UYYAALA UUPULU / ఉయ్యాల యూపులు / AAV SERIES 05 EP 476 / PARUPALLI SRI RANGANATH / ANANDA BHAIRAVI

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • 🌺🍃 ------------🍃🌺
    అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 476
    ( ఉయ్యాల యూపులు ఓ ముద్దులయ్యా .. )
    🌺🍃 ----------- 🍃🌺
    ఓం నమో వేంకటేశాయ. 🙏
    అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 476 కి శుభ స్వాగతం ..🙏
    ప్రార్థన ః--🌹🙏
    యోగనిదురవోవయ్యా ,
    భోగీంద్రుడె నీకు శయ్య , భువిహితమునకై
    యోగులు చాతుర్మాస్యము
    నోగితముగ జేయఁగూడి రుప్పవడముగా !
    🌹🙏🌹
    ✍️ --స్వీయపద్యము ( కందము )
    🌹🌹
    స్వామీ !
    ఇదిగో నేడే తొలి ఏకాదశి ! 🙏
    నీవు యోగనిదురపోవయ్యా హాయిగా ,
    అదిగో ఆ సర్పరాజె నీకు శయ్యగా అమరి ఉన్నాడు ! 🙏
    అలాగే ఇదిగో లోకకళ్యాణమును కాంక్షించుచూ ,
    తగుయోగ్యమైన రీతిలో , చాతుర్మాస్య దీక్షను
    చేయుటకు జాగురూకతతో నీకై తపమొనర్చుటకు కూడి యున్నారు యోగిపుంగవులందరూ !🙏
    🌺🍃 -----------🍃🌺
    మున్నుడి ః-- 🌹👇
    అన్నమాచార్యుల వారు స్వామికి చేసే సేవలనన్నిటినీ అద్భుతమైన రీతిలో కీర్తనలుగా వర్ణించారు .🙏
    వాటిలో పవళింపు సేవగా , ఊంజల సేవగా , రచించిన లాలి పాటలైతే మధురాతిమధురమైనవి .🙏
    అటువంటి చక్కని ఉయ్యాల పాట అర్థము తెలుసుకుని పాడుకుందామా ఈ తొలి ఏకాదశి పర్వదినమున .👇
    ( తొలి ఏకాదశి ః--🌹
    ఆషాడ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి గా విశిష్టమైన స్థానమును సంపాదించుకున్నది .🙏
    ఈ రోజుననే శ్రీమన్నారాయణుడు యోగనిదురకు ఉపక్రమించునని ఆర్యులు చెప్పుదురు .🙏
    అట్టి నారాయణునకు మరి ఉయ్యాలలూపి జోలపాడెదము రండి ! )👇
    🌺🍃 ----------- 🍃🌺
    🌹🌹
    ఓ ముద్దులొలికే రూపము గల స్వామీ !
    నీకు ఇదిగో సుకునారముగా ఊయలను ఊపుచున్నాము !🙏
    పదహారు వేల గోపికలందరూ కూడా కలిసి వచ్చి నీకు చక్కగా జోలపాటలు పాడుచూ , సంతోషముగా ఊయలను ఊపుచున్నారు !🙏
    ఇక చక్కగా నిదురపోవయ్యా !
    🌹🌹
    ఆ ఆదిశేషుడినే పానుపుగా చేసుకున్న స్వామీ ,
