Це відео не доступне.
Перепрошуємо.

ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 7 నుంచి 9 హైదరాబాద్‌లో

Поділитися
Вставка
  • Опубліковано 5 чер 2024
  • జూన్ 7 నుంచిహైదరాబాద్‌లో ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ 250 మంది కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీలు, 3500 కళాఖండాలు
    కళా ప్రియులైన హైదరాబాద్ వాసులను అలరించేలా ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 7 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ప్రతి ఏటా ముంబై, బెంగళూర్ లో నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ మొదటిసారి హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారు. అద్భుతమైన, అదురైన వందలాది కళాఖండాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్ లో అలరించనున్నాయి. కింగ్స్ కోహినూర్ (క్రౌన్) కన్వెన్షన్‌లో, పిల్లర్ 68, PV నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే, రేతి బౌలి, హైదరాబాద్‌లో మూడురోజుల పాటు నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ లో దేశం నలు మూలల నుంచి దాదాపు 250 మంది ప్రముఖ కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీల యాజమానులు పాల్గొంటున్నారు. జూన్ 7న ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 9వ తేదీతో ముగుస్తుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు కొనసాగుతుంది.
    ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ 2011లో ప్రారంభించి ఇప్పటి వరకు న్యూ ఢిల్లీ, బెంగళూరు మరియు ముంబై తదితర నగరాల్లో ఇప్పటివరకు 25 ఫెస్టివల్ ను విజయవంతంగా నిర్వహించామన్నారు.

КОМЕНТАРІ •