Ninnu neevu tagginchukoraa...(నిన్ను నీవు తగ్గించుకోరా...) Lyrical Song-65
Вставка
- Опубліковано 6 січ 2025
- ఇహలోకము అశాశ్వతమైనది, పరలోకము శాశ్వతమైనది అని, పుట్టినవాడు మరణించక తప్పదని, తాను సంపాదించే ఆస్తులు, ఐశ్వర్యాలు, అధికారాలు అన్నీ ఇక్కడ వదిలిపోవలసిందే అని అందరికీ తెలిసినా ... జీవులు మాయాప్రలోభాలకు చిక్కి, ఇహామునే గొప్పదనుకొని, దైవమును, దైవ జ్ఞానమును చులకనగా చూస్తున్నారు.
కొంత జ్ఞానము తెలిసినవారు సహితము "దైవమును హెచ్చించి తనను తగ్గించుకొనుట" మాని, జ్ఞానసముపార్జన చేసినామనే అహముతో ... మరలా గుణము అను మాయలోపడి హెచ్చించుకునే వైపే మొగ్గుచూపి మాయకే చిక్కిపోతున్నారు.
విశ్వాధినేత అయిన దేవుడే మానవునిగా (భగవంతునిగా) దిగివచ్చి "తనను తాను తగ్గించుకొని, ఆదర్శకర్తగా ఉంటూ, మనకు జ్ఞానమును పంచి ఆధరణకర్తగా" ఆదరిస్తుంటే, సృష్టిలో అందరికంటే చిన్నవాడైన జీవుడు, తనను తాను హెచ్చించుకొనుట పూర్తి అజ్ఞానమనబడును.
కనుకే, ప్రభువే మనశ్రేయస్సుకోరి మరొకసారి ఆజ్ఞాపిస్తున్న మాట "తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును"
thraithashakam....
L I K E | S H A R E | S U B S C R I B E
TEAM:
Lyricist - Siva Krishna Kogili
Singer - Indu Sekhar
Music - N Nagesh
Editing - Subbu
Production - Gnanavaahini Team
Presented By - Gnanavaahini Channel
సాకీ :
-------
తనని తాను తగ్గించుకొనువాడు
తనని తాను తగ్గించుకొనువాడు...
హృదిలో తన గదిలో ... మదిలో ఆ సన్నిధిలో
బహుగా బహు బహుగా హెచ్చింప బడతాడురా... హెచ్చింప బడతాడురా...
పల్లవి :
----------
నిన్ను నీవు తగ్గించుకోరా పరలోకములో హెచ్చింపబడతావురా
నిన్ను నీవు తగ్గించుకోరా పరలోకములో హెచ్చింపబడతావురా
నీలో ఏ గొప్పలేదు నీకేమి చేతకాదు
నీవొట్టి అల్పుడవు ఈ సృష్టికి స్వల్పుడవని అని అంటే
అని అంటే ఒప్పేసుకోరా ఈ అహమునుండి తప్పేసుకోరా
అని అంటే ఒప్పేసుకోరా ఆ కర్మనుండి తప్పేసుకోరా
నిన్ను నీవు తగ్గించుకోరా పరలోకములో హెచ్చింపబడతావురా
చర 1 :
--------
నీ పుట్టుకలో నీ అరచేతిని విప్పిచూస్తే ... పట్టుకు తేలేదేమీ వట్టిది కదరా
నువు గిట్టేనాడు గతమంతా తిప్పిచూస్తే ... కట్టుకుపోలేవేమీ మట్టిది కదరా
నీ దేహములో నీ పరిమాణము ఎంచుకుంటే ఆవగింజలోనే అర్థము కదరా!
అహమను భావములో ఆకారము పెంచుకుంటు నీవు గింజుకుంటే వ్యర్థము కదరా!
అధికారము అంధకారమేరా దేహవ్యామోహము బంధికాన కదరా!
నీదన్నది నిన్నలేదులేరా ... ఇక రేపన్నది ఉండబోదు కనరా
బలమైన ఆవాయువు విలయంగా వీచునపుడు
దృఢమైన వృక్షాలే నేలకూలిపోవునపుడు
అడవిగడ్డికే అడ్డులేదులేరా .... మరి అణిగుంటే పోయేది ఏముందిరా
మరి అణిగుంటే పోయేది.... ఏమీలేదురా
నిన్ను నీవు తగ్గించుకోరా పరలోకములో హెచ్చింపబడతావురా
పరలోకములో హెచ్చింపబడతావురా ...