    అన్ని జగత్తులనందు అమితమైన ఖ్యాతిని గడించిన వాడా ,🙏
    గోవులనూ , గోపాలులను గోపికలనూ సదా రక్షించెడి వాడా ,
    భూమండలమునకు దొరయైన వాడవూ నీవే !🙏
    సకలవేదములలో స్తుతియింపబడిన వాడవూ ,
    స్వరూప సామర్ధ్యము చేత చ్యుతము కాని ఓ అచ్యుతా ,
    అంతమునెరుగని ఓ అనంతుడా ,🙏
    యోగనిద్రకు చక్కగా ఉపక్రమించవయ్యా ఈ ఊయ్యాల ఊపులకు !🙏
    🌹🌹
    అన్ని దిక్కుల యందు వెలుగొందుచున్న దేవర్ఢులైన నారదాదులు అందరూ ,
    ఇదిగో నీవున్న ఈ బంగారు భవనముకు విచ్చేసి యున్నారు !🙏
    సమృద్ధిగా మీరిన భక్తితో " గోవిందా ! గోవిందా !!" అని నిన్నే చక్కగా కీర్తించి పాడుచున్నారయ్యా !🙏
    ఇంకా ఇంకా పాడండి అని కొసరకుండా హాయిగా నిదురపోవయ్యా ఓ శేషశాయీ !🙏
    🌹🌹
    సుజ్ఞానులైన భాగవతోత్తములెందరెందరో చేరి నిన్ను చక్కగా పొగుడుచున్నారు .
    అదిగో భూదేవి శ్రీదేవి , అంగనామణులందరితోడ నీ చెంతకు చేరి ,
    ఉన్నతోన్నతమైన నీ పాదద్యయమును సుతిమెత్తగా ఒత్తుచున్నారు ! 🙏
    అందరికీ వెనుబలమై యున్న ఓ విష్ణుడా ,
    ప్రసన్నుడవై ఇక చక్కగా నిదురపోవయ్య ఓ శ్రీ వేంకటేశ్వరా !🙏
    🌹🙏🌹
    ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 476)
    ✍️ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
    🌹🌹 సంకీర్తన 🌹🌹
    ఉయ్యాల యూఁపులు ఓ ముద్దులయ్యా
    వెయ్యారు గోపికలు వేడుక నూఁచెదరు
    // పల్లవి //
    భోగీంద్ర తల్పుఁడా భువన విఖ్యాతా
    గోగోపరక్షకా కువలయాధీశా
    ఆగమసన్నుతా యచ్యుతానంతా
    యోగనిద్ర పోవయ్య యోగీంద్రవంద్య
    // ఉయ్యాల //
    దెసలందు వెలిఁగెడి దేవర్షివరులు
    ప్రసరించి బంగారు భవనంబులోన
    కొసరక నిద్రించు గోవిందా యనుచు
    పసమీర పాడెదరు పన్నగశయనా
    // ఉయ్యాల //
    #UYYALAUUPULU #OMUDDULAYYA #ఉయ్యాలయూపులు #ఓముద్దులయ్యా #parupalli #psranganath #toliekadasi #tholiekadashi #తొలిఏకాదశి #annamacharya #annamacharyakeerthanalu #annamayya #annamayyaaksharavedam #sriramanavami #sriramasongs #ramabhajan #annamayyakeerthanalu #annamayyasongs

