిలి దివరాత్రాలూ కాపుకాయు కరణాన్ని వదలకు
    దేవున్ని మరువకు దేవున్ని మరువకు
    నీ స్పర్శను చూపే చర్మము కప్పే
    జీర్ణము చేసి జీవము నిలిపే
    దేవున్ని మరువకు నీ దేవున్ని మరువకు
    చర 2 :
    -------
    నిద్రను లేపే స్మృతిప్రభవానా ఎరుకను ఒసగెడి వాని వదలకు
    నిద్రకు పంపే మృతిప్రళయానా మరుపును గొలిపే మేను మరువకు
    మదిలో జ్ఞానము నేర్చే వేళా హృదిలో ఆతని ధ్యాస విడువకు
    బుద్ధికి యోచన కూర్చే వేళా హద్దును చూపెడి వాణి మరువకు
    చిత్తాన నీ కార్యాలనే కాసే కాపువాని వదలకు
    అధికారివీ నీవేననే అహమే రేపువాని మరువకు
    కాయములోన వాయువుతానై ఆయువునిచ్చిన వాని విడువకు
    దేహములోన దేవుడుతానై దాపుగచేరిన వాని మరువకు
    దేవున్ని మరువకు దేవున్ని మరువకు
    గ్లానిని పెంచే రోగమునిచ్చే
    వాణిని పంచి వైద్యముచేసే
    దేవున్ని మరువకు నీ దేవున్ని మరువకు
    చర 3 :
    ------
    రాగముతో రంజిల్లేవేళ అంతరంగమున అతనిమరువకు
    క్రోధముతో కంపించే వేళా పంతముతో నీ పతిని వదలకు
    బాహ్యములోనే భయమునొందుచు గ్రాహ్యములో నీ గురుని మరువకు
    ఏహ్యముగానే సిగ్గు పొందుచూ గుహ్యములో నీ గుర్తు విడువకు
    అశ్రధ్ధతో అజ్ఞానివై నీలో పొరుగు వాని మరువకు
    సిద్ధాంతమే సిద్దించగా లోలో గురుని చేయి విడువకు
    జననము నుండి మరణము వరకు జతనే వీడని వాని మరువకు
    జన్మలు మారినా జంటగా ఉంటూ నీడై నిలచిన వాని విడువకు
    దేవున్ని మరువకు దేవున్ని మరువకు
    నీ జ్ఞానమునిచ్చే యోగము నేర్పే
    త్రైతము తెచ్చి గురువై వచ్చిన
    దేవున్ని మరువకు నీ గురు దేవున్ని మరువకు
    ధరలో మరలో దేహపు చెరలో దేవున్ని మరువకు
    గతిలో రతిలో ఆఖరి చితిలో దేవున్ని మరువకు ... దేవున్ని మరువకు ... దేవున్ని మరువకు !!!
    ------------------------------------ XXXXXX --------------------------
    ఓం కారం - ఆత్మ సాక్షాత్కారం :
    -----------------------------------------------
    ఓం కారములో అ, ఉ, మ అను అక్షరములు ఉన్నాయి. అంటే మనము ఏ శబ్దము పలకాలన్నా నోరు తెరచి 'అ', నోరు మూసి 'మ' అనాలి. అంటే లోకములోని ప్రతిశబ్దము అ-మ ల మధ్యే జనిస్తుంది. ఇలా అన్ని శబ్దాలు ఓం లో నుంచే పుడతాయి కనుక ఓం మూలబీజము.
    అదే విధముగా ఆత్మ అను పదములో ఆ, త, మ, అను అక్షరములు ఉన్నాయి. శరీరములో అణిగియున్న మూలశక్తిని బ్రహ్మ విద్యా శాస్త్రానుసారము "ఆత్మ" అనవలెను.
    మనలోని శ్వాస 'సోహం' అను శబ్దమును చేయగా, అది ఓమ్ గా పరిగణించబడుతుంది. అదే శ్వాసను పీల్చు సమయములో ఆ శ్వాసకు "ఆత్మ" అను రెండు అక్షరములను జోడిస్తే, అది కూడా ఓంకారమే అవుతుంది.
    ఇలా శ్వాస పీల్చు సర్వకాలములలో, ఆత్మ ధ్యాసలో ఉండుటయే ఉత్తమ యోగము. ఆత్మను తెలియుటే ఆధ్యాత్మికము. అందుకు ఓం యే ఆధారము. ఇదే అదిమంత్రము మనకు తారకమంత్రము. ఓం తత్ సత్ !!!

КОМЕНТАРІ •