చర 2 :
----------
నీ కాయములోని సత్తునీది కానప్పుడు .. సర్వం నీదన్నమాట ఉత్తది కదరా
నీ చిత్తములోని కర్మ మార్చలేనప్పుడు ... నీ పెత్తనమంటూ ఏమున్నదిరా
నీ హద్దుని దాటి మనసు మసులుతున్నప్పుడు ... వొద్దని అనలేని మొద్దువి కదరా
నీ నిద్దురలో నీ బుద్ధి బదులు పలుకనప్పుడు ... పెద్దని నేనంటే అది శుద్ధతప్పురా
ఇరువదైదు తత్వములను కనరా ... ఇరుకుమార్గంలో సత్తువెంట పదరా
దేహమన్న గద్దెనుండి దిగరా ... ఇక దేహిపైన శ్రద్ధపెంచుకోరా
పంతొమ్మిది భాగాలే నీ జతలో ఉన్నప్పుడు
పతి ఆజ్ఞతో ప్రతి పనిని ఆ దూతలే చేయునపుడు
నీ తలలో తలుపేసుకోరా .... తత్వ తెరలే పరిచేసి తరియించరా ..
త్రైత జ్ఞానాన్నే వరియించి గమ్యాన్నే చేరరా !!!
నిన్ను నీవు తగ్గించుకోరా పరలోకములో హెచ్చింపబడతావురా
పరలోకములో హెచ్చింపబడతావురా...
చర 3 :
---------
ప్రభువే భువియందు పనివాడై సేవచేసి ... పరలోకపు విందు పంచినాడురా
తనువే గ్రంథముగా తన రక్తమె జ్ఞానముగా ... త్రైతమనే మందు ఉంచినాడురా
ఇహలోకములో ఎంతగ నిన్ను నీవు పెంచుకుంటే ... పరలోకములో అంతగ తగ్గుతావురా
కనుకే ఇహమందు ఇరుకే నీవెంచుకుంటే ... పరలోకపు రాజ్యాన్నే నెగ్గుతావురా
అజ్ఞానము నీకులేదులేరా అది నీలోని గుణదోషమేరా
సుజ్ఞానము నీదికాదులేరా అది నీలోని గురు భాషణేరా
నీదికాని దేహములో మధ్యాత్మని ఎరిగినపుడు
ఆ అధిపతి స్నేహములో పరమాత్మని తలచినపుడు
జీవాత్మయి మిగిలేవులేరా... సృష్టికంతా నువు చిన్నవని తెలిసేనురా
ఇలా అణిగుండే భావములో ఆధ్యాత్మికముందిరా !!!
నిన్ను నీవు తగ్గించుకోరా పరలోకములో హెచ్చింపబడతావురా
సాధారణ దేహములో .. వేదాంతము దొరికినపుడు
ఆనందుని బోధలతో... ఆదరణే అందినపుడు
అది వింటూ ఒప్పేసుకోరా ... నీ తలరాతను తిప్పేసుకోరా
అది వింటూ ఒప్పేసుకోరా ... నీ తండ్రినే గొప్ప అని చెప్పేయారా ...
ఆ అప్పగింత స్థలమందు ... నీ తాతను చేరరా ...
నిన్ను నీవు తగ్గించుకోరా పరలోకములో హెచ్చింపబడతావురా
పరలోకములో హెచ్చింపబడతావురా... పరలోకములో హెచ్చ్చింపబడేదే నీవురా ...
ఆ మోక్షములో పడేదే నీవురా… !
---------------------------------------------------
అనువుగాని చోట అధికుల మనరాదు
కొంచెముండుటెల్ల కొదువ గాదు
కొండ యద్దమందు కొంచెమై యుండదా
విశ్వదాభిరామ వినుర వేమా
లూకా 18వ అధ్యాయము, 14వ వాక్యము : తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను.
లూకా సువార్త 4వ అధ్యాయము, 4వ వాక్యము
లూకా సువార్త 12వ అధ్యాయము, 7వ వాక్యము
లూకా సువార్త 17వ అధ్యాయము, 6వ వాక్యము
మార్కు సువార్త 10వ అధ్యాయము, 24, 25 వాక్యముల
లూకా 6వ అధ్యాయము, 42వ వాక్యముు
లూకా 6వ అధ్యాయము, 37వ వాక్యముు
తప్పులెన్నువారు తండోప తండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమా
లూకా సువార్త 13వ అధ్యాయము, 24 వాక్యములు
మత్తయి సువార్త 6వ అధ్యాయము, 6వ వాక్యము
మత్తయి సువార్త 12 వ అధ్యాయము, 18 వ వాక్యము
మత్తయి సువార్త 7 వ అధ్యాయము, 13, 14 వాక్యములు
లూకా సువార్త 11వ అధ్యాయము, 39 వాక్యములు
లూకా సువార్త 13వ అధ్యాయము, 3వ వాక్యము
యోహాన్ సువార్త 6వ అధ్యాయము, 27వ వాక్యము
యోహాన్ సువార్త 3వ అధ్యాయము, 3వ వాక్యము