КОМЕНТАРІ • 6

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  3 місяці тому +2

    🌺🍃 ------------🍃🌺
    అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 476
    ( ఉయ్యాల యూపులు ఓ ముద్దులయ్యా .. )
    🌺🍃 ----------- 🍃🌺
    ఓం నమో వేంకటేశాయ. 🙏
    అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 476 కి శుభ స్వాగతం ..🙏
    ప్రార్థన ః--🌹🙏
    యోగనిదురవోవయ్యా ,
    భోగీంద్రుడె నీకు శయ్య , భువిహితమునకై
    యోగులు చాతుర్మాస్యము
    నోగితముగ జేయఁగూడి రుప్పవడముగా !
    🌹🙏🌹
    ✍ --స్వీయపద్యము ( కందము )
    🌹🌹
    స్వామీ !
    ఇదిగో నేడే తొలి ఏకాదశి ! 🙏
    నీవు యోగనిదురపోవయ్యా హాయిగా ,
    అదిగో ఆ సర్పరాజె నీకు శయ్యగా అమరి ఉన్నాడు ! 🙏
    అలాగే ఇదిగో లోకకళ్యాణమును కాంక్షించుచూ ,
    తగుయోగ్యమైన రీతిలో , చాతుర్మాస్య దీక్షను
    చేయుటకు జాగురూకతతో నీకై తపమొనర్చుటకు కూడి యున్నారు యోగిపుంగవులందరూ !🙏
    🌺🍃 -----------🍃🌺
    మున్నుడి ః-- 🌹👇
    అన్నమాచార్యుల వారు స్వామికి చేసే సేవలనన్నిటినీ అద్భుతమైన రీతిలో కీర్తనలుగా వర్ణించారు .🙏
    వాటిలో పవళింపు సేవగా , ఊంజల సేవగా , రచించిన లాలి పాటలైతే మధురాతిమధురమైనవి .🙏
    అటువంటి చక్కని ఉయ్యాల పాట అర్థము తెలుసుకుని పాడుకుందామా ఈ తొలి ఏకాదశి పర్వదినమున .👇
    ( తొలి ఏకాదశి ః--🌹
    ఆషాడ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి గా విశిష్టమైన స్థానమును సంపాదించుకున్నది .🙏
    ఈ రోజుననే శ్రీమన్నారాయణుడు యోగనిదురకు ఉపక్రమించునని ఆర్యులు చెప్పుదురు .🙏
    అట్టి నారాయణునకు మరి ఉయ్యాలలూపి జోలపాడెదము రండి ! )👇
    🌺🍃 ----------- 🍃🌺
    🌹🌹
    ఓ ముద్దులొలికే రూపము గల స్వామీ !
    నీకు ఇదిగో సుకునారముగా ఊయలను ఊపుచున్నాము !🙏
    పదహారు వేల గోపికలందరూ కూడా కలిసి వచ్చి నీకు చక్కగా జోలపాటలు పాడుచూ , సంతోషముగా ఊయలను ఊపుచున్నారు !🙏
    ఇక చక్కగా నిదురపోవయ్యా !
    🌹🌹
    ఆ ఆదిశేషుడినే పానుపుగా చేసుకున్న స్వామీ ,
    అన్ని జగత్తులనందు అమితమైన ఖ్యాతిని గడించిన వాడా ,🙏
    గోవులనూ , గోపాలులను గోపికలనూ సదా రక్షించెడి వాడా ,
    భూమండలమునకు దొరయైన వాడవూ నీవే !🙏
    సకలవేదములలో స్తుతియింపబడిన వాడవూ ,
    స్వరూప సామర్ధ్యము చేత చ్యుతము కాని ఓ అచ్యుతా ,
    అంతమునెరుగని ఓ అనంతుడా ,🙏
    యోగనిద్రకు చక్కగా ఉపక్రమించవయ్యా ఈ ఊయ్యాల ఊపులకు !🙏
    🌹🌹
    అన్ని దిక్కుల యందు వెలుగొందుచున్న దేవర్ఢులైన నారదాదులు అందరూ ,
    ఇదిగో నీవున్న ఈ బంగారు భవనముకు విచ్చేసి యున్నారు !🙏
    సమృద్ధిగా మీరిన భక్తితో " గోవిందా ! గోవిందా !!" అని నిన్నే చక్కగా కీర్తించి పాడుచున్నారయ్యా !🙏
    ఇంకా ఇంకా పాడండి అని కొసరకుండా హాయిగా నిదురపోవయ్యా ఓ శేషశాయీ !🙏
    🌹🌹
    సుజ్ఞానులైన భాగవతోత్తములెందరెందరో చేరి నిన్ను చక్కగా పొగుడుచున్నారు .
    అదిగో భూదేవి శ్రీదేవి , అంగనామణులందరితోడ నీ చెంతకు చేరి ,
    ఉన్నతోన్నతమైన నీ పాదద్యయమును సుతిమెత్తగా ఒత్తుచున్నారు ! 🙏
    అందరికీ వెనుబలమై యున్న ఓ విష్ణుడా ,
    ప్రసన్నుడవై ఇక చక్కగా నిదురపోవయ్య ఓ శ్రీ వేంకటేశ్వరా !🙏
    🌹🙏🌹
    ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 476)
    ✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
    🌹🌹 సంకీర్తన 🌹🌹
    ఉయ్యాల యూఁపులు ఓ ముద్దులయ్యా
    వెయ్యారు గోపికలు వేడుక నూఁచెదరు
    // పల్లవి //
    భోగీంద్ర తల్పుఁడా భువన విఖ్యాతా
    గోగోపరక్షకా కువలయాధీశా
    ఆగమసన్నుతా యచ్యుతానంతా
    యోగనిద్ర పోవయ్య యోగీంద్రవంద్య
    // ఉయ్యాల //
    దెసలందు వెలిఁగెడి దేవర్షివరులు
    ప్రసరించి బంగారు భవనంబులోన
    కొసరక నిద్రించు గోవిందా యనుచు
    పసమీర పాడెదరు పన్నగశయనా
    // ఉయ్యాల //
    సన్నుతించెదరయ్యా సద్భాగవతులు
    పన్నుగా శ్రీభూమి వనితలు చేరి
    ఉన్నతి పదముల నొత్తెదరు నిద్రించు
    వెన్నుఁడా ప్రసన్న వేంకటరమణా
    // ఉయ్యాల //
    🌹🙏🌹🙏🌹

