రైతులకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. రైతు భరోసా

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024
  • #agricareers #karshakavani #agriculture #telanganaagriculture #farming #agriculturefarming #farmer #automobile #fishing
    రైతులకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. రైతు భరోసా (rythu barosa)నిధుల జమ ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అధికారులు వెంటనే రైతు భరోసా నిధుల జమను ఆపారు. మే 13 పోలింగ్ ముగిసిన తర్వాత రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.
    రైతులకు పెట్టుబడి సాయం విషయంలో ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మే 9వ తేదీలోగా రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేస్తామంటూ పలు ఎన్నికల బహిరంగ సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. రైతు భరోసా విషయంలో ఎన్నికల కమిషన్‌కు ఎన్‌ వేణుకుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రైతు భరోసా చెల్లింపులతో పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్‌ సీఎం రేవంత్‌ రెడ్డి.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. ఎన్నికల సభల్లో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయటాన్ని కోడ్ ఉల్లంఘనగా భావించిన ఈసీ.. కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13 పోలింగ్ ముగిసిన తర్వాత రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది...
    పంట నష్టపరిహారంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. దీంతో అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో పంట నష్టపరిహార డబ్బులు జమ కానున్నాయి. తెలంగాణలో మార్చి 16 నుంచి 24 మధ్య పది జిల్లాల్లో వడగళ్లవానతో రైతులు పంట నష్టపోయారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పంట నష్టపరిహారం డబ్బులు విడుదల చేసింది.15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఎకరాకు రూ.10 చొప్పున రూ.15.81 కోట్లు విడుదల చేసింది. కరీంనగర్ జిల్లాలో 160.10 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 10,328.04 ఎకరాలు, నిజామాబాద్‌ జిల్లాలో 1,652.25 ఎకరాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,014.06 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 746.30 ఎకరాలు, మెదక్ జిల్లాలో‌ 714.17 ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 545.09 ఎకరాలు, నిర్మల్‌ జిల్లాలో 332.17 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 244.01 ఎకరాలు, సంగారెడ్డిలో 76.04 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఎన్నికల సంఘం అనుమతితో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. రేపటిలోగా రైతుల ఖాతాల్లో పంట నష్టపరిహారం సొమ్ములు జమ అయ్యే అవకాశం ఉంది....

КОМЕНТАРІ • 2