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  3 місяці тому +1

    సత్సంగ బంధు మిత్రులందరికీ , అన్నమయ్య అక్షర వేదం వీక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు !
    TOLI EKADASI GREETINGS TO ALL BHAGAVAT BHAKTAS AND ANNAMAYYA AKSHARA VEDAM VIEWERS AND SUBSCRIBERS .
    YOUR HUMBLE
    ANNAMAYYA PADA SEVAKA
    Y VENU GOPAL

  • @sandhyasreesahithyasangeet4822
    @sandhyasreesahithyasangeet4822 3 місяці тому +1

    అద్భుత విశ్లేషణ 🙏🙏🙏🙏🙏

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri1023 3 місяці тому +2

    Om Govindaya Namaha🙏🙏🙏 Madhuramaina uyyaala Sankeertana; Udipi Sri Krishnuni chakkaga Chupincharu; Beautiful drusyamalika; very nice Pradhana; thank you so much for presenting this, Sankeertana on Tholi ekadasi Day; excellently Abhinandanalu; Madhuramga sungby Sri Ranganath Garu; Om Sri prasanna Venkata Ramana, bless you; 🙏🙏🙏 tholi ekadasi Subhakankshalu

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  3 місяці тому +1

    Tholi Ekadasi Greetings To All ! 💐🙏
    🌺☘ ------------☘🌺
    ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 476
    ( UYYALA UUPULU O MUDDULAYYA .. )
    🌺☘ ------------☘🌺
    PREFACE :-- 🌹👇
    Annamacharya has described all the services that are offerred to The Lord ,as keertans , in a wonderful manner !🙏
    Among them, the lullabies composed as Pavalimpu seva & Unjala seva, are great melodies.🙏
    Let us know the meaning of such a beautiful Uyyala song ( Cradle Swing ) and sing it on this Toli Ekadashi day.🙏
    Ashada Shuddha Ekadashi has earned the distinction of being the first Ekadashi.🙏
    Learned Gurus Say that ,
    on this day Lord Srimannarayana will commence his Yogic Sleep.🙏
    Let Us Sing This Sweet Lullaby with gentle cradle swings !👇
    🌺☘ ------------☘🌺
    🌹🌹
    Here Are The Gentle Swings Of The Cradle
    To You Oh Cute & Charming Lord !🙏
    Thousands Of Herds-Women And Women Folk
    Are Here For You To Swing Your Cradle Merrily !🙏
    🌹🌹
    Oh Lord Whose Bed Is The Serpent King ,
    Oh Most Renowned Lord Of All Worlds ,
    Oh Protector Of Cows And Cowherdsmen ,
    Oh Lord Of The Earth ,
    Oh Lord Glorified By Vedas And Scriptures ,
    Oh Lord Achyuta ! And The Endless Lord !🙏
    Go To Yogic Sleep Oh Lord
    Who Is Worshipped By Great Ascetics !🙏
    🌹🌹
    The Great Celestial Sages Who Are Shining
    In All The Directions
    Are Spreading Their Love For You
    In This Golden Mansion !🙏
    Do Sleep Now Of Lord !Without Demanding
    More And More Swings and Songs !🙏
    By Chanting Govinda Govinda !Every One Will Sing
    At Their Best Oh Lord Reclining On The Serpent king !🙏
    🌹🌹
    The Best Of The Best Devotees Of You Are
    Singing Your Holy Praise !🙏
    In An Apt Way Mahalakshmi And Mother Earth
    Are Also Praising Along With All Women !🙏
    They All Are Gently Pressing Your Holiest Feet !
    Do Sleep Now Oh Lord
    Oh Supporter Of Every One ! Oh Vishnu !
    Oh Charming Lord Venkateswara ! Go to Sleep Now !🙏
    🌹🙏🌹
    Om Sri Alamelumnaga Sametha
    Sri Venkateswara Swaminey Namaha !🙏
    🌹🙏🌹
    ✍ --Venu Gopal